బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Drug mafia: హీరోయిన్లకు నో బెయిల్, జైల్లో రామభజన, సెలబ్రిటీలు కాదు, ఖైదీలతో కాలక్షేపం, లుక్ ఔట్ !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/ ముబాయి/ మంగళూరు: డ్రగ్స్ దందా కేసులో అరెస్టు అయిన హీరోయిన్లు రాగిణి ద్వివేది, సంజనా గల్రానీలకు మరోసారి కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మాకు బెయిల్ ఇవ్వండి మహాప్రభో అంటూ రాగిణి, సంజనా పెట్టుకున్న బెయిల్ పిటిషన్లను కోర్టు కొట్టివేసింది. రాగిణి, సంజనాలకు బెయిల్ ఇవ్వలేమని, విచారణ వాయిదా వేస్తున్నామని బెంగళూరులోని ప్రత్యేక కోర్టు చెప్పింది. బెయిల్ రాకపోవడంతో రాగిణి, సంజనా బెంగళూరు నగర శివార్లలోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో రామభజన చేస్తున్నారు. డ్రగ్స్ కేసు దందాలో తప్పించుకుని తిరుగుతున్న వాళ్ల కోసం లుక్ ఔట్ నోటీసులు జారీ చేశారు.

Khiladi wife: కొవ్వు కరిగించాలని భార్య జిమ్ కు, జిమ్ మాస్టర్ కు ఫ్రూట్ జ్యూస్, భర్తకు ఖాళీ గ్లాస్!Khiladi wife: కొవ్వు కరిగించాలని భార్య జిమ్ కు, జిమ్ మాస్టర్ కు ఫ్రూట్ జ్యూస్, భర్తకు ఖాళీ గ్లాస్!

 ఈడీ ఎంట్రీతో రాగిణి, సంజనాలకు చెమటలు

ఈడీ ఎంట్రీతో రాగిణి, సంజనాలకు చెమటలు

బెంగళూరు డ్రగ్స్ దందా కేసు వెలుగు చూసిన తరువాత ఈడీ అధికారులు ఎంట్రీ ఇచ్చారు. హీరోయిన్లు రాగిణి ద్వివేది, సంజనా గల్రానీ, రాహుల్, వీరేన్ ఖన్నా, బీకే. రవిశంకర్ లను ఈడీ అధికారులు విచారణ చెయ్యనున్నారు. డ్రగ్స్ దందాతో వీరు భారీ మొత్తంలో అక్రమ ఆస్తులు సంపాధించారని ఆరోపణలు ఉన్నాయి. హీరోయిన్లు రాగిణి, సంజనా, రాహుల్, వీరేన్ ఖన్నా, రవిశంకర్ ల అక్రమ ఆస్తుల విషయంపై ఈడీ అధికారులు క్షుణ్ణంగా ఆరా తియ్యడానికి సిద్దం అవుతున్నారని తెలిసింది.

 అయ్యా బెయిల్ ఇవ్వండి

అయ్యా బెయిల్ ఇవ్వండి

డ్రగ్స్ మాఫియా కేసులో అరెస్టు అయిన స్యాండిల్ వుడ్ బ్యూటీ హనీ రాగిణి ద్వివేది, బహుబాష నటి సంజనా గల్రానీతో పాటు ఇంతకాలం డ్రగ్స్ సేవించి జల్సాలు చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న రాహుల్, వీరేన్ ఖన్నా, బీకే, రవిశంకర్ తమకు బెయిల్ మంజూరు చెయ్యాలని బెంగళూరు సిటీలోని ఎన్ డీపీఎస్ ప్రత్యేక కోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు.

 రాగిణి, సంజనాలకు నో బెయిల్

రాగిణి, సంజనాలకు నో బెయిల్

రాగిణి, సంజనాల బెయిల్ పిటిషన్ ను ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జేఎం. శీనప్ప విచారణ చేశారు. సంజనా, రాగిణిలకు బెయిల్ మంజూరు చేస్తే వాళ్లు సాక్షాలు తారుమారు చేసే అవకాశం ఉందని, కేసు తప్పుదోవపట్టే అవకాశం ఉందని క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. కేసు వివరాలు తెలుసుకున్న ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జేఎం. శీనప్ప రాగిణి, సంజనాలకు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించారు.

 హైకోర్టుకు రాగిణి, సంజనా

హైకోర్టుకు రాగిణి, సంజనా

బెంగళూరు ప్రత్యేక కోర్టులో బెయిల్ రాకపోవడంతో రాగిణి, సంజనాలు కర్ణాటక హైకోర్టును ఆశ్రయించడానికి సిద్దం అయ్యారని తెలిసింది. ఇదే డ్రగ్స్ కేసులో అరెస్టు అయిన రవిశంకర్, ప్రశాంత్ రంకా, అభిస్వామి, వైభవ్ జైన్, ప్రశాంత్ రాజు బెయిల్ పిటిషన్ విచారణను సెప్టెంబర్ 30వ తేదీకి వాయిదా వేశారు. వీరేన్ ఖన్నాబెయిల్ పిటిషన్ విచారణ అక్టోబర్ 1వ తేదీకి వాయిదా వేశారు.

 రాగిణి, సంజనాలు సెలబ్రిటీలు కాదు.... ఖైదీలు

రాగిణి, సంజనాలు సెలబ్రిటీలు కాదు.... ఖైదీలు

బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లోని ప్రత్యేక సెల్ లో నటి రాగిణి, సంజనాలు ఉన్నారు. రాగిణి, సంజనాల 14 రోజుల రిమాండ్ గడుపు పూర్తి కావడం, ఇద్దరికీ బెయిల్ రాకపోవడంతో వారిని ప్రత్యేక సెల్ నుంచి సాధారణ ఖైదీలు ఉండే బ్యారెక్ లకు తరలించడానికి పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు అధికారులు సిద్దం అయ్యారని తెలిసింది. మొత్తం మీద ఇంతకాలం సెలబ్రిటీలుగా చాలమణి అయిన రాగిణి, సంజనాలు ఇప్పుడు సాధారణ ఖైధీలతో కలిసి కాలం గడపడానికి సిద్దం అయ్యారు.

 లుక్ ఔట్ నోటీసులు

లుక్ ఔట్ నోటీసులు

బెంగళూరు డ్రగ్స్ దందా కేసులో ఆరోపణలు ఎదర్కొంటు పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరుగుతున్న వారిని పట్టుకోవడానికి బెంగళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు లుక్ ఔట్ నోలీసులు జారీ చేశారు. క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో ఏ1 ఆరోపి శివప్రకాశ్ చిప్పి, ఆదిత్య అళ్వా (ఏ2 ఆరోపి) ఇంత వరకు పోలీసులకు చిక్కలేదు. శివప్రకాశ్ చిప్పి, ఆదిత్య అళ్వా ముందస్తు బెయిల్ తీసుకోవడానికి కోర్టును ఆశ్రయించారు.

Recommended Video

COVID-19 సహా వైరల్ ఇన్ఫెక్షన్లను చంపడానికి APT™ T3X Ointment తో కరోనా వైరస్ కు చెక్ ! || Oneindia
 జైల్లోనే రాగిణి, సంజనా కాలక్షేపం

జైల్లోనే రాగిణి, సంజనా కాలక్షేపం

కేసు నుంచి తనను తప్పించాలని ఆదిత్య అళ్వా, తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని శివప్రకాశ్ చిప్పి కోర్టులో పిటిషన్ లు దాఖలు చేశారు. అయితే శివప్రకాశ్ చిప్పి, ఆదిత్య అళ్వా పిటిషన్లను కోర్టు కొట్టి వేయడంతో వారిని పట్టుకోవడానికి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు లుక్ ఔట్ నోటీసులు జారీ చేశారు. మొత్తం మీద బెయిల్ రాకపోవడంతో నటి రాగిణి, సంజనా ఇంకా కొన్ని రోజులు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లోనే కాలం గడపనున్నారు.

English summary
Drug mafia: A special Narcotics Drugs and Psychotropic Substances (NDPS) court rejected the bail applications of the Sanjana Galrani, Ragini Dwivedi and three accused who arrested by the CCB police.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X