హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Drone delivery: భారత్ లో ఫస్ట్ టైమ్ మొడికల్ డ్రోన్ డెలవరి, ఆంధ్రా బార్డర్ లో, తెలంగాణలో !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/అనంతపురం/ హైదరాబాద్: భారతదేశంలో మొట్టమొదటి మెడికల్ డ్రోన్ డెలవరీ ట్రయల్స్ కు శ్రీకారం చుట్టారు. బెంగళూరు నగరానికి 80 కిలోమీటర్ల దూరంలోని గౌరిబిదనూరులో మెడిక్ డ్రోన్ డెలవరీ ప్రయోగాలు ప్రారంభం కానున్నాయి. ఆంధ్రప్రదేశ్ సరిహద్దు (అనంతపురం జిల్లా)లోని గౌరబిదనూరులో మెడికల్ డ్రోన్ డెలవరీ ప్రయోగాలు మంచి ఫలితాలు ఇస్తాయని సంబంధిత అధికారులు ఆశభావం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా వైద్యపరికరాలను డ్రోన్ల ద్వారా తరలించే విషయంపై ఓ అధ్యయనం ప్రారంభించింది. అయితే దేశంలో మొట్టమొదటి సారిగా కర్ణాటకలో మెడికల్ డ్రోన్ల డెలవరీ ప్రయోగాలు ప్రారంభం అయ్యాయి.

Khiladi girls: ఇంట్లో దూరి ప్యాంట్ విప్పించి..... ? వీడియో తీసి, ఒకేసారి ముగ్గురు, రూ. 5 లక్షలు !Khiladi girls: ఇంట్లో దూరి ప్యాంట్ విప్పించి..... ? వీడియో తీసి, ఒకేసారి ముగ్గురు, రూ. 5 లక్షలు !

 డీజీసీఏ అనుమతి

డీజీసీఏ అనుమతి

బెంగళూరు అథారిటి థ్రాటిల్ ఏరోస్పేస్ సిస్టమ్స్ ఆధ్వర్యంోని కంపెనీల కన్సార్జియం శుక్రవారం నుంచి విజువల్ లైన్ ఆఫ్ విజన్ (BVLOS) మెడికల్ డ్రోన్లు ట్రయల్స్ నిర్వహించనుంది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA)నుంచి 2020 మార్చి నెలలోనే మెడికల్ డ్రోన్ డెలవరీకి అనుమతులు తీసుకున్నారు.

 35 రోజులు ప్రయోగాలు

35 రోజులు ప్రయోగాలు

బెంగళూరు నగరానికి సుమారు 80 కిలోమీటర్ల దూరంలోని గౌరిబిదనూరులో 30 నుంచి 35 రోజుల పాటు ఈ మెడికల్ డ్రోన్ డెలవరీ ప్రయోగాలు జరగనున్నాయి. ఒక డ్రోన్ ఒక కిలో బరువు ఉన్న మందులను 2 కిలోమీటర్ల నుంచి 15 కిలో మీటర్ల వరకు తీసుకెళ్లవలసి ఉంటుంది. రెండు కేజీల బరువు ఉన్న డ్రోన్ సుమారు 12 కిలో మీటర్ల వరకు ప్రయాణించవలసి ఉంటుంది.

డ్రోన్లపై పరిమితులు

డ్రోన్లపై పరిమితులు


ఇప్పటికే డ్రోన్ విమానాలపై భారత ప్రభుత్వం కొన్ని పరిమితులను సడలించింది. ఆహార పదార్థాలను డెలవరీ చెయ్యడానికి డ్రోన్ లు ఉపయోగించాలని కొన్ని కంపెనీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. మానవరహిత డ్రోన్ లు, ఎయిర్ క్రాఫ్ట్ సిస్టమ్స్ ఆపరేటర్లకు ప్రభుత్వం అనుమతి ఇస్తోంది.

 మారుమూల ప్రాంతాలకు కోవిడ్ 19 వ్యాక్సిన్లు

మారుమూల ప్రాంతాలకు కోవిడ్ 19 వ్యాక్సిన్లు


కోవిడ్ 19 వ్యాన్సిన్ ను మారుమూల ప్రాంతాలకు తరలించడానికి డ్రోన్లు ఉపయోగించాని భారతప్రభుత్వం నిర్ణయించింది. దేశంలోని మారుమూల ప్రాంతాల్లోకి వెళ్లలేని కష్టతరమైన ప్రాంతాలకు డ్రోన్ ల ద్వారా సరైన సమయంలో కోవిడ్ 19 వ్యాన్సిన్ లు, వైద్యపరికరాలు సరైన సమయంలో తరలించడం సాధ్యం అవుతుందని ఇప్పటికే ఇండియన్ ఇన్సిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) కాన్పూర్ స్పష్టం చేసింది.

Recommended Video

Biological-E's Covid Vaccine తో రూ. 1500 కోట్ల డీల్ | 30 Crore Doses | Hyderabad || Oneindai Telugu
తెలంగాణ ప్రభుత్వం కొత్త ప్రాజెక్టు

తెలంగాణ ప్రభుత్వం కొత్త ప్రాజెక్టు

డ్రోన్ల ద్వారా వైద్యపరికరణాలను తరలించడం సాధ్యం అవుతుందా ? లేదా ? అనే విషయంపై ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఓ అధ్యయనం ప్రారంభించింది. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రాజెక్టు అధికారులే ఆదిశగా చర్యలు చేపట్టారు. తెలంగాణ ప్రభుత్వం, ప్లిప్ కార్ట్ ఆధ్వర్యంలో డ్రోన్ ఆపరేటర్లు కోవిడ్ వ్యాక్సిన్ తరలించే ప్రక్రియపై అధ్యయనం మొదలుపెట్టింది.

English summary
Drone delivery trial: India’s first medical drone delivery trial is set to begin today in Gauribidanur, around 80 km from Bengaluru. The trial led by a consortium of firms led by Bengaluru’s Throttle Aerospaces Systems had got the approval from the Directorate General of Civil Aviation (DGCA) for object delivery experiments as early as March 2020.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X