వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత అమ్ములపొదిలో సూపర్ గన్ -ప్రపంచంలోనే బెస్ట్ -48 కిలోమీటర్ల లక్ష్యం కూడా ఫటాఫట్

|
Google Oneindia TeluguNews

డ్రాగన్ చైనా, దాయాది పాకిస్తాన్ లతో సరిహద్దు వివాదాలు మరింత ఉద్రిక్తంగా మారుతోన్న వేళ సైనిక సంపత్తిని బలోపేతం చేసుకునే దిశగా భారత్‌ కీలక అడుగులు వేస్తోంది. విదేశాల నుంచి అత్యాధునిక ఆయుధాలను దిగుమతి చేసుకోవడంతోపాటు ఆత్మనిర్భర్‌ భారత్‌లో భాగంగా దేశీయంగానూ ఆయుధాలను అభివృద్ధి చేసుకుంటోంది. భారత రక్షణ పరిశోధనా సంస్థ డీఆర్‌డీఓ తాజాగా అభివృద్ధి చేసిన అడ్వాన్స్‌డ్‌ టౌడ్‌ ఆర్టిలెరీ గన్‌ సిస్టం (ఏటీఏజీఎస్‌) అనే అత్యాధునిక ఆయుధాన్ని శాస్త్రవేత్తలు విజయవంతంగా పరీక్షించారు..

Recommended Video

DRDO Says ATAGS Howitzer Best In World Artillery Edge To Defence Forces

ఒడిశాలో శనివారం నిర్వహించిన ఈ పరీక్షలు విజయవంతం అయ్యాయి. అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి 48 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని సైతం సులువుగా ఛేదించేలా ఏటీఏజీఎస్ తుపాకీని తయారు చేశారు. ప్రపంచంలోనే ది బెస్ట్ హోవిట్జర్ గన్ గా దీనిని అభివర్ణిస్తున్నారు డీఆర్‌డీఓ సైంటిస్టులు.

DRDO says ATAGS howitzer best in world, artillery edge to defence forces

2016 నుంచి డీఆర్‌డీఓ శాస్త్రవేత్తలు ఏటీఎజీఎస్‌ తుపాకుల ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టగా, భారత్‌ ఫోర్జ్‌ టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ కూడా ఇందులో భాగస్వామిగా పనిచేస్తున్నది. ఆత్మనిర్భర్‌ భారత్‌లో భాగంగా ఈ ఆయుధాన్ని దేశీయంగా అభివృద్ధి చేసినట్లు ప్రాజెక్టు డైరెక్టర్‌ శైలేంద్ర తెలిపారు. అంతర్జాతీయస్థాయి ఆయుధాలను తయారుచేసే సామర్థ్యం భారత్‌కు ఉందని, ఆయుధాల దిగుమతి కోసం ఇతర దేశాలపై ఆధారపడాల్సిన అవసరం మన దేశానికి లేదన్నారు.

భారత్ అమ్ములపొదిలోని సూపర్ గా భావించే ఏటీఏజీఎస్‌ తుపాకులను డీఆర్‌డీఓ ఇప్పటికే దేశీయంగా పలుచోట్ల పరీక్షలు జరపగా, తాజాగా చైనా, పాకిస్థాన్‌ సరిహద్దుల వద్ద కూడా టెస్టులు నిర్వహించి, శత్రువులకు సవాలు విసిరింది. ఈ తరహా తుపాకులు నిమిషానికి మూడు రౌండ్ల కాల్పులు మాత్రమే జరిపితే ఏటీఏజీఎస్‌ మాత్రం నిమిషానికి ఐదు రౌండ్ల కాల్పులు జరుపుతున్నట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. భవిష్యత్తులో ఈ తరహా తుపాకులు భారత ఆర్మీలో కీలకంగా మారే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.

English summary
In what could boost Modi government's plan to make India self-reliant in the crucial defence sector, the Defence Research and Development Organisation (DRDO) has successfully conducted the field trials of Advanced Towed Artillery Gun System (ATAGS) howitzers. The DRDO, which has developed the ATAGS howitzers along with Bharat Forge Limited and Tata Advanced Systems Limited, believes that it could solve the Army's requirement of 1800 artillery guns systems, claiming that it is the "best gun in the world".
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X