• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

D-30 డిసేబిలిటీ ఇంపాక్ట్ లిస్టు 2021 జాబితాలో భారత్‌ నుంచి డాక్టర్ సాయి కౌస్తువ్ గుప్తాకు చోటు

|

అమెరికన్ దివ్యాంగుల చట్టం వచ్చి 31 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా అమెరికాకు చెందిన గ్లోబల్ ఎంటర్ప్రైజ్ సంస్థ డైవర్సబిలిటీ ప్రపంచానికి దివ్యాంగుల శక్తిని చాటే ప్రయత్నం చేసింది. ఇందులో భాగంగా 2021 సంవత్సరానికిగాను టాప్ D-30 దివ్యాంగుల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో ఉన్న దివ్యాంగుల విజయాలను గుర్తు చేస్తూ వారిని గౌరవించింది.

13 దేశాల నుంచి 300 నామినేషన్స్‌ రాగా ఇందులో భారత్ నుంచి డాక్టర్ సాయి కౌస్తువ్ దాస్‌గుప్తా తుది జాబితా అయిన D-30 డిజబిలిటీ ఇంపాక్ట్ లిస్టు 2021లో స్థానం దక్కించుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రభావవంతమైన సభ్యులను ఎంపిక చేసి వారు సాధించిన విజయాలను గుర్తు చేస్తూ గౌరవించింది. ఇక భారత్ నుంచి ప్రాతినిథ్యం వహించిన డాక్టర్ సాయి కౌస్తువ్... ప్రపంచంలోని దివ్యాంగుల సమస్యల పరిష్కారంకై కృషి చేయడం, అతని నాయకత్వంలో సాధించిన విజయాలు ఎందరికో స్ఫూర్తి దాయకంగా మారింది.

Dr. Sai Kaustuv Dasgupta from India makes it to The D-30 Disability Impact List 2021

డాక్టర్ సాయి కౌస్తువ్ ఒక ఆస్టియోజెనిసిస్ ఇంపెర్ఫెక్టా వారియర్.కొన్ని లక్షల మందికి స్ఫూర్తిగా నిలిచారు. మానవ జాతిని ప్రకాశింపచేయడంలో ఎనలేని కృషి చేసి ఏది అసాధ్యం కాదు అని నిరూపించారు. అరుదైన ఎముక జబ్బుతో బాధపడుతూ దాదాపు 90శాతం అంగవైకల్యంతో ఉంటూ కూడా తన కెరీర్‌ను లేదా ఆశయాన్ని ఎన్నడూ వీడలేదు. తాను ఒక విజయవంతమైన గ్రాఫిక్ డిజైనర్‌గా పేరు తెచ్చుకున్నారు. ఓ ప్రపంచ స్థాయి మోటివేషనల్ స్పీకర్‌గా కూడా గుర్తింపు పొందారు. మంచికోసం తపన పడే దౌత్యవేత్త, సర్టిఫైడ్ హ్యాపినెస్ కోచ్‌గా కూడా పేరుగాంచారు. లింకా రికార్డుతో పాటు మరో 15 ప్రపంచ రికార్డులు అతని సొంతం. అంగవైకల్యంతో తాము ఏమీ సాధించలేమన్న నిరాశలో ఉన్నారో వారిలో వెలుగును నింపే బాధ్యతను తన భుజాలపై వేసుకున్నారు డాక్టర్ సాయి కౌస్తువ్ .వారుంటున్న ప్రాంతాలకు వీల్‌ఛైర్‌లు అందుబాటులో ఉండేలా చూస్తున్నారు.

హ్యాపినెస్ కోచింగ్ ద్వారా డాక్టర్ సాయి కౌస్తువ్ చాలా మందిని కలిశారు. అదే సమయంలో వారిలో ధైర్యాన్ని నింపి వారికి ప్రేరణగా నిలిచారు. వీరిలో ప్రపంచ నాయకులు, పండితులు, వైద్యులు, విద్యార్థులు, కార్పొరేట్ ప్రజలు, ఎల్‌జీబీటీక్యూ కమ్యూనిటీ, మురికివాడ పిల్లలు, మహిళలు మరియు యువ ఐటి నిపుణులు ఉన్నారు. తనకున్న నైపుణ్యంతో వివిధ వర్గాల వారు జీవితంలో ఎలా విజయం సాధించాలో మోటివేట్ చేశారు. తన క్రియేటివిటీ, నైపుణ్యం, జ్ఞానంతో వారిని ప్రేరేపించగలిగారు. వివిధ దేశాల్లోని పలు రకాల వర్గాల వారితో డాక్టర్ సాయి కౌస్తువ్ మాట్లాడారు. అమెరికా, ఆస్ట్రేలియా, మలేషియా, సింగపూర్ లాంటి దేశాల్లోని ప్రజలతో ఆయన మాట్లాడారు. జీవితంలో సంతోషం సమాధానం ఉండాలంటే ఎన్నో మార్గాలున్నాయని అయితే సరైన మార్గంను ఎలా ఎంచుకోవాలనేదే కీలకమని చెప్పారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా వాటిని పాజిటివ్‌గా మలుచుకుని ముందుకు వెళితే ఓ వ్యక్తి తనకు తానుగా సక్సెస్ అవుతారని చెప్పారు.

2021 డి -30 డిసేబిలిటీ ఇంపాక్ట్ జాబితాలో భారతదేశం నుండి ఎంపిక కావడంతో డాక్టర్ సాయి కౌస్తువ్ ఐక్యరాజ్యసమితి ప్రతిపాదించిన సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ (ఎస్డిజి) తో పాటు ఇతర గ్లోబల్ డిసేబిలిటీ నాయకులతో కలిసి అంగవైకల్యం అనేది శాపం కాదని, ప్రపంచానికి తెలిపేందుకు వారితో కలిసి పనిచేస్తున్నారు.

English summary
Among 300 nominations across 13 countries, Dr. Sai Kaustuv Dasgupta from India got selected in the D-30 Disability Impact List 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X