• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మళ్ళీ కవ్వింపు చర్యలకు దిగుతున్న డ్రాగన్ కంట్రీ .. భారత భూభాగంలో చైనా గుడారాలు

|

భారతదేశంపై చైనా కుట్రలకు తెగబడుతూనే ఉంది. డ్రాగన్ కంట్రీ ఇంకా కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. ఒకపక్క కోర్ కమాండర్ స్థాయి భేటీకి ఏర్పాట్లు జరుగుతున్న వేళ చైనా మరో దురాక్రమణలకు పాల్పడింది.తూర్పు లడఖ్‌లోని డెమ్‌చోక్‌లోని చార్డింగ్ నాలా దగ్గర భారత భూభాగంలో చైనీయులు గుడారాలు నిర్మించినట్లు సీనియర్ అధికారులు తెలిపారు. ఈ గుడారాలను ఆక్రమించిన ప్రజలు చైనా ప్రజలు గా అధికారులు పేర్కొన్నారు. భారతదేశం వారిని తిరిగి వెళ్ళమని అడుగుతున్నప్పటికీ, వారు అక్కడి నుండి ఖాళీ చేయకుండా, అక్కడే ఉన్నట్లుగా అధికారులు చెబుతున్నారు.

 భారత్ లో కరోనా రికవరీల కంటే కొత్త కేసులే ఎక్కువ .. తాజాగా 39,361 కొత్త కేసులు, 416 మరణాలు భారత్ లో కరోనా రికవరీల కంటే కొత్త కేసులే ఎక్కువ .. తాజాగా 39,361 కొత్త కేసులు, 416 మరణాలు

 భారత భూభాగంలో చైనా గుడారాలు .. నిశితంగా పరిశీలిస్తున్న భద్రతా దళాలు

భారత భూభాగంలో చైనా గుడారాలు .. నిశితంగా పరిశీలిస్తున్న భద్రతా దళాలు


ఇదిలా ఉంటే నేడు ఇరుదేశాల మధ్య కోర్ కమాండర్ స్థాయి సమావేశం జరగాల్సి ఉన్నప్పటికీ, భారతదేశం సమావేశాన్ని పోస్ట్ పోన్ చేసింది. కార్గిల్ యుద్ధ విజయ దినోత్సవ కార్యక్రమాలు ఉండటంతో ఇండియా దీనిని వాయిదా వేసినట్లుగా సమాచారం. ఇదే సమయంలో భారత భూభాగంలో చైనీయులు గుడారాలు వేయడాన్ని భారత భద్రతా దళాలు, కేంద్రం నిశితంగా గమనిస్తోంది. 1990 లలో భారత-చైనా ఉమ్మడి వర్కింగ్ గ్రూపుల (జెడబ్ల్యుజి) సమావేశాల సందర్భంగా డెమ్‌చోక్ మరియు ట్రిగ్ హైట్స్ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (ఎల్‌ఐసి) పై వివాదాస్పదమైన అంశాలు ఉన్నాయని ఇరు పక్షాలు అంగీకరించాయి. ఇప్పుడు అక్కడే చైనా గుడారాలు వేసి కవ్విస్తోంది.

భారత సరిహద్దు వెంట వివాదాస్పద స్థలాలు .. భారత భూభాగంపై డ్రాగన్ కన్ను

భారత సరిహద్దు వెంట వివాదాస్పద స్థలాలు .. భారత భూభాగంపై డ్రాగన్ కన్ను

భారత సరిహద్దు రేఖ వెంట చైనాతో వివాదాస్పద 10 ప్రాంతాలు గుర్తించబడ్డాయి. సమర్ లుంగ్పా, డెప్సాంగ్ బల్జ్, పాయింట్ 6556, చాంగ్లంగ్ నాలా, కొంగ్కా లా, పాంగోంగ్ త్సో నార్త్ బ్యాంక్, స్పాంగ్‌గుర్, మౌంట్ సాజున్, డుమ్చెలే మరియు చుమర్ లను వివాదాస్పద ప్రాంతాలుగా గుర్తించారు. వివాదాస్పదంగా పరస్పరం అంగీకరించబడిన ఈ 12 ప్రాంతాలతో పాటు, ఎల్‌ఐసి ఎక్కడ ఉందనే దానిపై చైనా భారత్ దేశాల ఇరుపక్షాలకు భిన్నమైన అవగాహన ఉంది. గత సంవత్సరంలో తూర్పు లడఖ్‌లోని ఎల్‌ఐసికి ఐదు ఘర్షణ పాయింట్లు కూడా అదనంగా చేరాయని అధికారులు చెబుతున్నారు.

12 వ రౌండ్ కార్ప్స్ కమాండర్ స్థాయి చర్చలు పోస్ట్ పోన్ చేసిన ఇండియా

12 వ రౌండ్ కార్ప్స్ కమాండర్ స్థాయి చర్చలు పోస్ట్ పోన్ చేసిన ఇండియా

ఈ ఐదు ఘర్షణ పాయింట్లు గాల్వన్ వ్యాలీలోని కెఎమ్ 120, పిపి 15 మరియు షియోక్ సులా ప్రాంతంలో పిపి 17 ఎ, రెచిన్ లా, మరియు రెజాంగ్ లా అని అధికారులు తెలిపారు. చైనా 12 వ రౌండ్ కార్ప్స్ కమాండర్ స్థాయి చర్చలను సోమవారం ప్రతిపాదించింది, కాని 1999 కార్గిల్ యుద్ధంలో పాకిస్థాన్‌పై సాధించిన విజయాన్ని గుర్తు చేసుకునేందుకు జూలై 26 ను కార్గిల్ దినోత్సవంగా పాటిస్తున్న భారత్, చర్చలను కొద్ది రోజులు వాయిదా వేయాలని కోరింది. కార్ప్స్ కమాండర్ స్థాయి చర్చలు ఇప్పుడు ఆగస్టు మొదటి వారంలో లేదా అంతకు ముందే జరిగే అవకాశం ఉందని వర్గాలు తెలిపాయి.

లడఖ్ ప్రతిష్టంభన.. నిరంతరం సందేశాలను మార్పిడి చేసుకుంటున్న భారత్ - చైనా

లడఖ్ ప్రతిష్టంభన.. నిరంతరం సందేశాలను మార్పిడి చేసుకుంటున్న భారత్ - చైనా

2020 మే నుండి భారతదేశం మరియు చైనా మధ్య తూర్పు లడఖ్‌లో జరిగిన ఘర్షణల కారణంగా చోటుచేసుకున్న వివాదం పై చివరి కార్ప్స్ కమాండర్-స్థాయి చర్చలు ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగాయి. అయితే, కార్ప్స్ కమాండర్ స్థాయిలో చర్చలు ఆలస్యం అయినప్పటికీ, హాట్లైన్ విషయంలో ఇరుపక్షాలు నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాయి. ప్రతిష్టంభన ప్రారంభమైనప్పటి నుండి, ఇరువర్గాలు దౌలత్ బేగ్ ఓల్డీ మరియు చుషుల్ వద్ద హాట్లైన్ల ద్వారా దాదాపు 1,500 సార్లు సందేశాలను మార్పిడి చేశాయని అధికారులు తెలిపారు.

భారత్ కు రోజుకో తలనొప్పి తెస్తున్న చైనా .. తాజాగా డెమ్‌చోక్‌లో

భారత్ కు రోజుకో తలనొప్పి తెస్తున్న చైనా .. తాజాగా డెమ్‌చోక్‌లో

మొదట అన్ని ఘర్షణ పాయింట్ల నుండి చైనా ఆక్రమణలను తొలగించాలని భారతదేశం ఒత్తిడి చేస్తున్నందున చర్చలు పురోగతి సాధించలేదని చెప్తున్నారు. ఇరుపక్షాలు ముఖాముఖి తలపడినా ఉద్రిక్తత లేదని అధికారులు చెబుతున్నారు భారతదేశం పూర్తిగా 2019 నాటి పరిస్థితులు నెలకొల్పాలని కోరుతుండగా చైనా అందుకు భిన్నంగా తన డిమాండ్ వినిపిస్తోంది. చైనా దళాలను శాంతి సమయాల్లో మోహరించే చోట ఉంచితే చాలని అభిప్రాయపడుతోంది. ఏది ఏమైనా నిత్యం ఏదో ఒక విధంగా చైనా భారత్ కు తలనొప్పి గానే మారుతుంది. ఇక తాజాగా భారత భూభాగంలో గుడారాలు వేసి చైనా రెచ్చగొడుతోంది.

English summary
The Chinese have erected tents on the Indian side of the Charding Nala in Demchok in eastern Ladakh, senior government officials said. The officials described the people occupying these tents as “so-called civilians”, and said that even though India has been asking them to go back, “their presence remains”.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X