• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

లారీ డ్రైవర్లకు డ్రెస్ కోడ్ .. ఉల్లంఘిస్తే భారీ జరిమానా ... వాళ్లకు పెద్ద కష్టమే

|

కొత్త వాహన చట్టం లారీ డ్రైవర్లకు కూడా పరీక్ష పెడుతోంది. లారీ డ్రైవర్ లకు కూడా డ్రెస్ కోడ్ ఉండాలన్న నియమం ఇప్పుడు లారీ డ్రైవర్ల కు కొత్త చిక్కు తెచ్చిపెట్టింది. దేశంలోని రాష్ట్రాలన్నింటికీ వివిధ ఉత్పత్తులను తమ వాహనాల ద్వారా ఎగుమతి ,దిగుమతి చేస్తున్న లారీ డ్రైవర్లు చాలా దూరం ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో వాళ్లు బనియన్లు ప్రయాణం చేస్తారు. ఇక వారికి సైతం డ్రెస్ కోడ్ పెట్టి నూతన వాహన చట్టం షాక్ ఇచ్చింది. దీని ప్రకారం ట్రాఫిక్ పోలీసులు వారికి వేలకు వేలు జరిమానా విధించడంతో లారీ డ్రైవర్లు లబోదిబోమంటున్నారు.

కర్నూలులో మొహర్రం వేడుకల్లో అపశ్రుతి .. గోడకూలి 20 మందికి గాయాలు .. పలువురు సీరియస్

 కొత్త వాహన చట్టం ...లారీ డ్రైవర్లు లుంగీ, బనియన్ తో కనిపిస్తే వారిపై చట్టపరమైన చర్యలు

కొత్త వాహన చట్టం ...లారీ డ్రైవర్లు లుంగీ, బనియన్ తో కనిపిస్తే వారిపై చట్టపరమైన చర్యలు

ఇక నుండి లారీలు నడిపే డ్రైవర్లందరూ కూడా లుంగీ, బనియన్ తో కనిపిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని, వారి వాహనాన్ని సీజ్ చేయనున్నారని సమాచారం. కొత్త నిబంధనల ప్రకారం లారీ డ్రైవర్లు ప్యాంటు, షర్టు, లేదా టీ షర్టు వేసుకొని తమ వాహనాన్ని నడపాలని, లేదంటే వారిపై జరిమానా వేస్తామంటున్నారు ట్రాఫిక్ పోలీసులు. ఈ కొత్తరకమైన ఆచరణ యూపీలో ప్రారంభం అయింది .

 లారీ డ్రైవర్లు డ్రెస్ కోడ్ తప్పనిసరి... పాటించకుంటే 2000 రూపాయల జరిమానా

లారీ డ్రైవర్లు డ్రెస్ కోడ్ తప్పనిసరి... పాటించకుంటే 2000 రూపాయల జరిమానా

లారీ డ్రైవర్లు డ్రెస్ కోడ్ తప్పనిసరిగా పాటించాలని, అంతేకాదు షూస్ కూడా ధరించాలి ..లేదంటే వారికి 2000 రూపాయల జరిమానా విధించనున్నారు అని తెలిపారు. అయితే ఈ జరిమానా స్కూలు వ్యాన్ డ్రైవర్లు, ప్రభుత్వ వాహనాలకూ కూడా వర్తిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈమేరకు ట్రాఫిక్ ఏఎస్పీ పూర్నేష్ సింగ్ మాట్లాడారు. లక్నో 1939 వాహన చట్టాన్ని 1989లో సవరించారు. సరైన డ్రెస్ కోడ్ పాటించని లారీ డ్రైవర్లకు రూ.500 జరిమానా విధించాలని అందులో పేర్కొన్నారు. 2019 వాహన చట్టంలోని సెక్షన్ 179 ప్రకారం ఆ జరిమానాను రూ.2వేలకు పెంచారని ఆయన తెలిపారు. డ్రెస్ కోడ్ ఉల్లంఘించిన వారికి రూ.2వేలు జరిమానా విధిస్తామని, రోడ్డు భద్రతా నియమాలను ఉల్లంఘించే వారిని భయపెట్టేలా ఈ నిబంధనలను రూపొందించామని ఆయన చెప్పుకొచ్చారు.

 కొత్త రూల్ తో ఇబ్బందిపడుతున్న లారీ డ్రైవర్లు ... కొత్త నిబంధనపై ఆందోళన

కొత్త రూల్ తో ఇబ్బందిపడుతున్న లారీ డ్రైవర్లు ... కొత్త నిబంధనపై ఆందోళన

ఇప్పటికే వాహనదారులు రోడ్లు సరిగా లేకున్నా, ట్రాఫిక్ నిబంధనల పేరుతో భారీ జరిమానాలు విధిస్తున్న ప్రభుత్వాల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. నూతన వాహన చట్టం విషయంలో దేశవ్యాప్తంగా ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. వాహనచోదకులు ప్రతి ఒక్కరూ కొత్త నియమ నిబంధనలతో, భారీగా పడుతున్న జరిమానా లతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక లారీ డ్రైవర్ లకు సైతం డ్రెస్ కోడ్ పెట్టి, వారు పాటించకుంటే ఫైన్ వేయాలనే ఆలోచనతో లారీ డ్రైవర్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఏది ఏమైనా దూరప్రాంతాలకు ప్రయాణం చేసే , ఎక్కడపడితే అక్కడ వాహనాలను ఆపుకుని వండుకు తిని ప్రయాణాలు సాగించే లారీ డ్రైవర్ లకు కచ్చితంగా ప్యాంటు షర్టు వేసుకోవాలని లేదంటే భారీగా జరిమానాలు వేస్తామని చెప్పటం వారికి ఇబ్బంది కరమైన అంశమే.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A new provision added to the law dictates that drivers wear full length pants with a shirt or t-shirt. They must also wear closed shoes whenever driving the vehicle. Proper dress code is also mandatory for drivers of school vans and government vehicles.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more