వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అంతా సర్దుకుందనుకున్న తరుణంలో..! ముంచేసిన మర్కజ్..! బిక్కుబిక్కు మంటున్న భారత్..!

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ/హైదరాబాద్ : కోవిడ్19 కొరోనా వైరస్ భారతదేశంలో వ్యాప్తి చెందకుండా ఉండేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పకడ్బంధీ కార్యక్రమాలు చేపట్టాయి. దేశ వ్యాప్తంగా ప్రజల్లో ఏకాభిప్రాయం తీసుకురావడంతో పాటు కరోనా మహమ్మారి పట్ల పెద్ద అవగాహన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. ప్రజలు జన జీవన స్రవంతిలోకి రాకుండా స్వీయ నియంత్రణ పాటించాల్సిందిగా పలు విజ్ఞప్తులు చేసింది కేంద్రం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సలహాలను ప్రజలు తూచా తప్పకుండా పాటించేందుకు మానసింకంగా సిద్దమయ్యారు.

 ఢిల్లీ మత ప్రార్థనల్లో పాల్గొన్న వేల మంది.. ఉలిక్కి పడుతున్న భారత్..

ఢిల్లీ మత ప్రార్థనల్లో పాల్గొన్న వేల మంది.. ఉలిక్కి పడుతున్న భారత్..

అంతే కాకుండా మూడు వారాల పాటు ముందు జాగ్రత్తలు పాటిస్తే కరోనా వ్యాధి ప్రబలకుండా ఉంటుందని, దాని ద్వారా సుక్షిత భారతావనికి అందరూ కృషి చేసిన వారవుతారని ప్రధానమంత్రి మోదీ ఇచ్చిన పిలుపుకు యావత్ దేశ పౌరులు సంఘీభావం ప్రకించారు. స్వీయ నియంత్రణ పాటిస్తూ ఇళ్లకే పరిమితమయ్యారు దేశ ప్రజలు. కరోనా వ్యాధి వేగవంతంగా వ్యాప్తి చెందకుండా సమర్థవంతంగా అదుపుచేగలిగామనుకుంటున్న తరుణంలో ఢిల్లీలోని మత ప్రార్థనలు పిడుగులాంటి పంజాను భారత దేశంపై విసిరాయి.

 ప్రజల స్వచ్చంద స్వీయ నియంత్రిణ.. చిచ్చు రేపిన జమాత్ ఉదంతం..

ప్రజల స్వచ్చంద స్వీయ నియంత్రిణ.. చిచ్చు రేపిన జమాత్ ఉదంతం..

దేశంతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా వ్యాధిని అద్బుతంగా కట్టడి చేయగలిగామని, మరో రెండు వారాలు ఇదే విధంగా ప్రజలు సహకరిస్తే ఊపిరి పీల్చుకున్నట్టే అనుకుంటున్న సమయంలో దేశం ఉలిక్కి పడే సంఘటన చోటుచేసుకుంది. వాక్సీన్ కనిపెట్టబడని కరోనా మహమ్మారిని తరిమికొట్టే క్రమంలో ప్రజలు ఏకాభిప్రాయానికి వచ్చిన తరుణంలో దాన్ని విచ్చిన్నం చేసేందుకు కొన్ని శక్తులు ప్రయత్నాలు చేసినట్టు కేంద్ర ప్రభుత్వం ప్రాథమిక అంచనాకు వచ్చినట్టు తెలుస్తోంది. దేశంలో ఈ వ్యాధిని వ్యాప్తి చేసేందుకు ఎవరు ఏ విధమైన కుతంత్రాలు పన్నారో ఆరా తీసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమాయత్తమయ్యాయి.

 ప్రార్ధనల పేరుతో కుట్ర.. ఛేదించే దిశగా కేంద్రం..

ప్రార్ధనల పేరుతో కుట్ర.. ఛేదించే దిశగా కేంద్రం..

మరో పక్క ప్రజలందరూ పకడ్బంధీగా స్వీయ నియంత్రణ పాటిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సహకరిస్తున్నారు. కొరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య పెరగకుండా కట్టుదిట్టంగా వ్యవహరిస్తున్నప్పటికి కొన్ని రాష్ట్రాల్లో కొరోనా పాజిటీవ్ కేసులు సంఖ్య పెరగడం కలవానికి గురిచేసింది. అసలు ఎందుకు ఈ వ్యాధి ప్రబలుతోంది, ఎవరి ద్వారా ఈ వ్యాధి సంక్రమిస్తోంది అనే అంశాలపై నిఘా పెట్టాయి ప్రభుత్వాలు. ప్రజలు ఎక్కడ కూడా గుంపులుగా ఉండకూడదు, సమూహాలుగా ఏర్పడి ఎక్కువ సమయం అదే సమూహంలో ఉంటే చాలా ప్రమాదమని కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసినప్పటికి కొంత మంది మత పెద్దలు ఈ హెచ్చరికలను బేఖాతరు చేసినట్టు తెలుస్తోంది.

 అప్రమత్తమయిన తెలుగు రాష్ట్రాలు.. ఢిల్లీ నుంచి వచ్చిన వారిపై నిఘా..

అప్రమత్తమయిన తెలుగు రాష్ట్రాలు.. ఢిల్లీ నుంచి వచ్చిన వారిపై నిఘా..

దేశ వ్యాప్తంగా ప్రముఖ ఆలయాలను మూసివేయడంతో పాటు సామూహిక ప్రార్ధనలను ప్రభుత్వాలను తాత్కాలికంగా నిషేదించాయి. కాగా గత మార్చి నెలలో 13వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు దేశ రాజధాని ఢిల్లీ నిజాముద్దీన్ మార్కెట్ లో నిర్వహించిన తబ్లీమీ జమాత్ ప్రార్థనలకు దేశం నలుమూలల నుండి వేల సంఖ్యలో పాల్గొన్నట్టు నిర్థారణ అయ్యింది. తెలంగాణ నుండి 1030 మంది ఈ ప్రార్థనలకు హాజరుకాగా కేవలం గ్రేటర్ పరిధి నుండే దాదాపు 600 మంది ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లి వచ్చినట్టు తెలుస్తోంది. ఏపిలో ఎంతమంది ఈ ప్రార్ధనలకు వెళ్లారు..? ఏఏ జిల్లాల్లో సంచరిస్తున్నారు అనే అంశంపై ఆరా తీస్తున్నట్టు సమాచారం. మొత్తానికి కరోనా మహమ్మారిని తరిమికొట్టామనుకుంటున్న తరుణంలో ఢిల్లీ జమాత్ ప్రార్ధనల సంఘటన భారత దేశాన్ని ఉలిక్కి పడేలా చేసాయి.

English summary
Tbilmi Jamaat prayers held in the Delhi capital Nizamuddin Market, the capital of the country from 13th to 15th of March, have been confirmed by thousands of people from all over the country. 1030 people from Telangana attended these prayers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X