వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యూపీ డా. కఫీల్ ఖాన్ సోదరుడిపై కాల్పులు: పరిస్థితి విషమం

|
Google Oneindia TeluguNews

గోరఖ్‌పూర్‌: ఉత్తరప్రదేశ్‌లో 60మంది చిన్నారుల మృతికి కారణమని ఆరోపణలు ఎదుర్కొన్న వైద్యుడు కఫీల్‌ఖాన్‌ సోదరుడిపై గుర్తుతెలియని వ్యక్తులు ఆదివారం రాత్రి కాల్పులు జరిపారు. అది కూడా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇంటికి అరకిలోమీటర్‌ దూరంలోనే ఈ ఘటన జరగడం గమనార్హం. కొందరు దుండగులు ఆదివారం రాత్రి ద్విచక్రవాహనం మీద వచ్చి ఈ కాల్పులకు పాల్పడ్డారు.

'గోరఖ్‌నాథ్ ఆలయానికి 500 మీటర్ల దగ్గర్లో ఈ ఘటన జరగడంతో నేను చాలా షాక్‌కు గురయ్యాను. ముఖ్యమంత్రి నివాసం కూడా సమీపంలోనే ఉంది' అని బాధితుడు కసీఫ్‌ జమీల్‌ సోదరుడు కఫీల్ ఖాన్ మీడియాతో వెల్లడించారు. కసీఫ్‌ మెడలో బుల్లెట్ దిగింది. కాల్పులు జరిగిన మూడు గంటల తర్వాత అతడిని ఆస్పత్రికి తరలించి శస్త్రచికిత్స చేయించారని.. పోలీసులు తన సోదరుడిని అటూ ఇటూ తిప్పి విలువైన సమయాన్ని వృథా చేశారని కఫీల్ ఆరోపించారు.

Dr Kafeel Khans brother shot at in UP’s Gorakhpur, condition critical

కాగా, 48 గంటల పాటు పర్యవేక్షణలో ఉంచాలని వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం కసీఫ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఇది ఇలా ఉండగా, 'యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం వద్ద ఆక్సిజన్‌ సిలిండర్లకు చెల్లించడానికి కూడా డబ్బులు లేవు. అప్పుడే కఫీల్ ఖాన్‌ పిల్లలను రక్షించాడు. కానీ అతడిని తీసుకెళ్లి జైల్లో పెట్టారు. ఇప్పుడు అతడి సోదరుడి మీద కాల్పులు జరిపారు. బుల్లెట్లు, రక్తపాతం, విద్వేష ప్రసంగాలు, హింసను అందించే మీ అచ్చేదిన్‌కు అభినందనలు' అని గుజరాత్ ఎమ్మెల్య జిగ్నేష్‌ మేవానీ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు.

కాగా, బీఆర్‌డీ ఆస్పత్రిలో కఫీల్ ఖాన్ చిన్నపిల్లల విభాగానికి ఇంఛార్జిగా ఉండేవారు. 2017, ఆగస్టులో బీఆర్‌డీ ఆసుపత్రిలో ఆక్సిజన్ సరఫరా లేక వారం వ్యవధిలో 60 మంది చిన్నారులు మరణించారు. అప్పటికీ ప్రైవేటు ఆసుపత్రి నుంచి ఆక్సిజన్ సిలిండర్లు తెప్పించి కఫీల్ ఖాన్ పిల్లలను బతికించే ప్రయత్నం చేసినట్లు ఆయన సన్నిహితులు తెలిపారు. ఆక్సిజన్ సిలిండర్ల కొరత లేదని, కఫీల్ నిర్లక్ష్యం కారణంగానే చిన్నారులు చనిపోయారని ప్రభుత్వం ఆ ఆరోపణలను కొట్టివేసింది. ఈ కేసుకు సంబంధించి కఫీల్ ఖాన్ 8నెలలు జైల్లో ఉన్నారు. అతడి మీద వచ్చిన ఆరోపణలు నిర్ధారణ కాకపోవడంతో ఏప్రిల్ 25న అతడిని విడుదల చేశారు.

English summary
Kashif Jameel, the younger brother of Dr Kafeel Khan--an accused in the BRD Medical College case involving the death of 63 children in Uttar Pradesh's Gorakhpur last year--was shot at allegedly by some unidentified bike-borne miscreants on Sunday night in the city.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X