లేజర్ అస్త్రాన్ని విజయవంతంగా పరీక్షించిన డీఆర్డీఓ, ఆ దేశాల సరసన
భారత రక్షణ శాఖ అమ్ములపొదిలో మరో సరికొత్త అస్త్రం వచ్చి చేరింది. అధిక శక్తి కలిగిన లేజర్ ఆధారిత ఆయుధాన్ని (Laser Weapon) డీఆర్డీవో తొలిసారి విజయవంతంగా పరీక్షించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలులో నిర్వహించిన ట్రయల్స్‌లో భాగంగా గాల్లో ఎగురుతున్న యూఏవీ, డ్రోన్లను నేలకూల్చడంలో సఫలమైంది. సంబంధిత వీడియో ఫుటేజీని డీఆర్డీవో ఎక్స్ వేదికగా పోస్టు చేసింది.
'వాహనంలో అమర్చిన లేజర్ డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్(DEW) ఎంకే-II(ఏ) ల్యాండ్ వెర్షన్‌ను విజయవంతంగా పరీక్షించాం. ఇది యూఏవీ, డ్రోన్లను విజవయంతంగా అడ్డుకుంది. వాటిని కూల్చడంతోపాటు నిఘా సెన్సార్లను పనిచేయకుండా చేసింది. దీని ద్వారా లేజర్ డీఈడబ్ల్యూ వ్యవస్థను కలిగి ఉన్న దేశాల సరసన భారత్ చేరింది' అని డీఆర్డీవో తన సోషల్ మీడియా ఖాతాలో వెల్లడించింది.

లేజర్ ఆయుధంతో దూరంలోని ఓ యూఏవీని ట్రాక్ చేస్తూ దాన్ని నేలకూల్చడంతో అది కాలిపోయిన దృశ్యాను పోస్టు చేసింది. ఈ సందర్భంగా డీఆర్డీవో ఛైర్మన్ సమీర్ వి కామత్ మాట్లాడుతూ.. ఇది కేవలం ప్రారంభమేనని అన్నారు. తనకు తెలిసినంత వరకు అమెరికా, రష్యా, చైనాలు మాత్రమే లేజర్ ఆయుధ సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయన్నారు.
ఇజ్రాయెల్ కూడా ఇలాంటి దానిపై పనిచేస్తోందని సమీర్ వి కామత్ తెలిపారు. ఈ తరహా ఆయుధ వ్యవస్థను ప్రదర్శించిన నాలుగో లేదా ఐదో దేశం మనదేనని డీఆర్డీవో ఛైర్మన్ సమీర్ వి కామత్ వివరించారు.
-
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
26 ఏళ్లుగా వెంకటేష్ రికార్డును బద్ధలు కొట్టలేకపోతున్న తెలుగు స్టార్ హీరోలు -
కుప్పకూలుతున్న బంగారం రేట్లు- ఈ వారంలో












Click it and Unblock the Notifications