బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Drug Case: ఎఫ్ఐఆర్ లో 25 మంది, ఇద్దరు టాప్ హీరోయిన్లు, 180 మంది సాక్షులు, ఓయమ్మో !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: బెంగళూరు డ్రగ్స్ మాఫియా, స్యాండిల్ వుడ్ డ్రగ్స్ కేసుకు సంబంధించి మరో ముందడుగు పడింది. బెంగళూరు డ్రగ్స్ కేసుకు సంబంధించి మొత్తం 25 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన అధికారులు కోర్టులో సమర్పించారు. డ్రగ్స్ కేసులో ఇద్దరు టాప్ హీరోయిన్లతో పాటు 25 మంది పేర్లు ఉన్నాయి. వందా రెండు వందలు కాకుండా ఏకంగా 2900 పేజీల చార్జ్ షీట్ నమోదు చేసి కోర్టు ముందు సమర్పించడంతో ఆ కేసులోని నిందితుల గుండెల్లో ఎక్స్ ప్రెస్ రైళ్లు పరిగెడుతున్నాయి. బెయిల్ మీద బయటకు వచ్చిన ఇద్దరు హీరోయిన్లకు ఈ దెబ్బతో చెమటలు పడుతున్నాయని సమాచారం.

మంత్రి VS అమ్మాయి: బీర్ తాగుతావా ?... అబ్బా... ఫుల్ మీల్స్... మంత్రి నోట్లో, ఆడియో!మంత్రి VS అమ్మాయి: బీర్ తాగుతావా ?... అబ్బా... ఫుల్ మీల్స్... మంత్రి నోట్లో, ఆడియో!

 ఎన్ సీబీ ఎంట్రీతో సీన్ సితారా

ఎన్ సీబీ ఎంట్రీతో సీన్ సితారా

బాలీవుడ్ డ్రగ్స్ కేసుకు సంబంధించి ఎన్ సీబీ అధికారులు రంగంలోకి దిగడంతో దేశవ్యాప్తంగా తీవ్రచర్చకు దారితీసింది. బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ (SSR) ఆత్మహత్య తరువాత బాలీవుడ్, ముంబాయి డ్రగ్స్ మాఫియా కేసు తెరమీదకు వచ్చింది. భారతదేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా బాలీవుడ్ డ్రగ్స్ కేసుపై జోరుగా చర్చ జరిగింది.

 ముంబాయి దెబ్బతో బెంగళూరులో ?

ముంబాయి దెబ్బతో బెంగళూరులో ?

ముంబాయి డ్రగ్స్ కేసు తరువాత బెంగళూరు డ్రగ్స్ మాఫియా, స్యాండిల్ వుడ్ డ్రగ్స్ వ్యహారం తెరమీదకు వచ్చింది. బెంగళూరులోని వివిద ప్రాంతాల్లో సోదాలు చేసిన బెంగళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ (CCB) పోలీసులు అనేక మందిని అరెస్టు చేసి జైలుకు పంపించారు. బెంగళూరులోని కాటన్ పేట్ పోలీస్ స్టేషన్ లో డ్రగ్స్ కేసు నమోదు అయ్యింది.

 టాప్ హీరోయిన్లు జైలుపాలు

టాప్ హీరోయిన్లు జైలుపాలు

బెంగళూరు డ్రగ్స్ కేసు వ్యవహారంలో డీఎస్పీ గౌతమ్ ఫిర్యాదు మేరకు కాటన్ పేట్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైయ్యింది. ఇదే కేసులో బెంగళూరు సీసీబీ పోలీసులు స్యాండిల్ వుడ్ బ్యూటీలు రాగిణి ద్వివేది, సంజనా గల్రానీలను అరెస్టు చేసి పరప్పన అగ్రహార సెంట్రల్ జైలుకు పంపించారు. కొన్ని నెలల పాటు జైల్లో ఉన్న బ్యూటీలు రాగిణి ద్వివేది, సంజనాలు బెయిల్ మీద బయటకు వచ్చారు.

 డ్రగ్స్ దెబ్బతో కబాడి... ఫుట్ బాల్

డ్రగ్స్ దెబ్బతో కబాడి... ఫుట్ బాల్

బెంగళూరు డ్రగ్స్ కేసులో స్యాండిల్ వుడ్ బ్యూటీలు రాగిణి ద్వివేది, సంజనా గల్రానీ, వీరేన్ ఖన్నా, రాహుల్ తోన్స్, హ్మాకర్ శ్రీక్రిష్ణ, జయనగర్ ఆర్ టీఓ కార్యాలయం అధికారి రవిశంకర్ తో పాటు అనేక మంది అరెస్టు అయ్యి జైలుకు వెళ్లారు. వీరిలో రాగిణి ద్వివేది, సంజనాలతో పాటు చాలా మంది బెయిల్ మీద జైలు నుంచి బయటకు వచ్చారు. ఇంకా కొందరు నిందితులు బెయిల్ రాక జైల్లోనే ఉంటున్నారు.

 ఎఫ్ఐఆర్ లో 25 మంది పేర్లు... వేల పేజీల ఎఫ్ఐఆర్

ఎఫ్ఐఆర్ లో 25 మంది పేర్లు... వేల పేజీల ఎఫ్ఐఆర్

బెంగళూరు డ్రగ్స్ కేసులో బెంగళూరు సీసీబీ పోలీసులు 180 మంది సాక్షులను విచారణ చేసి సుమారు 2900 పేజీల చార్జ్ షీటు తయారు చేశారు. సీసీబీ పోలీసులు తయారు చేసిన ఎఫ్ఐఆర్ లో హీరోయిన్లు రాగిణి ద్వివేది, సంజనా గల్రానీలతో పాటు మొత్తం 25 మంది పేర్లు ఉన్నాయి. సీసీబీ పోలీసులు వాళ్ల పని వాళ్లు పూర్తి చెయ్యడంతో ఇప్పుడు డ్రగ్స్ కేసులో ఉన్న వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని సమాచారం.

English summary
Sandalwood Drug Case: CCB Submits Investigation Report Against 25 People including Sanjjana and Ragini to Bengaluru Court.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X