వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

DRDO మరో విజయం: హైపర్‌సోనిక్ టెక్నాలజీ డెమోన్స్‌ట్రేటర్ వెహికల్ పరీక్ష సక్సెస్..రాజ్‌నాథ్ అభినందనలు

|
Google Oneindia TeluguNews

ప్రముఖ రక్షణ రంగ సంస్థ డీఆర్‌డీఓ మరో విజయాన్ని తన ఖాతాలోకి వేసుకుంది. హైపర్ సోనిక్ టెక్నాలజీ డెమాన్స్‌ట్రేటర్ వెహికల్‌ను విజయవంతంగా పరీక్షించి డీఆర్‌డీఓ చరిత్ర సృష్టించింది. ఈ పరీక్ష సక్సెస్ కావడంతో స్వయం సమృద్ధిలో భారత్ కీలక ముందడుగు వేసినట్లయ్యింది. డీఆర్‌డీఓ సాధించిన ఈ విజయంపై రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభినందించారు. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతోనే ఈ జెట్ ఫ్లయిట్‌ను రూపొందించారు. దీంతో రక్షణరంగంలో ఆత్మనిర్భర్ భారత్‌ దిశగా అడుగులు వేస్తోందని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఈ టెక్నాలజీ నెక్ట్స్ జనరేషన్ హైపర్ సోనిక్ వాహనాలకు బాట వేసిందని రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

Recommended Video

#Watch DRDO successfully tests Indigenous Hypersonic Technology Demonstrator Vehicle|Oneindia Telugu

ఇదిలా ఉంటే ఈ ప్రాజెక్టును పూర్తి చేసిన శాస్త్రవేత్తలతో రాజ్‌నాథ్ సింగ్ ప్రత్యేకంగా మాట్లాడి అభినందించారు. ప్రధాని మోడీ విజన్‌గా ఉన్న ఆత్మనిర్భర్ భారత్‌, లక్ష్యాన్ని రక్షణరంగం తన భుజాలపై వేసుకుని పనిచేస్తున్న తీరును రక్షణ మంత్రి కొనియాడారు. రక్షణ రంగంలోని శాస్త్రవేత్తలను అభినందిస్తున్నట్లు చెప్పిన ఆయన ... ఎంతో గర్వంగా ఉందన్నారు.

DRDO Succesfully flight tested indigenously Hypersonic Technology Demonstrator Vehicle

హైపర్‌సోనిక్ టెక్నాలజీ డెమాన్స్‌ట్రేటర్ వెహికల్ స్క్రామ్ జెట్ ఇంజిన్‌తో రూపొందించడం జరిగింది. 20 సెకన్లలో 20 మైళ్ల వేగాన్ని కవర్ చేయగల సామర్ధ్యం ఈ జెట్ ఫ్లయిట్‌కు ఉందని ప్రభుత్వం పేర్కొంది. ఇక ఈ జెట్ ఫ్లయిట్‌లు బహుళ పౌర అవసరాలకు కూడా వినియోగించొచ్చని ప్రభుత్వం తెలిపింది. అంతేకాదు తక్కువ ఖర్చుతో ఉపగ్రహాలను సైతం ప్రయోగించేందుకు ఉపయోగపడటమే కాకుండా... సుదూర లక్ష్యాలను చేధించే క్షిపణులను కూడా ప్రయోగించే సామర్థ్యం వీటికి ఉందని రక్షణశాఖ వెల్లడించింది.

English summary
DRDO has today successfully flight tested the Hypersonic Technology Demonstrator Vehicle using the indigenously developed scramjet propulsion system.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X