వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మందుబాబులు అలర్ట్ : బీర్లను టిన్‌లో వాడండి.. బాటిల్ వాడారనుకో.. ఇక అంతే సంగతులు

|
Google Oneindia TeluguNews

మౌంట్ అబు : మందుబాబులను మైకంలో ముంచే బీర్లు.. మూగజీవాల పాలిట శాపంగా మారుతున్నాయి. ఆ బీర్ బాటిల్ పగిలి, గాజు గుచ్చుకొని జీవాలు అల్లాడుతున్నాయి. ఈ విషయాన్ని గమనించిన రాజస్థాన్ అధికారులు బీర్లను బాటిళ్లలో కాకుండా టిన్‌లలో తాగాలని సూచిస్తున్నారు.

పగిలిన సీసాలు ..
ముఖ్యంగా పచ్చికబయళ్లు, జనసమ్మర్థం లేని చోట మందుబాబులు సిట్టింగ్ చేస్తారు. అక్కడే బీరు సీసాలు పెరుకుపోతాయి. అయితే తాగిన మైకంలో కొన్ని పగిలిపోతాయి. దీంతో రాజస్థాన్‌లోని మౌంట్ అబు కొండపై బీరు సీసాలు నిండిపోయాయి. దీంతో అక్కడుంటే జంతువులు గాజులు గుచ్చుకొని గాయపడ్డాయి. దీనిని గమనించిన అధికారులు బీర్లు బాటిళ్లలోగాక టిన్‌లలో తాగాలని సూచిస్తున్నారు. మీరు అటవీప్రాంతంలో వేసే బాటిళ్లతో మూగజీవాలు గాయపడుతున్నాయని మౌంట్ అబు సబ్ డివిజనల్ అధికారి రవీంద్ర గోస్వామి సూచించారు.

Drink beer in cans, bottles hurt animals: Mount Abu officials

బీర్ సీసాలతో నిండిన సరస్సు ..
నక్కీ సరస్సులో చెత్త తీసేయాలని పూనుకోగా .. బీర్ బాటిళ్ల తేలాయని గుర్తుచేశారు. ఆ పక్కనే వేస్తే గదిలో పట్టేన్నీ బీర్ బాటిళ్లు కనిపించాయని తెలిపారు. వాటిని ట్రాక్టర్‌తో మూడు ట్రిప్పులతో డంప్ యార్డులో పడేసినట్టు పేర్కొన్నారు. మౌంట్ అబు కొండపై బీర్ గాజు ముక్కలతో ధ్రువపు ఎలుగుబంట్లు, పర్యాటకులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ఈ అంశంపై వైన్ షాపు యాజమానులతో కూడా చర్చించామని గుర్తుచేశారు.

బాటిళ్లలో విక్రయిస్తే లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు. పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకొని చర్యలు తీసుకునట్టు వివరించారు. మౌంట్ అబులో నెలకు కనీసం 50 వేల బాటిళ్లు వినియోగిస్తారని పేర్కొన్నారు. బీర్ బాటిళ్లు బయటకు ఇవ్వొద్దని.. ఒకవేళ ఇస్తే బాటిల్‌కు రూ.20 ముందే తీసుకోవాలని సూచించారు. మళ్లీ బాటిల్ తీసుకొస్తే డిపాజిట్ నగదు ఇస్తామని పేర్కొన్నారు.

English summary
With shards of beer bottles posing a threat to wild animals in Mount Abu, the district administration has launched an initiative to promote beer cans instead of bottles. Sub Divisional Officer (Mount Abu) Ravindra Goswami told PTI that empty beer bottles are usually dumped in forest areas and water bodies in large numbers. When Nakki Lake was cleaned sometime back, thousands of empty beer bottles were recovered from it and three tractors had to be used to shift the bottles, he added. Glass shards from broken are also found scattered in the Mount Abu wildlife sanctuary area which harms wild animals like sloth bears and causes problems for tourists.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X