వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత ఆర్మీ అమ్ములపొదిలో మరో అస్త్రం: నాగ్ యాంటీ ట్యాంక్ మిస్సైల్ ప్రయోగం సక్సెస్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భారత రక్షణ శాఖ అమ్ముల పొదిలో మరో అస్త్రం చేరనుంది. డీఆర్‌డీఓ రూపొందించిన నాగ్ యాంటీ ట్యాంక్ మిస్సైల్ చివరి దశ ట్రయల్స్‌ విజయవంతగా ముగిసింది. గురువారం ఉదయం 6:45 నిమిషాలకు డీఆర్‌డీఓ ఈ అస్త్రాన్ని ప్రయోగించి సక్సెస్ అయ్యింది. హెలికాఫ్టర్ ద్వారా ప్రయోగించే స్టాండ్‌ ఆఫ్ యాంటీ-ట్యాంక్ మిస్సైల్ (సాంట్) సక్సెస్ తర్వాత డీఆర్‌డీఓ నాగ్ క్షిపణిని రూపొందించడం విశేషం. సాంట్ క్షిపణి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను చేధించగలదు. దీన్ని అక్టోబర్ 19వ తేదీన ఒడిషాలోని బాలాసోర్ టెస్టింగ్ రేంజ్ నుంచి ప్రయోగించారు. సాంట్ క్షిపణిని భవిష్యత్తులో హెలికాఫ్టర్‌తోనే అనుసందానం చేయనున్నప్పటికీ... ప్రస్తుతం భూమి పై నుంచి నిర్వహించిన ప్రయోగం సక్సెస్ అయ్యింది.

Recommended Video

#WATCH : DRDO ఘనత.. Nag Anti tank missile చివరి దశ ట్రయల్స్‌ విజయవంతం! || Oneindia Telugu

నాగ్ యాంటీ ట్యాంక్ క్షిపణి 10 సార్లు నిర్వహించిన టెస్టులో నిర్దేశించిన టార్గెట్‌ను ఢీకొట్టినట్లు డీఆర్‌డీఓ ఉన్నతాధికారులు తెలిపారు. దీంతో ఇక రక్షణ శాఖలో ఈ అస్త్రం చేరేందుకు సిద్ధంగా ఉందని అధికారులు తెలిపారు. ఇక డీఆర్‌డీఓ 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్‌ను చేధించేలా రూపొందించిన సబ్ సానిక్ క్రూజర్ నిర్భయ్ ఈ నెల మొదట్లో ప్రయోగం సందర్భంగా సాంకేతిక లోపం తలెత్తిందని అధికారులు చెప్పారు. బూస్టర్‌లో తలెత్తిన సాంకేతిక లోపాన్ని గుర్తించి మరమత్తులు చేసినట్లు చెప్పిన అధికారులు రానున్న నెలల్లో ఈ ప్రయోగంను సక్సెస్ చేస్తామని చెప్పారు.

DRDO successfully test fires Nag Anti Tank Missile, soon to be inducted into Indian Army

ఇక నాగ్ యాంటీ ట్యాంక్ క్షిపణి ట్రయల్స్ విజయవంతం కావడంతో ఇక పై భారత్ ఈ తరహా క్షిపణుల కోసం ఇజ్రాయిల్, అమెరికా లాంటి దేశాలపై ఆధారపడాల్సిన అవసరం ఉండదని డీఆర్‌డీఓ తెలిపింది.ఆ దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన పని ఉండదని వివరించింది. అంతకుముందు ఈ తరహా క్షిపణులు భారత్‌లో లేకపోవడంతో భారత్-చైనా సరిహద్దుల వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఇజ్రాయిల్ నుంచి భారత ఆర్మీ యుద్ధ ప్రాతిపదికన 200 క్షిపణులు కొనుగోలు చేసింది. జూన్ 15న గాల్వాన్ ఘటన తర్వాత ఈ స్పైక్ మిస్సైల్స్‌ను భారత్ వెంటనే కొనుగోలు చేసింది.

English summary
The Nag Anti tank missile was succesfully test fired by DRDO which will be soon inducted in Indian Army
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X