వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గంటకు 185కి.మీ స్పీడ్‌... ఆ డ్రైవర్ సమాధానం విని నివ్వెరపోయిన పోలీసులు...

|
Google Oneindia TeluguNews

ఇంగ్లాండ్‌లోని సౌత్ యార్క్‌షైర్‌లో ఇటీవల హైవేపై దూసుకెళ్తున్న ఓ కారును చూసి ట్రాఫిక్ పోలీసులు షాక్ తిన్నారు. మెరుపు వేగంతో రెప్ప పాటులో ఆ కారు కళ్ల ముందు నుంచి మాయమవడంతో పోలీసులకు దిమ్మ తిరిగింది. స్పీడ్‌ గన్‌లో పరిశీలించగా... ఆ కారు ఏకంగా గంటకు 185కి.మీ(115 మైళ్లు)వేగంతో దూసుకెళ్తున్నట్లు గుర్తించారు.

వేగం 45కి.మీ మించరాదు...

వేగం 45కి.మీ మించరాదు...

ఇంగ్లాండ్‌లో నిబంధనల ప్రకారం హైవేలపై గంటకు 45కి.మీ వేగం మించరాదు. కానీ సదరు డ్రైవర్ అంతకు 4 రెట్లు రెట్టింపు వేగంతో దూసుకెళ్లాడు. దీంతో ఎలాగైనా అతన్ని పట్టుకోవాలని ట్రాఫిక్ పోలీసులు అతని వెనకాలే బీఎండబ్ల్యూ 530లో బయలుదేరారు. పోలీసులు వెనకాలే వస్తున్న విషయాన్ని అతను గమనించలేదు.

అది విని ఆశ్చర్యపోయిన పోలీసులు

అది విని ఆశ్చర్యపోయిన పోలీసులు

ఎట్టకేలకు ఓచోట పోలీసులు ఆ కారును ఆపగలిగారు. అందులో ఉన్న డ్రైవర్‌ను కిందికి దించి ప్రశ్నించారు. దానికి అతను చెప్పిన సమాధానం విని మరింత ఆశ్చర్యపోయారు. తాను లండన్ నుంచి నిర్విరామంగా డ్రైవ్ చేస్తూ వస్తున్నానని... అర్జంట్‌గా టాయిలెట్ వెళ్లాల్సి రావడంతో... స్పీడ్ పెంచానని చెప్పాడు.

కోర్టుకు వ్యవహారం...

పోలీసులు అతను చెబుతున్న విషయాలను నమ్మలేదు. అతనిపై కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. సదరు డ్రైవర్‌ అర్జంట్‌గా టాయిలెట్ వెళ్లాల్సి రావడంతోనే అంత స్పీడ్‌లో దూసుకెళ్లానని చెప్పినప్పటికీ... అతన్ని చూస్తే అలా అనిపించలేదని పోలీసులు కోర్టుకు తెలిపారు. కారు సీట్లో అతను కంఫర్ట్‌ గానే కూర్చున్నాడన్నారు. మొత్తానికి ఈ వ్యవహారం ఇప్పుడు కోర్టు పరిధిలో ఉంది. మరోవైపు ఆ కారు స్పీడ్‌కు సంబంధించి స్పీడ్ గన్ ఫోటోను ట్రాఫిక్ పోలీసులు ట్విట్టర్‌లో షేర్ చేయడంతో అది వైరల్‌గా మారింది.

English summary
When you gotta go, you gotta go. Nature's calls must be answered. These are the sayings that often come in defence of people who go take desperate and extreme steps to relieve themselves.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X