• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

Kangana: కరోనా కంటే కంగనా డేంజర్, క్వీన్ పక్కలో డాన్ అబుసలేం తమ్ముడా ? నగ్మా ఎంట్రీతో కలకలం !

|

ముంబాయి/ న్యూఢిల్లీ/ బెంగళూరు: కరోనా వైరస్ కంటే బాలీవుడ్ బ్యూటీ'క్విన్'కంగనా రనౌత్ చాలా డేంజర్ అంటున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. మహారాష్ట్ర ప్రభుత్వంపై, కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీని టార్గెట్ చేసుకుని విమర్శిస్తున్న కంగనా రనౌత్ మీద విరుచుకుపడటానికి బహుబాష నటి, కాంగ్రెస్ పార్టీ లీడర్ నగ్మా రంగంలోకి దిగారు. నటి కంగనా రనౌత్ ఎప్పుడో తీసుకున్న కొన్ని ఫోటోలు సైలెంట్ గా సోషల్ మీడియాలో విడుదల చేసిన నగ్మా ఈ ఫోటోలు మీరూ చూడండి, కంగనా అసలు భాగోతం మీకే అర్థం అవుతోంది అంటున్నారు. కంగనా లిక్కర్ గ్లాస్ చేతిలో పట్టుకుని ఫోటోకు ఫోజు ఇవ్వడం, పక్కనే ఓ వ్యక్తి ఉండటంతో ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. మాఫీయా డాన్ అబుసలేం సోదరుడితో నటి కంగనా ఫోటో తీసుకుంది అంటూ కొందరు సోషల్ మీడియాలో పోస్టు చెయ్యడంతో ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

Drugs racket: కంగనాకు షాక్, డ్రగ్స్ లింక్ పై విచారణ, సోనియా గాంధీని సీన్ లోకి లాగిన క్వీన్ !

A to Z దులిపేసిన కంగనా

A to Z దులిపేసిన కంగనా

బాలీవుడ్ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ (SSR) అనుమానాస్పద మరణం తరువాత మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేతో పాటు శివసేన నాయకులు, కాంగ్రెస్ పార్టీ చీఫ్ సోనియా గాంధీ, అమిత్ బచ్చన్ కుటుంబ సభ్యులు, బాలీవుడ్ టాప్ హీరోలు అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, మహేష్ భట్, తాప్సీ పన్ను, నసీరుద్దీన్ షా, సంజయ్ దత్ తదితరుల మీద కంగనా రనౌత్ తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తోంది. మహారాష్ట్ర ప్రభుత్వం, బాలీవుడ్ మూవీ మాఫియా ఒక్కటైపోయిందని కంగనా రనౌత్ తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు.

కంగనా మాజీ ప్రియుడు పంచ్

కంగనా మాజీ ప్రియుడు పంచ్

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పద మరణం తరువాత బాలీవుడ్ డ్రగ్స్ కేసు తెరమీదకు వచ్చింది. రియా చక్రవర్తి అరెస్టు తరువాత నటి కంగనా రనౌత్ మహారాష్ట్ర ప్రభుత్వం, డ్రగ్స్ మాఫియా మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేసింది. ఇదే సమయంలో కంగనా రనౌత్ మాజీ ప్రియుడు తెరమీదకు వచ్చాడు. కంగనా రనౌత్ డ్రగ్స్ సేవిస్తుందని, మత్తుపదార్థాలు లేకపోతే ఆమె తట్టుకోలదు అంటూ విమర్శించిన వీడియో ఇటీవల వైరల్ అయ్యింది.

నగ్మా ఎంట్రీతో కలకలం

నగ్మా ఎంట్రీతో కలకలం

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ మీద రగిలిపోతున్న మహారాష్ట్ర ప్రభుత్వం ఆమె ఏమైనా డ్రగ్స్ సేవించి వాగుతున్నారా ? అంటూ విచారణ చెయ్యాలని ఆదేశించడంతో ముంబాయి పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, అలనాటి అందాల తార నగ్మా కంగనా రనౌత్ కు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో విడుదల చెయ్యడం, ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరు అని క్లారిటీ ఇవ్వకపోవడంతో కలకలం రేపాయి. కంగనాతో పాటు ఆ ఫోటోల్లో ఉన్న వ్యక్తి ఎవరు ? అని జోరుగా చర్చ జరుగుతోంది.

కంగనాతో మాఫియా ఢాన్ అబుసలేం సోదరుడు ?

కంగనాతో మాఫియా ఢాన్ అబుసలేం సోదరుడు ?

కంగనాతో పాటు ఫోటోలో ఉన్న వ్యక్తి మాఫియా డాన్ అబుసలేం సోదరుడు అని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. కంగనా చేతిలో వైన్ గ్లాస్ పట్టుకోవడం, పక్కన ఉన్న వ్యక్తి చేతిలో స్టైల్ గా బీరు బాటిల్ పట్టుకుని నిలబడి ఉన్నాడు. కంగనా భలే మందు తాగుతుంది కదా ? అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు పోస్టు చేస్తున్నారు.

ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరంటే !

ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరంటే !

కంగనా రనౌత్ తో పాటు బీర్ బాటిల్ పట్టుకుని నిలబడి ఉన్న వ్యక్తి అబుసలేం సోదరుడు కాదని కొంచెం క్లారిటీ వచ్చింది. కంగనా రనౌత్ పక్కన నిలబడి ఉన్న వ్యక్తి ముంబాయికి చెందిన ఓ పాత్రికేయుడు, సిమ్రాన్ సినిమా విడుదల సందర్బంగా జరిగిన ప్రచారకార్యక్రమం, ఆ సమయంలో జరిగిన పార్టీలో నటి కంగనాతో ఆ పాత్రికేయుడు కలిసి ఫోటో తీసుకున్నారని క్లారిటీ వచ్చింది.

 మీరు తాగలేదా మందు ?

మీరు తాగలేదా మందు ?

కంగనా రనౌత్ విషయంలో నటి నగ్మా ఎంట్రీ ఇవ్వడంతో కలకలం రేపింది. అయితే కంగనా వ్యక్తిగత విషయాల గురించి సోషల్ మీడియాలో ఇలాంటి తప్పుడు కూతలు కుయ్యకూడదని ఆమె అభిమానులు మండిపడుతున్నారు. ఏం కంగనా రనౌత్ మందు తాగితే తప్పేముంది ?, మీరు తాగలేదా ఎప్పుడు విస్కీ, బ్రాందీ, బీర్లు అంటూ ఆమె అభిమానులు సోషల్ మీడియాలో విరుచుకుపడుతున్నారు.

English summary
Drug mafia: Actress and politician Nagma tweeted old picture of Kangana Ranaut having a party. Man in that picture is in question now.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X