వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గాల్లోకి విమాన టాయిలెట్ వ్యర్థాలు: జీతాలు కట్ చేస్తామంటూ డీజీసీఏకు ఎన్జీటీ వార్నింగ్

|
Google Oneindia TeluguNews

Recommended Video

మానవ వ్యర్థాలు మానవుల మీదే వదులుతున్న విమాన సిబ్బంది

న్యూఢిల్లీ: డీజీసీఏను నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్(ఎన్జీటీ) తాజాగా మరోసారి తీవ్రంగా హెచ్చరించింది. టాయిలెట్‌ వ్యర్థాలను గాల్లో వదిలి వేయకుండా చర్యలు తీసుకోవడానికి తామిచ్చిన మార్గదర్శకాలను పక్కన పడేసిన పౌర విమానయాన సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ జీతభత్యాలను నిలుపుదల చేయిస్తామని ఎన్జీటీ తేల్చి చెప్పింది.

గతంలో తామిచ్చిన ఉత్తర్వులను అమలు చేయడంలో డీజీసీఏ విఫలమయ్యారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. జస్టిస్‌ ఆదర్శ్‌ కుమార్‌ గోయెల్‌ నేతృత్వలోని ఎన్జీటీ ధర్మాసనం ఈ మేరకు స్పందించింది.

31వరకు గడువు

31వరకు గడువు

విమానాల్లో పోగైన టాయిలెట్‌ వ్యర్థాలు గాల్లో పడేయకుండా నిరోధించేందుకు డీజీసీఏకు ఆగస్టు 31 వరకు గడువు విధించింది. లేదంటే సెప్టెంబర్‌ 17 జరిగే తదుపరి విచారణకు డీజీసీ డైరెక్టర్‌ హాజరు కావాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

టాయిలెట్ వ్యర్థాలు పడుతున్నాయి..

టాయిలెట్ వ్యర్థాలు పడుతున్నాయి..

ఢిల్లీలోని ఇందిరాగాందీ అంతర్జాతీయ విమానాశ్రయం పరిసర ప్రాంతాల్లో గల నివాసాలపై విమానాల నుంచి టాయిలెట్‌ వ్యర్థాలు పడుతున్నాయని 2016లో సావంత్‌ సింగ్‌ దహియా అనే రిటైర్డ్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ ఎన్జీటీలో ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఎన్జీటీ అప్పట్లో డీజీసీయేకు మార్గదర్శకాలు జారీ చేసింది. గాల్లో మానవ వ్యర్థాలను పడేస్తున్న విమాన సంస్థలు పర్యావరణ సహాయ నిధిగా 50వేల రూపాయల చొప్పున చెల్లించాలని పేర్కొంది. ఈ మేరకు ఢిల్లీ విమాననాశ్రయం గుండా వెళ్లే విమాన సంస్థలకు సర్క్యులర్‌ జారీ చేయాలని డీజీసీఏని ఆదేశించింది.

ఆ అవకాశమే లేదంటూ..

ఆ అవకాశమే లేదంటూ..


కాగా, ఎన్జీటీ నోటీసులపై స్పందించిన పౌర విమానయాన సంస్థ.. విమానం ప్రయాణిస్తున్నప్పుడు ఎటువంటి వ్యర్థాలను పడేసే అవకాశమే ఉండదని తెలిపింది. ఫిర్యాదు దారు ఇంటిపై పక్షుల రెట్టలు పడ్డాయేమోనని పేర్కొంది. నేటి ఆధునిక కాలంలో విమానాల్లో పోగైన మానవ వ్యర్థాలను నిల్వ చేసే సదుపాయం ఉందనీ, విమానాశ్రయాల్లో మాత్రమే వాటిని పడేస్తామని సెలవిచ్చింది.

అవి మానవ వ్యర్థాలే..

అవి మానవ వ్యర్థాలే..

ఇది ఇలావుంటే... ఫిర్యాదుదారు ఇల్లు, ఆ చుట్టుపక్కల భవనాలపై పడిన వ్యర్థాల నమూనాలు సేకరించి విచారిచేందుకు ఎన్జీటీ ఒక కమిటీని నియమించింది. విమానాశ్రయం చుట్టుపక్కల ఇళ్లపై పడిన వ్యర్థాలు టాయిలెట్‌ వ్యర్థాలేనని సదరు కమిటీ తేల్చింది. దీంతో నోటీసులను బేఖాతరు చేసిన డీజీసీఏపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎన్జీటీ తీవ్రంగా స్పందించింది. జీతాలు నిలిపేస్తామంటూ హెచ్చరించింది.

English summary
The National Green Tribunal (NGT) has rapped the Directorate General of Civil Aviation (DGCA) for "repeated defiance" on issuing circular to airlines operating at the IGI Airport to ensure they do not empty toilet tanks mid-air.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X