• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

బిగ్ రిలీఫ్: కరోనాకు గ్లూకోజ్ పౌడర్ -DRDO తయారీ 2-DG డ్రగ్‌కు డీసీజీఐ అనుమతి -ఆక్సిజన్ అసరం ఉండదు

|

దేశంలో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. నిన్న ఒక్కరోజే 4092మందిని కొవిడ్ బలితీసుకోగా, కొత్తగా 4.03లక్షల కేసులు నమోదయ్యాయి. సెకండ్ వేవ్ లో ఆస్పత్రులు నిండుకుని ఆక్సిజన్ సంక్షోభం తలెత్తి నెల రోజులు దాటినా ఇవాళ్టికీ ప్రాణవాయువు కోసం ఎస్ఓఎస్ కాల్స్ వెళుతూనే ఉన్నాయి. ఆగస్టులో మూడో వేవ్ కూడా ఉత్పన్నమవుతుందన్న నిపుణుల హెచ్చరిక మరింత కలవరం పుట్టిస్తున్నది.

  2-DG | How It Works On Human Cells And Fights Covid-19 || Oneindia Telugu

  ఈ విపత్కర సమయంలో దేశ ప్రజలకు, మరీ ముఖ్యంగా కొవిడ్ రోగులకు బిగ్ రిలీఫ్ కల్పిస్తూ రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) గుడ్ న్యూస్ చెప్పింది. కొవిడ్ చికిత్స కోసం డీఆర్డీవో తయారుచేసిన పౌడర్ డ్రగ్ ను అత్యవసరంగా వినియోగించేందుకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) అనుమతి కూడా లభించింది. వివరాలివి..

  సీజేఐ రమణ మరో సంచలనం -చిన్న కేసుల్లో అరెస్టులు వద్దు -ఆ ఖైదీల విడుదలకు సుప్రీంకోర్టు ఆదేశంసీజేఐ రమణ మరో సంచలనం -చిన్న కేసుల్లో అరెస్టులు వద్దు -ఆ ఖైదీల విడుదలకు సుప్రీంకోర్టు ఆదేశం

   స్వదేశీ ఔషధం 2డీజీ..

  స్వదేశీ ఔషధం 2డీజీ..

  దేశంలో కరోనా విలయతాండవం కొనసాగుతున్న ప్రస్తుత తరుణంలో మహమ్మారిపై పోరుకు మరో స్వదేశీ ఔషధం అందుబాటులోకి వచ్చింది. సైన్యానికి సరికొత్త ఆయుధాలను అందించే డీఆర్డీవో దీనిని తయారు చేసింది. డీఆర్‌డీవో అంతర్భాగమైన ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూక్లియర్‌ మెడిసిన్‌ అండ్‌ అలైడ్‌ సైన్సెస్‌ (ఇన్‌మాస్‌), డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌ (డీఆర్‌ఎల్‌) అభివృద్ధి చేసిన ‘‘2-డీయాక్సీ-డి-గ్లూకోజ్‌ (2-డీజీ)'' ఔషధాన్ని అత్యవసర వినియోగానికి భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ) అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు రక్షణ శాఖ తాజాగా ఒక ప్రకటన చేసింది. మధ్యస్థాయి నుంచి తీవ్రస్థాయి లక్షణాలున్న కొవిడ్ రోగులకు ఈ ఔషధాన్ని వినియోగిస్తారు..

  2డీజీ పౌడర్‌ను నీటిలో కలిపి తాగాలి..

  2డీజీ పౌడర్‌ను నీటిలో కలిపి తాగాలి..

  2-డీజీ ఔషధం పౌడర్‌ రూపంలో లభిస్తుంది. దీనిని నీటిలో కలిపి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ఔషధం వైరస్‌ సోకిన కణాల్లోకి చేరి వైరస్‌ వృద్ధి చెందకుండా అడ్డుకుంటుంది. సాధారణంగా కరోనా వైరస్‌ ఒక కణంలోకి చేరాక ఆర్‌ఎన్‌ఏను వృద్ధి చేయడం ద్వారా కొత్త వైరస్‌ కణాలను తయారుచేస్తుంది. అవి ఇతర కణాలకు విస్తరించి వ్యాధి తీవ్రతను పెంచుతాయి. 2-డీజీ ఈ ప్రక్రియను నిలువరిస్తుంది. ఆర్‌ఎన్‌ఏను వృద్ధి చేసేందుకు కావాల్సిన శక్తి (గ్లూకోజ్‌) వైరస్‌కు అందకుండా అడ్డుకుంటుంది. ఫలితంగా వైరస్‌ వృద్ధి నిలిచిపోయి రోగి వేగంగా కోలుకుంటారు.

  జగన్‌కు దిమ్మతిరిగేలా జేఎఎం పంచ్ -నీ గురించి దేశమంతా తెలుసు -వైఎస్సార్ కొడుకు బీజేపీకి బానిసా?జగన్‌కు దిమ్మతిరిగేలా జేఎఎం పంచ్ -నీ గురించి దేశమంతా తెలుసు -వైఎస్సార్ కొడుకు బీజేపీకి బానిసా?

  ఆక్సిజన్ అవసరం ఉండదు..

  ఆక్సిజన్ అవసరం ఉండదు..

  2డీజీ ఔషధాన్ని రోజుకు రెండు సాచెట్ల (ప్యాకెట్లు) తీసుకున్న కరోనా రోగుల్లో 42 శాతం మందికి మూడో రోజునే కృత్రిమ ఆక్సిజన్‌ను తొలగించినట్టు రక్షణ శాఖ తెలిపింది. సాధారణ చికిత్స (స్టాండర్డ్‌ ట్రీట్‌మెంట్‌) తీసుకున్న వారిలో 30 శాతం మందికి మూడో రోజున ఆక్సిజన్‌ను తొలగించినట్టు పేర్కొన్నది. దేశంలో ఆక్సిజన్‌కు తీవ్ర కొరత నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ఔషధం కీలకం కానున్నది. కొవిడ్ రోగులు వేగంగా కోలుకునేలా చేయడంతోపాటు కృత్రిమ ఆక్సిజన్‌పై ఆధారపడటాన్ని ఇది పౌడర్ మందు గణనీయంగా తగ్గిస్తుందని, చికిత్స కోసం ఆస్పత్రిలో ఎక్కువ రోజులు ఉండాల్సిన అవసరాన్ని కూడా ఇది తగ్గిస్తుందని రక్షణ శాఖ పేర్కొంది.

  అన్ని వయసుల వారిపైనా ఎఫెక్ట్..

  అన్ని వయసుల వారిపైనా ఎఫెక్ట్..

  కరోనాకు గురైనవాళ్లలో వైరస్ మరింత బలపడకుండా అడ్డుకునే ఈ 2డీజీ ఔషధం అన్ని వయసులవారిపైనా ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు క్లినికల్ ట్రయల్స్ లో వెల్లడైంది. గతేడాది ఏప్రిల్ నుంచే డీఆర్డీవో, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ వారు 2జీడీ ఔషధ ప్రయోగాలు ప్రారంభించారు. 65 ఏండ్లు పైబడినవారిపైనా ఇది ప్రభావవంతంగా పనిచేస్తుందని, రోజుకు రెండు సాచెట్ల (ప్యాకెట్ల) ఔషధం తీసుకున్న కరోనా రోగుల్లో 42 శాతం మందికి మూడో రోజునే కృత్రిమ ఆక్సిజన్‌ను తొలగించినట్టు రక్షణ శాఖ తెలిపింది. సాధారణ చికిత్స (స్టాండర్డ్‌ ట్రీట్‌మెంట్‌) తీసుకున్న వారిలో 30 శాతం మందికి మూడో రోజున ఆక్సిజన్‌ను తొలగించినట్టు పేర్కొన్నది.

  పౌడర్ డ్రగ్ ధర రూ.600?

  పౌడర్ డ్రగ్ ధర రూ.600?

  2-డీజీ ఫేజ్‌-2 ట్రయల్స్‌కు గతేడాది మేలో డీసీజీఐ అనుమతులు మంజూరుచేయగా, మే-అక్టోబర్‌ మధ్య ఫేజ్‌-2 క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించారని, కొవిడ్‌ రోగులపై ఇది సమర్థంగా పనిచేస్తున్నట్టు తేలిందని, మొత్తంగా 110 రోగులపై ఫేజ్‌-2 ట్రయల్స్‌ చేశామని,దీంతో నవంబర్‌లో ఫేజ్‌-3 ట్రయల్స్‌కు డీసీజీఐ అనుమతి ఇచ్చినట్టు రక్షణ శాఖ పేర్కొంది.

  తెలంగాణ, ఏపీతో పాటు వివిధ రాష్ట్రాల్లో ఎంపిక చేసుకున్న 27 ఆస్పత్రుల్లో 220 మంది రోగులపై గతేడాది డిసెంబర్‌ నుంచి ఈ ఏడాది మార్చి మధ్య ఫేజ్‌3 ట్రయల్స్‌ నిర్వహించినట్టు తెలిపారు. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ తో కలిసి డీఆర్డీవో రూపొందించిన కొవిడ్ విరుగుడు పౌడర్ డ్రగ్ సమర్థవంతంగా పనిచేస్తున్నందున అవ్యవసర వినియోగానికి డీసీజీఐ అనుమతి ఇచ్చింది. కాగా ఈ పౌడర్ డ్రగ్ ధరను ఇంకా ప్రకటించలేదు. ఒక్కో సాచెట్‌ ధర రూ.500-600 ఉండొచ్చని అంచనా. దీనిని తయారు చేయడం సులభమని, దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున అందుబాటులోకి తేవొచ్చని డీఆర్‌డీవో తెలిపింది. ఆస్పత్రుల్లో వినియోగానికి డాక్టర్‌ రెడ్డీస్‌ ఇప్పటికే పరిమిత స్థాయిలో ఉత్పత్తిని ప్రారంభించినట్టు సమాచారం.

  English summary
  With the country battling the second wave of Covid-19 infections, The Drugs Controller General of India (DCGI) on Saturday approved a drug developed by the DRDO for emergency use. The drug - 2-deoxy-D-glucose (2-DG) - has been approved as an adjunct therapy in moderate to severe cases of coronavirus. "Clinical trial results have shown that this molecule helps in faster recovery of hospitalized patients and reduces supplemental oxygen dependence," an official of the Defence Research and Development Organisation (DRDO) was quoted as saying.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X