• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

భారత్ లో కరోనా కట్టడికి లాక్ డౌన్ .. కరోనా సంక్షోభంపై ప్రముఖ వైద్య నిపుణులు ఫౌసీ హెచ్చరిక ఇదేనా ?

|

భారత్ తో తాజా పరిస్థితులలో కరోనా కట్టడికి లాక్ డౌన్ ఒక్కటే మార్గమని ప్రముఖ డాక్టర్ ఆంథోనీ ఎస్ ఫౌసీ చెప్తున్నారు. ఏ దేశమూ లాక్ డౌన్ చేయటానికి ఇష్టపడదు కాని కొన్ని వారాల పాటు తక్షణం లాక్ డౌన్ చేయడంతో భారతదేశంలో కరోనా వ్యాప్తిని అంతం చేయవచ్చని కరోనా మహమ్మారిపై అధ్యయనం చేస్తున్న ప్రముఖ డాక్టర్ ఆంథోనీ ఎస్ ఫౌసీ పేర్కొన్నారు. ప్రస్తుతం భారత దేశం చాలా సంక్లిష్ట పరిస్థితుల్లో ఉందని అంతర్జాతీయంగా కరోనా వైరస్ పై అధ్యయనం చేస్తున్న డాక్టర్ ఫౌసీ పేర్కొన్నారు.

భారత్ లోకరోనా ఉగ్రరూపం : 4 లక్షలు దాటిన తాజా కేసుల రికార్డు, 3,523 మరణాలుభారత్ లోకరోనా ఉగ్రరూపం : 4 లక్షలు దాటిన తాజా కేసుల రికార్డు, 3,523 మరణాలు

 దేశంలో కొన్ని వారాలపాటు షట్ డౌన్ చేయాల్సిన అవసరం ఉందని డాక్టర్ ఫౌసీ సలహా

దేశంలో కొన్ని వారాలపాటు షట్ డౌన్ చేయాల్సిన అవసరం ఉందని డాక్టర్ ఫౌసీ సలహా

కరోనా వ్యాప్తి నివారణకు దేశంలో కొన్ని వారాలపాటు షట్ డౌన్ చేయాల్సిన అవసరం ఉందని డాక్టర్ ఫౌసీ సలహా ఇచ్చారు. బైడెన్ అడ్మినిస్ట్రేషన్ యొక్క ప్రధాన వైద్య సలహాదారు మరియు ఏడుగురు యుఎస్ ప్రెసిడెంట్లతో కలిసి పనిచేసిన ఫౌసీ, మేరీల్యాండ్ లోని బెథెస్డాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ నుండి భారతదేశ తాజా పరిస్థితిపై స్పందించారు. భారత్ లో కరోనాకు అడ్డుకట్ట వేయడానికి ఈ మూడు మార్గాలు ఉన్నాయని పేర్కొన్న ఫౌసీ వాటిని తాత్కాలిక, మధ్యస్థ ,దీర్ఘకాలిక పరిష్కారాలుగా పేర్కొన్నారు.

 కరోనా కట్టడికి పలు సూచనలు ఇచ్చిన డాక్టర్ ఫౌసీ

కరోనా కట్టడికి పలు సూచనలు ఇచ్చిన డాక్టర్ ఫౌసీ

ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ప్రజలకు టీకాలు వేయడం తప్పనిసరి అని స్పష్టం చేశారు. తాత్కాలిక ఆసుపత్రులను ఏర్పాటు చేయాలని, ఆక్సిజన్ అవసరాల కోసం యుద్ధ ప్రాతిపదికన ఆక్సిజన్ ప్లాంట్లను నిర్మించాలని, మందులు మొదలైన వాటి కోసం ఇతర దేశాల సహాయం తీసుకోవాలని డాక్టర్ ఫౌసీ పేర్కొన్నారు. ఈ విషయంలో అమెరికా అనుసరించిన విధానాలు అమలు చేయాలని స్పష్టంచేశారు ఫౌసీ. రెండు మూడు వారాల పాటు షట్ డౌన్ చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకురావచ్చని, కరోనా కట్టడి కోసం ఒక ఆర్నెల్లపాటు లాక్ డౌన్ చేయాల్సిన అవసరం లేదని ఫౌసి అభిప్రాయం వ్యక్తం చేశారు.

 లాక్ డౌన్ విధిస్తే తప్ప పరిస్థితి అదుపులోకి రాదు

లాక్ డౌన్ విధిస్తే తప్ప పరిస్థితి అదుపులోకి రాదు

దేశంలో ఉన్న మిలట్రీతో సహా అన్ని యంత్రాంగాల సహాయాన్ని తీసుకోవాలన్నారు.చైనా తరహాలో తాత్కాలిక ఆసుపత్రుల నిర్మాణం జరగాలన్నారు.ఇతర దేశాల సహాయం తీసుకోవాలని, కరోనా మహమ్మారికి పేద, ధనిక దేశం అన్న తేడా లేదని ఎక్కడైనా పంజా విసురుతుందని ఫౌసీ స్పష్టం చేశారు.ప్రస్తుతం నాలుగు లక్షలకు పైగా రోజువారి కేసులు నమోదు అవుతున్న తరుణంలో లాక్ డౌన్ విధిస్తే తప్ప కరోనా మహమ్మారి వ్యాప్తిని అడ్డుకోలేమన్న విషయాన్ని వైద్య నిపుణుడు ఫౌసీ పేర్కొన్నారు.

 కరోనా కట్టడికి, సత్ఫలితాలను ఇవ్వని భారత్ వ్యూహం

కరోనా కట్టడికి, సత్ఫలితాలను ఇవ్వని భారత్ వ్యూహం

ఇప్పటికైనా భారతదేశ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని,లాక్ డౌన్ విషయంలో నిర్ణయం తీసుకుంటే కరోనా దారుణ పరిస్థితులు నుండి భారతదేశానికి బయటపడడానికి కాస్త వెసులుబాటు దొరుకుతుందని ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.అయితే భారతదేశంలో కరోనా కట్టడికి కేంద్ర ప్రభుత్వం ఈసారి నూతన వ్యూహంతో ముందుకు వెళుతుంది. ఎక్కడ సమస్య ఉంటే అక్కడ మాత్రమే చర్యలు తీసుకునేలా రాష్ట్ర ప్రభుత్వాలకు సూచనలు ఇస్తున్నారు. కరోనా కట్టడికి భారత్ వ్యూహం సత్ఫలితాలను ఇవ్వటం లేదు.

  Covid-19 : 40 ‘Vaccinated’ Doctors In UP Test Covid-19 Positive
   వైద్యనిపుణుల హెచ్చరికలతో అయినా లాక్ డౌన్ విధిస్తారా ?

  వైద్యనిపుణుల హెచ్చరికలతో అయినా లాక్ డౌన్ విధిస్తారా ?

  దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ఉండబోదని, ఒకవేళ అదే కనుక జరిగితే దేశ ఆర్థిక పరిస్థితి దిగజారిపోతుందని చెప్తున్నారు. ఊహించని విధంగా నాలుగు లక్షలకు పైగా రోజువారి కేసులు పెరుగుతున్న ఈ తరుణంలోనైనా, వైద్య నిపుణుల సలహా మేరకు భారతదేశం లాక్ డౌన్ పై ఏమైనా నిర్ణయం తీసుకుంటుందా ?అన్నది వేచి చూడాల్సిందే.

  English summary
  Amid surging coronavirus cases in India, Dr Anthony S Fauci spoke on India’s Covid Crisis. He advised to shut down the country for a few weeks, and hang in there, take care of each other, we’ll get to a normal situation Dr Anthony S Fauci says .
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X