బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మాజీ వైస్ చాన్సలర్ హత్య, సీఎం మీద కేసు పెట్టాడు, నడి రోడ్డులో నరికి చంపేశారు !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: అలయన్స్ యూనివర్శిటీ మాజీ వైస్ చాన్సలర్ దారుణ హత్యకు గురైనారు. ఇంటి సమీపంలో వాకింగ్ చెయ్యడానికి వెళ్లిన అలయన్స్ యూనివర్శిటీ మాజీ వైస్ చాన్సలర్ డాక్టర్ అయ్యప్ప దూరెను గుర్తు తెలియని వ్యక్తులు మారణాయుధాలు, వేట కోడవళ్లతో నడిరోడ్డులో నరికి కిరాతకంగా హత్య చేశారు. డాక్టర్ అయ్యప్ప హత్యకు గురైన ప్రాంతంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పోలీసులు స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారు. డాక్టర్ అయ్యప్ప హత్యకు కచ్చితమైన కారణాలు మాత్రం తెలియడం లేదని బెంగళూరు పోలీసులు అంటున్నారు.

మాజీ డిప్యూటీ సీఎం పీఏ ఆత్మహత్య.. చివరి ఫోన్ కాల్స్ ఎవరికి ? డైరీలో!మాజీ డిప్యూటీ సీఎం పీఏ ఆత్మహత్య.. చివరి ఫోన్ కాల్స్ ఎవరికి ? డైరీలో!

ప్రతిరోజూ వాకింగ్

ప్రతిరోజూ వాకింగ్

బెంగళూరు నగరంలోని ఆర్ టీ నగర్ అలయన్స్ యూనివర్శిటీ మాజీ వైస్ చాన్సలర్ డాక్టర్ అయ్యప్ప దూరె నివాసం ఉంటున్నారు. ప్రతిరోజూ రాత్రి భోజనం చేసిన తరువాత డాక్టర్ అయ్యప్ప దూరె వాకింగ్ కు వెలుతుంటారు.

వేట కోడవళ్లు, కత్తులు

వేట కోడవళ్లు, కత్తులు

మంగళవారం రాత్రి భోజనం చేసిన డాక్టర్ అయ్యప్ప దూరె ఇంటి సమీపంలో వాకింగ్ చెయ్యడానికి వెళ్లారు. వాకింగ్ కు వెళ్లిన డాక్టర్ అయ్యప్ప దూరె ఎంతసేపు అయినా ఇంటికి తిరిగి రాలేదు. వాకింగ్ వెళ్లిన డాక్టర్ అయ్యప్ప దూరెను గుర్తు తెలియని వ్యక్తులు మారణాయుధాలు, వేట కోడవళ్లు, కత్తులతో నరికి పరారైనారు.

నడిరోడ్డులో నరికేశారు

నడిరోడ్డులో నరికేశారు

డాక్టర్ అయ్యప్ప దూరె ఎంత సేపటికి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆయన కోసం గాలించారు. నడి రోడ్డులో రక్తపు మడుగులో పడిఉన్న డాక్టర్ అయ్యప్ప దూరెను గుర్తించిన కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

 ప్రత్యేక పోరాటం

ప్రత్యేక పోరాటం

డాక్టర్ అయ్యప్ప దూరె ప్రత్యేక లింగాయుత ధర్మం కోసం చేస్తున్న పోరాటంలో చురుకుగా పాల్గొన్నారు. మహాదాయి నీటి కోసం మహారాష్ట్ర ప్రభుత్వంతో జరుగుతున్న పోరాటంలో, రైతుల కోసం జరుగుతున్న పోరాటంలో డాక్టర్ అయ్యప్ప దూరె పాల్గొన్నారు.

యడియూరప్ప మీద ఫిర్యాదు

యడియూరప్ప మీద ఫిర్యాదు

శివరామ కారంత అక్రమ లేఔట్ డినోటిఫికేషన్ విషయంలో ప్రస్తుత ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప మీద ఫిర్యాదు చేసిన అలయన్స్ విశ్వవిద్యాలయం మాజీ వైస్ చాన్సలర్ డాక్టర్ అయ్యప్ప దూరె దారుణ హత్యకు గురి కావడంతో కలకలంరేగింది.

రాజకీయ పార్టీ

రాజకీయ పార్టీ

2018 శాషన సభ ఎన్నికల సమయంలో కళాస బండూరి పోరాటం చేస్తున్న వారిని కలుపుకున్న డాక్టర్ అయ్యప్ప దూరె జన సామాన్య పార్టీ (జన సామాన్య పక్ష) అనే ప్రాంతీయ పార్టీని స్థాపించి రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. డాక్టర్ అయ్యప్ప దూరె హత్యతో బెంగళూరు నగర ప్రజలు ఉలిక్కిపడ్డారు.

English summary
Bengaluru: Dr. D. Ayyappa Dore former vice chancellor of Alliance university found murdered in Bengaluru. R.T.Nagar police visited the spot and probing the case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X