వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'యూనివర్సిటీ పేర్లలో హిందూ, ముస్లీం పదాలు తీసేయండి'

బిహెచ్‌యు, ఏఎంయు విద్యాసంస్థల పేర్లలో ఉన్న హిందూ, ముస్లీం మతాన్ని తెలిపే పేర్లను తొలగించాలని యూజీసీకి చెందిన ప్యానెల్ సూచించింది.

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ: బనారస్ హిందూ విశ్వవిద్యాలయం, అలీగర్ ముస్లీం యూనివర్సిటీ తదితర విద్యాసంస్థల పేర్లలో ఉన్న హిందూ, ముస్లీం మతాన్ని తెలిపే పేర్లను తొలగించాలని యూజీసీకి చెందిన ప్యానెల్ సూచించింది.

బనారస్ హిందూ యూనివర్సిటీ, అలీగఢ్ ముస్లీం యూనివర్సిటీల నుంచి మత సంబంధమైన పదాలను తొలగించాలని ఆ ప్యానల్ సిఫార్సు చేసింది.

Drop Muslim and Hindu from names of BHU, AMU, UGC suggests

దేశవ్యాప్తంగా పది కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో జరుగుతున్న అక్రమాలపై ఆరా తీయడానికి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఓ ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది.

కేంద్రం నిధులు ఇచ్చే వర్సిటీలు లౌకిక విద్యాసంస్థలని, వీటి పేర్లలో మతాలను తెలిపే పదాలు వద్దని ప్యానల్ చెప్పింది. వీటిని అలీగఢ్ యూనివర్సిటీ, బనారస్ యూనివర్సిటీలుగా పిలువవచ్చునని చెప్పింది. కావాలంటే ఆయా వ్యవస్థాపకుల పేర్లు పెట్టవచ్చునని చెప్పింది.

English summary
Words such as 'Hindu' and 'Muslim' in names of universities--Banaras Hindu University and Aligarh Muslim University--do not reflect their secular character and should be dropped, a UGC panel has recommended. The panel was formed to probe the alleged irregularities in 10 central universities and the recommendations have been made in the audit report of AMU.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X