బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆ నగరాన్ని చంపేస్తున్న చలి.. అక్కడ ఉష్ణోగ్రత ఎంతో తెలుసా..?

|
Google Oneindia TeluguNews

దేశంలో చలి పంజా విసురుతోంది. చలికి తట్టుకోలేక ప్రజలు ఇళ్లను వదిలి బయటకు రావడం లేదు. బయటకు వచ్చారంటే చలి బారిన ఎక్కడ పడాల్సి వస్తుందోనని ఇంట్లోనే దుప్పట్లు కప్పుకుని ఉంటున్నారు ప్రజలు. ఇక గార్డెన్ సిటీ బెంగళూరులో అయితే పరిస్థితి మరింత దిగజారింది. అక్కడి వాతావరణం మరింత పడిపోయింది. భూమిపై అత్యంత చల్లని ప్రదేశం బెంగళూరు అంటూ నెటిజెన్లు ట్వీట్ చేస్తున్నారంటే అక్కడి పరిస్థితి ఎలా ఉందో ఊహించొచ్చు.

బెంగళూరును వణికిస్తున్న చలి

బెంగళూరును వణికిస్తున్న చలి

గత కొద్ది రోజులుగా బెంగళూరు నగరాన్ని చలి వణికిస్తోంది. ఉదయం 11 గంటలకు కూడా ప్రజలు ప్రధాన రహదారులపై కనిపించడం లేదంటే అందుకు కారణం చలి. గజగజ వణుకుతూనే కొందరు ఆఫీసులకు వెళుతున్నారు. ఇక ఇంటిపట్టునే ఉన్నవారైతే ఏకంగా దుప్పట్లు కప్పుకుని వెచ్చగా కాలం గడిపేస్తున్నారు. ఇక జనవరి 1న అయితే బెంగళూరులో ఉష్ణోగ్రతలు మరింత పడిపోయాయి. గత పదేళ్లలో ఎన్నడూ లేనంతగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. 2012 ఇదే జనవరి నెలలో 12 డిగ్రీల సెల్సియస్ నమోదైనట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. అదే 2009లో ఉష్ణోగ్రతలు 12.1 డిగ్రీల సెల్సియస్ నమోదు అయినట్లు పేర్కొంది. ఇక జనవరి 1వ తేదీన ఉష్ణోగ్రతలు 12.4 డిగ్రీలకు పడిపోయినట్లు వెల్లడించింది. ఇది గత పదేళ్లలో అత్యల్పంగా రికార్డు అయిన ఉష్ణోగ్రతలు. కాగా 1884 జనవరి 13వ తేదీన బెంగళూరు నగరంలో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో 7.8 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యాయి.

సాధారణ స్థాయి కన్నా 3.4 డిగ్రీల సెల్సియస్ తక్కువగా నమోదు

సాధారణ స్థాయి కన్నా 3.4 డిగ్రీల సెల్సియస్ తక్కువగా నమోదు

ఇదిలా ఉంటే... దక్షిణ కర్నాటకలో చల్లగాలులు వీస్తుండటం, పొడి వాతావరణం, ఆకాశంల పెద్దగా మేఘాలు లేకపోవడంతోనే బెంగళూరు నగరంలో చలి ఎక్కువగా ఉందని వాతావరణ నిపుణలు చెబుతున్నారు. వాతావరణ పరిస్థితులు ఇలానే కొనసాగితే ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే అవకాశం ఉందని వారు వెల్లడిస్తున్నారు. ఇక బుధవారం సాధారణ స్థాయికన్నా 3.4 డిగ్రీల సెల్సియస్‌కు ఉష్ణోగ్రతలు పడిపోయినట్లు వెదర్ డిపార్ట్‌మెంట్ పేర్కొంది.

 ఈశాన్య భారతంలో వీస్తున్న గాలులు కారణం

ఈశాన్య భారతంలో వీస్తున్న గాలులు కారణం

డిసెంబరు 15 నుంచి జనవరి 15 మధ్యకాలంలో ఉష్ణోగ్రతలు పడిపోవడం సాధారణమే అంటున్నారు యూనివర్శిటీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ ప్రొఫెసర్ రాజెగౌడ. ఈ సమయంలో బెంగళూరు నగరంలో తీవ్రమైన చలి నెలకొంటుందని చెప్పారు. ఈశాన్య భారతంలో వీస్తున్న చలిగాలుల ప్రభావంతోనే చలి కాస్త మరింత ముదురుతుందని చెప్పారు. ఉత్తర కర్నాటకలో కూడా చలి తీవ్రత ఎక్కువగానే ఉందని ప్రొఫెసర్ చెప్పారు. బీదర్‌లో మంగళవారం రోజున రికార్డు స్థాయిలో 6 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ రికార్డు అయ్యిందని చెప్పారు. బుధవారానికి 7.2 డిగ్రీల సెల్సియస్ నమోదు అయిందని వివరించారు.

English summary
“ How on earth is Bengaluru so cold.” “Too cold today than usual #Bangalore.” Twitter is abuzz with netizens pouring their views on Bengaluru Weather, which has suddenly turned colder in the last few days. In fact on tuesday night Bengaluru city almost hit a decadal low when it came to minimum temperature recorded in the city in January.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X