బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బెంగళూరులో మూడేళ్ల చిన్నారిపై ఇంటర్నేషనల్ స్కూల్ డ్రైవర్ లైంగిక దాడి !

బెంగళూరు నగరంలో మరో దారుణం చోటుచేసుకుంది. స్కూల్ కు వెళ్లిన మూడేళ్ల బాలిక మీద ఇంటర్నేషనల్ స్కూల్ వ్యాన్ డ్రైవర్ లైంగిక దాడి చేసిన ఘటన బెంగళూరు నగరంలో జరిగింది. చిన్నారి నిందితుడిని గుర్తు పట్టడంతో పోల

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: బెంగళూరు నగరంలో మరో దారుణం చోటుచేసుకుంది. స్కూల్ కు వెళ్లిన మూడేళ్ల బాలిక మీద ఇంటర్నేషనల్ స్కూల్ వ్యాన్ డ్రైవర్ లైంగిక దాడి చేసిన ఘటన బెంగళూరు నగరంలో జరిగింది. చిన్నారి నిందితుడిని గుర్తు పట్టడంతో పోలీసులు అతన్ని అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.

బ్లూ ఫిల్మ్ ఎప్పుడైన చూశారా ? ఎలా ఉంటుందో తెలుసా ? ప్రజలకు సీఎం సూటి ప్రశ్న !బ్లూ ఫిల్మ్ ఎప్పుడైన చూశారా ? ఎలా ఉంటుందో తెలుసా ? ప్రజలకు సీఎం సూటి ప్రశ్న !

బెంగళూరు ఆగ్నేయ విభాగంలో ఓ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది. సోమవారం బాలిక స్కూల్ నుంచి ఇంటికి బయలుదేరుతున్న సమయంలో అదే స్కూల్ లో వ్యాన్ డ్రైవర్ గా పని చేస్తున్న ఓ వ్యక్తి బాలిక మీద లైంగిక దాడికి పాల్పడ్డాడు.

Driver of the school van is accused of abusing the child

తరువాత ఇంటికి వెళ్లిన బాలిక కుటుంబ సభ్యులకు విషయం చెప్పింది. వెంటనే బాలికను ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. తరువాత స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు బాలికను వెంట పెట్టుకుని నేరుగా స్కూల్ దగ్గరకు వెళ్లారు.

రూ. వేల కోట్ల కాంట్రాక్టు: బినామీ కంపెనీ పేరుతో కాంగ్రాస్ పార్టీ మహిళా ఎమ్మెల్యేకి?రూ. వేల కోట్ల కాంట్రాక్టు: బినామీ కంపెనీ పేరుతో కాంగ్రాస్ పార్టీ మహిళా ఎమ్మెల్యేకి?

స్కూల్ సిబ్బంది అందరినీ ఒకే చోట నిలబెట్టారు. ఆ సమయంలో బాలిక వేలితో వ్యాన్ డ్రైవర్ ను చూపించింది. వెంటనే పోలీసులు వ్యాన్ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. స్కూల్ ఆవరణంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల క్లిప్పింగ్స్ స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారు. అయితే తనకు ఏపాపం తెలీదని నిందితుడు చెబుతున్నాడని, కేసు విచారణలో ఉందని పోలీసులు తెలిపారు.

English summary
A driver employed with am an international school in Bengaluru has been arrested on charges of sexually assaulting a three and a half-year-old child.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X