వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తుపాకీ వీడండి.. రాజ్‌భవన్‌లో భోజనం చేస్తూ చర్చిద్దాం : ఉగ్రవాదులకు కశ్మీర్ గవర్నర్ పిలుపు

|
Google Oneindia TeluguNews

శ్రీనగర్ : శాంతిని మించిన అస్త్రం లేదు. ఇది తెలిసిన జమ్ము కశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ శాంతి సందేశం ఇచ్చారు. ప్రజలకు అనుకుంటే మీరు తప్పులే కాలేసినట్టే .. ఉగ్రవాదులకు శాంతి ప్రవచనం వినిపించారు. మిలిటెంట్లరా తుపాకీ వీడి శాంతి చర్చలకు రా .. రామ్మని ఆహ్వానించారు మాలిక్. మీరు చర్చలకొస్తే రాజ్‌భవన్‌లో భోజనం చేస్తూ మాట్లాడుకుందామని కోరారు. బుధవారం శ్రీనగర్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.

కశ్మీరే సమస్య ..
జమ్ము కశ్మీర్‌లో నిత్యం నెత్తురోడుతుంది. ఓ వైపు పాకిస్థాన్, మరోవైపు ఉగ్రవాదులు, వారికి సహకరిస్తున్న స్థానికులు రాళ్లతో దాడి చేసి రాష్ట్రాన్ని హింసాత్మకంగా మారుస్తున్నారు. దీనికంతటికీ కశ్మీర్ సమస్యే. దీంతో ఉగ్రవాదులు తుపాకీ వీడి చర్చలకు రావాలని సంచలన వ్యాఖ్యలు చేశారు కశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్. కశ్మీర్ సమస్యకు పరిష్కారం చర్చలేనని స్పష్టంచేశారు. చర్చలతోనే రాజ్యాంగంలో సవరణలు చేసి సమస్యను సాల్వ్ చేసుకోవచ్చని సూచించారు. భారతదేశంలో హింసతో ఏదీ సాధ్యపడదని .. శాంతియుత చర్చలతోనే ఎలాంటి సమస్యనైనా ఇట్టే పరిష్కారమవుతుందని సూచించారు.

Drop your guns, come to Raj Bhawan for lunch’: Kashmir governor urges militants

చర్చలతోనే సాధ్యం ...
మీకేం కావాలో అడగండి, అడిగితే కదా తెలిసేది .. లేదంటే మీ మనసులో ఉన్న అంశం మాకు ఎలా తెలుస్తోంది అని ప్రశ్నించారు. చర్చల ద్వారా ప్రేమతో అసాధ్యం సుసాధ్యం అవుతుందన్నారు. మీరు అడిగిన అంశాలను ఇచ్చేందుకు ప్రధాని మోడీ సిద్ధంగా ఉన్నారని స్పష్టంచేశారు. వెంటనే తుపాకీ వీడి చర్చలకు రావాలని మీడియా ముఖంగా కోరారు. అంతేకాదు మీకు సొంత రాజ్యాంగం ఉంది. ప్రత్యేకంగా జెండా ఉంది. ఇంకా మీకు ఏమైనా కావాలంటే ప్రజాస్వామ్యయుతంగా అడిగి తీసుకోవాలే తప్ప .. హింసతో ఏదీ సాధించలేరని పేర్కొన్నారు. కశ్మీర్‌లో యువత ఉగ్రవాదం వైపు మళ్లడానికి ఉపాధి లేకపోవడం ఒక కారణమైతే .. కొందరు రాజకీయ నాయకులు కూడా వారిని తప్పుదోవ పట్టిస్తున్నారని మండపడ్డారు.

English summary
jammu and Kashmir Governor Satya Pal Malik Wednesday asked militants to give up arms and invited them to hold talks, saying dialogue is the only way through which they can get what they want within the ambit of the Constitution. He said India cannot be made to bow through violence. “Take everything from us, we will give our life, but through love and dialogue. For that (PM) Narendra Modi is ready, we are ready. Come to the dialogue table and take it forward,” Malik said at a marathon press briefing on the achievements of his administration.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X