కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మరో ఘనత: ఓర్వకల్లులో క్షిపణి ప్రయోగం విజయవంతం

|
Google Oneindia TeluguNews

కర్నూలు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో అరుదైన ఘనత దక్కింది. కర్నూలు జిల్లా ఓర్వకల్లులో చేసిన క్షిపణి ప్రయోగం విజయవంతమైంది. శత్రువుల యుద్ధ ట్యాంకులను ఛేదించే మ్యాన్ పోర్టబుల్ యాంటీట్యాంక్ గైడెడ్ మిసైల్‌ను డిఫెన్స్ రీసెర్చ్, డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్(డీఆర్డీఓ) బుధవారం విజయవంతంగా పరీక్షించింది.

 DRDO successfully flight-tests indigenously developed MPATGM missile

ఆర్మీ సహకారంతో ఈ క్షిపణిని ప్రయోగించామని, దీనిని థర్డ్ జనరేషన్ క్షిపణి అని డీఆర్డీఓ తెలిపింది. ఈ సందర్భంగా భారత రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ క్షిపణి విజయవంతంగా ప్రయోగించిన శాస్త్రవేత్తలు, అధికారులకు అభినందనలు తెలిపారు.

కాగా, ఈ క్షిపణి ప్రయోగం చేయడానికి ప్రత్యేక బృందం ఢిల్లీ నుంచి ఓర్వకల్లు వచ్చింది. బుధవారం సాయంత్రం 4గంటల సమయంలో ఈ క్షిపణిని ప్రయోగించారు. తక్కువ బరువు కలిగిన ఈ యాంటి ట్యాంక్ గైడెడ్ మిసైల్‌ను ఆర్మీ జవాను మోసుకెళ్లే విధంగా డీఆర్డీఓ రూపొందించడం గమనార్హం.

క్షిపణి ప్రయోగం విజయవంతమైందని, అనుకున్న సమయంలోని మిసైల్ లక్ష్యాలను చేధించిందని డీఆర్డీఓ వెల్లడించింది. దీంతో భారత ఆర్మీకి మరింత బలం చేకూరినట్లయింది.

English summary
In a major boost for Indian Army, Defence Research and Development Organisation (DRDO) on Wednesday successfully flight tested indigenously developed low weight, fire and forget Man Portable Antitank Guided Missile (MPATGM) in the ranges of Kurnool, Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X