వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎటిఎంలో డబ్బులు డిపాజిట్ చేసే వ్యాన్ తో పారిపోయిన డ్రైవర్

ఎటిఎం లకు డబ్బులను తీసుకెళ్ళే వ్యాన్ డ్రైవర్ 1.37 కోట్ల సొమ్ముతో సహ ఉడాయించాడు. ఈ ఘటన బెంగుళూరులో చోటుచేసుకొంది.బెంగుళూరులోని బ్యాంకు ఆప్ ఇండియా ఎటిఎంలలో డబ్బులను డిపాజిట్ చేసేందుకు వెళ్తూ డబ్బులున్న

By Narsimha
|
Google Oneindia TeluguNews

బెంగుళూరు :కొత్త కరెన్సీ కోసం బ్యాంకులు, ఎటిఎం ల వద్ద ప్రజలు బారులు తీరుతున్నారు. ప్రజల బాధలను తీర్చేందుకు ఎటిఎంలను మరింత వినియోగంలోకి తెచ్చేందుకు బ్యాంకులు ప్రయత్నిస్తున్నాయి. అయితే ఎటిఎం లకు డబ్బులను తీసుకెళ్ళే వ్యాన్ డ్రైవర్ 1.37 కోట్ల సొమ్ముతో సహ ఉడాయించాడు. ఈ ఘటన బెంగుళూరులో చోటుచేసుకొంది.

కొత్త కరెన్సీ నోట్ల ప్రజలు ఎదురుచూస్తోంటే ఏకంగా కోటి37 లక్షల నగదు ఉన్న వ్యాన్ తో డ్రైవర్ పారిపోవడం చర్చనీయాంశమైంది. బ్యాంకు ఆఫ్ ఇండియాకు చెందిన ఎటిఎంలలో నగదును పెట్టేందుకు వ్యాన్ డ్రైవర్ ఒకరు కాంట్రాక్టు పద్దతిలో జాయిన్ అయ్యాడు.

 driver escape with 1.37 lakhs

బెంగుళూరులోని పలు బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ లలో డబ్బులను జమచేసేందుకు వెళ్తూ వ్యాన్ ను తీసుకొని పారిపోయాడు.వివిద బ్యాంకుల నుండి క్యాష్ ను కలెక్ట్ చేసే బాద్యతను లాగిటెక్ తీసుకొందని బ్యాంకు ఆప్ ఇండియా జోనల్ మేనేజర్ ఈశ్వరప్ప చెప్పారు.

కోటి 37 లక్షలున్న నగదును తీసుకొని పారిపోయిన ఈశ్వరప్ప కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే ఈ నగదును ఎక్కడ విక్రయంలోకి తెచ్చినా సులభంగా గుర్తించవచ్చని బ్యాంకు అధికారులు చెబుతున్నారు.సీరియల్ నంబర్ల ఆధారంగా నిందితులు ఎక్కడ ఉన్న గుర్తించే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

English summary
atm money deposit vehicle driver escape with 1.37 crore rupee new currency in banglore on wednesday.contract driver for atm deposit van escape with 1.37 crores worth of new currency . this amount deposit purpose for bank of india atm's in banglore, police enquired about driver.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X