వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భార్యపై అత్యాచారం: డిఆర్‌డివో శాస్త్రవేత్తపై కేసు

By Pratap
|
Google Oneindia TeluguNews

DRDO scientist booked for allegedly raping wife
రాయపూర్: డిఆర్‌డివో శాస్త్రవేత్త ఒకరు భార్యపై అత్యాచారం చేసిన కేసులో ఇరుక్కున్నారు. తపస్ కుమార్ మజుందార్ అనే రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డిఆర్‌డివో) శాస్త్రవేత్త ఈ కేసులో చిక్కుకున్నారు. ఆయన డిఆర్‌డివోలోని ఆహార పరిశోధన ల్యాబొరేటరీ విభాగంలో పనిచేస్తున్నారు. తనపై ఆయన అత్యాచారం చేశారని తపస్ భార్య (30) పోలీసులకు ఫిర్యాదు చేశారు.

2011లో తమకు పెళ్లి అయిందని, అయితే అప్పటికే తపస్‌కు మరో పెళ్లయిన విషయాన్ని తన వద్ద దాచిపెట్టాడని ఆమె ఆరోపించారు. మొదటి భార్యకు విడాకులు ఇచ్చినట్లు చెప్పి తనను వివాహమాడాడని, కానీ విడాకులు తీసుకోని విషయం తనకు తర్వాత తెలిసిందని ఆమె వివరించారు

తపస్‌పై అత్యాచారం, మోసం, మోసగించి వివాహం చేసుకోవడం, భార్యను హింసించడం వంటి సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. తపస్ ప్రస్తుతం ఉత్తరాఖండ్‌లోని ముస్సోరిలో ఉద్యోగం చేస్తున్నారు.

తదపరి విచారణ చేపట్టి, తగిన చర్యలు తీసుకుంటామని రాయపూర్ పోలీసు సూపరింటిండెంట్ (ఎస్పీ) ఓపి పాల్ పిటిఐ వార్తా సంస్థతో చెప్పారు. ఆదివారం తపస్‌పై కేసు నమోదైంది.

English summary

 A Defence Research and Development Organization (DRDO) scientist was yesterday booked for allegedly raping his wife.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X