వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్పుత్నిక్-వి : 10లక్షల డోసుల వ్యాక్సిన్... రష్యాతో డా.రెడ్డీస్ ల్యాబోరేటరీస్ భారీ ఒప్పందం...

|
Google Oneindia TeluguNews

కరోనా వ్యాక్సిన్ స్పుత్నిక్-వి మూడో దశ క్లినికల్ ట్రయల్స్,సప్లై కోసం రష్యా భారత ఫార్మా దిగ్గజం డా.రెడ్డీస్ ల్యాబోరేటరీస్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్(RDIF)తో కుదిరిన ఈ ఒప్పందం మేరకు డా.రెడ్డీస్ ల్యాబోరేటరీస్ 10కోట్ల డోసుల స్పుత్నిక్ వి వ్యాక్సిన్‌ను సప్లై చేయనుంది. వ్యాక్సిన్ ఉత్పత్తి,మూడో దశ క్లినికల్ ట్రయల్స్ కోసం రష్యాతో భాగస్వామ్యాన్ని భారత్ ధ్రువీకరించిన వారానికే తాజా ఒప్పందం జరగడం గమనార్హం.

త్వరలోనే భారత్‌లో క్లినికల్ ట్రయల్స్...

త్వరలోనే భారత్‌లో క్లినికల్ ట్రయల్స్...


రష్యాలోని గమలేయా రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ తయారుచేసిన స్పుత్నిక్-వి వ్యాక్సిన్‌కు మూడో దశ క్లినికల్ ట్రయల్స్ పూర్తి కాకుండానే అక్కడి ప్రభుత్వం అనుమతులిచ్చింది. అయితే భారత్‌లో మాత్రం అలా జరగదు. ఇక్కడ పెద్ద సంఖ్యలో మూడో దశ క్లినికల్ ట్రయల్స్ పూర్తయి... రెగ్యులేటరీ సంస్థలు దీని సేఫ్టీని ధ్రువీకరించాకే వ్యాక్సిన్ వాడకానికి అనుమతిస్తారు.డా.రెడ్డీస్ ల్యాబోరేటరీస్ కోఛైర్మన్,ఎండీ జీవీ ప్రసాద్ మాట్లాడుతూ.. ఆర్‌డీఐఎఫ్‌తో ఒప్పందం కుదుర్చుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఇప్పటికే స్పుత్నిక్ వి మొదటి,రెండో దశ ప్రయోగాలు సంతృప్తికర ఫలితాలనిచ్చాయని అన్నారు. త్వరలోనే భారత్‌లో మూడో దశ ప్రయోగాలు ప్రారంభిస్తామన్నారు.

ఈ ఏడాది చివరి నాటికి...

ఈ ఏడాది చివరి నాటికి...

ఆర్‌డీఐఎఫ్ సీఈవో కిరిల్ దిమిత్రేవ్ మాట్లాడుతూ... గత 25 ఏళ్లుగా రష్యాలో డా.రెడ్డీస్ ల్యాబోరేటరీస్‌కు గౌరవనీయమైన స్థానం ఉందన్నారు. అడెనోవైరస్ వెక్టార్ ప్లాట్‌ఫామ్‌తో అభివృద్ది చేసిన స్పుత్నిక్ వి వ్యాక్సిన్ వైరస్‌తో పోరాడేందుకు భారత్‌ ముందున్న ఒక సురక్షితమైన,శాస్త్రీయమైన ఆప్షన్ అన్నారు. క్లినికల్ ట్రయల్స్ విజయవంతంగా పూర్తయి రెగ్యులేటరీ సంస్థల అనుమతులు రావడానికి కొంత సమయం పడుతుందన్నారు. ఈ ఏడాది చివరి నాటికి వ్యాక్సిన్ అందుబాటులోకి రావచ్చునని చెప్పారు.

ఎలాంటి దుష్ప్రభావాలు లేవు...

ఎలాంటి దుష్ప్రభావాలు లేవు...


కరోనాపై పోరులో అందుబాటులోకి వచ్చిన మొట్టమొదటి వ్యాక్సిన్‌గా స్పుత్నిక్ వి గుర్తింపు తెచ్చుకుంది. అయితే మూడో దశ క్లినికల్ ట్రయల్స్ పూర్తి కాకుండానే దీని వాడకానికి రష్యా అనుమతులివ్వడంపై పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దాని సామర్థ్యంపై పలు దేశాలు సందేహాలు కూడా వ్యక్తం చేశాయి. అయితే వ్యాక్సిన్ ప్రయోగాల్లో ఎలాంటి దుష్ప్రభావాలు లేవని ఇటీవల ప్రముఖ జర్నల్ లాన్సెట్ వెల్లడించడంతో చాలా దేశాలు స్పుత్నిక్ విపై దృష్టి సారించాయి.

మరో రెండు కంపెనీల వ్యాక్సిన్ ఒప్పందాలు..

మరో రెండు కంపెనీల వ్యాక్సిన్ ఒప్పందాలు..

భారత్‌కు చెందిన మరో రెండు కంపెనీలు కూడా ఇప్పటికే వ్యాక్సిన్ డెవలపర్స్‌తో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఇందులో పుణేకి చెందిన సీరిమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా,హైదరాబాద్‌కి చెందిన బయోలాజికల్ ఈ కంపెనీలు ఉన్నాయి. ఇటీవల కొన్ని కారణాల వల్ల ఆస్ట్రాజెనెకా ప్రయోగాలు నిలిచిపోగా తిరిగి పునరుద్దరించిన సంగతి తెలిసిందే. మూడో దశ క్లినికల్ ట్రయల్స్ కూడా విజయవంతంగా పూర్తయితే ఈ వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

English summary
Indian pharma giant Dr. Reddy’s Laboratory Ltd. has partnered with the Russian Direct Investment Fund (RDIF) to conduct phase-III trials of Russian vaccine Sputnik V and will distribute 10 crore doses of the anti-coronavirus vaccine, a press note released by RDIF said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X