వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వాహనదారులకు డ్రెస్ కోడ్.. లుంగీ కట్టి డ్రైవింగ్ చేస్తే 2 వేల జరిమానా..!

|
Google Oneindia TeluguNews

లక్నో : కొత్త మోటార్ వాహనాల చట్టం వాహనదారులకు చుక్కలు చూపిస్తోంది. కొత్త రూల్స్ ఏంటి బాబోయ్ అనుకునే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే చలాన్లా మొత్తం పెంచేయడంతో బెంబేలెత్తుతున్న వాహనదారులు కొత్త కొత్త రూల్స్‌తో నోరు వెళ్లబెడుతున్నారు. అదలావుంటే లుంగీ కట్టుకుని డ్రైవింగ్ చేస్తే జరిమానాల మోత తప్పదని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం హెచ్చరించడం చర్చానీయాంశమైంది.

కొత్త మోటార్ వాహనాల చట్టం ప్రకారం ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసిన వారికి పోలీసులు చలానాలు వేస్తున్నారు. కొత్త చట్టం అమలులోకి రావడంతో భారీగా జరిమానాలు పడుతున్నాయి. ఆ క్రమంలో వాహనదారులకు వేల రూపాయలు పెనాల్టీగా పడుతుండటంతో ఆందోళన చెందుతున్నారు. అయితే యూపీ సర్కార్ తెర మీదకు మరో అస్త్రం తీసుకురావడంతో వాహనదారులు కంగు తింటున్నారు.

drivers in lungi to invite two thousand fine in Uttar Pradesh

మంత్రి పదవులు రాలేదని.. మైనంపల్లి అలా.. జోగు రామన్న ఇలా..!మంత్రి పదవులు రాలేదని.. మైనంపల్లి అలా.. జోగు రామన్న ఇలా..!

లుంగీ కట్టుకుని డ్రైవింగ్ చేస్తే 2 వేల రూపాయలు జరిమానా విధిస్తామని హెచ్చరించారు లక్నో ట్రాఫిక్ పోలీసులు. వాహనాలు నడిపే వారికి ఇకపై డ్రెస్ కోడ్ తప్పనిసరి అంటూ స్పష్టం చేశారు. ఉత్తరప్రదేశ్‌లో ఇకపై ట్రక్కు డ్రైవర్లు ప్యాంట్, షర్ట్స్ ధరించాల్సిందే.. లేదంటే ఫైన్ మోత మోగుతుంది. బూట్లు కూడా తప్పనిసరిగా వేసుకోవాలి. స్కూల్ బస్సు డ్రైవర్లకు కూడా ఈ నిబంధన వర్తిస్తుందని చెబుతున్నారు పోలీసులు.

1939 నాటి మోటార్ వాహనాల చట్టం ప్రకారం వాహనాలు నడిపేవారు డ్రెస్ కోడ్ పాటించాలనే నిబంధన ఉంది. అయితే 1989వ సంవత్సరంలో దానికి సవరణ చేసి డ్రెస్ కోడ్ ఉల్లంఘించే డ్రైవర్లకు 500 రూపాయల జరిమానా విధించాలని అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. అదలావుంటే మోటార్ వాహనాల చట్టం 2019 సెక్షన్ 179 ప్రకారం డ్రైవర్లు డ్రెస్ కోడ్ ఉల్లంఘించడమే గాకుండా లుంగీ కట్టుకుని డ్రైవింగ్ చేస్తే 2 వేల రూపాయల జరిమానా విధిస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు.

English summary
Drivers of commercial vehicles could soon have to wear full length pants, tee shirts/shirts and shoes and socks while plying their vehicles. The otherwise more comfortable lungi and vest will soon attract a fine of Rs.2,000 as this attire has come under serious attention in Uttar Pradesh and stiff penalties will be imposed under the new Motor Vehicle Act.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X