వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Drug mafia: దీపావళికి ముందే దీపికాకు డబుల్ ఢమాకా ?, ఈ వీడియో ఏంది ?, 6 గంటలు విచారణ, కరణ్!

|
Google Oneindia TeluguNews

ముంబాయి/ హైదరాబాద్/ న్యూఢిల్లీ: బాలీవుడ్ సినీ ఇండస్ట్రీని కుదిపేస్తున్న డ్రగ్స్ కేసులో నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) అధికారులు పద్మావతి దీపికా పదుకొనెని సుమారు 6 గంటలు ప్రశ్నించి ప్రశ్నల వర్షం కురిపించారు. బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపికా పదుకొనెతో పాటు శ్రద్దా కపూర్, సారా ఆలీఖాన్ లను ఎన్ సీబీ అధికారులు విచారణ చేస్తున్నారు. ఇప్పటికే ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్ ను సుమారు 4 గంటల పాటు విచారణ చేసిన ఎన్ సీబీ అధికారులు ఆమెకు ప్రశ్నల వర్షం కురిపించి సమాచారం సేకరించారు. ఈ రోజు దీపికా పదుకొనె, శ్రద్దా కపూర్, సారా ఆలీఖాన్ ఏం చెప్పారో అంటూ బాలీవుడ్ సినీ ప్రముఖలు టెన్షన్ టెన్షన్ గా ఎదురు చూస్తున్నారు. దీపావళికి ముందే దీపికాకు ఢబుల్ ఢమాకా ? అంటు సోషల్ మీడియాలో నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఇంకో పక్క ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహార్ ఇంటిలో జరిగిన బాలీవుడ్ సెలబ్రిటీల పార్టీ వీడియో విషయంలో దీపికా పదుకొనె ఏం చెప్పింది ? అంటూ ఆ పార్టీకి హాజరైన సినీ ప్రముఖులు హడలిపోతున్నారు.

Drug mafia: రకుల్ ప్రీత్ కు రగులుతుంది మొగలిపొద గ్యారెంటి ?, ఆ రోజు దంచేసి ఈ రోజు ?, కలికాలం !Drug mafia: రకుల్ ప్రీత్ కు రగులుతుంది మొగలిపొద గ్యారెంటి ?, ఆ రోజు దంచేసి ఈ రోజు ?, కలికాలం !

పార్టీ వీడియోలో దీపికా భలే కనపడుతోంది కదా !

పార్టీ వీడియోలో దీపికా భలే కనపడుతోంది కదా !

2019లో ముంబాయిలోని ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహార్ ఇంటిలో బాలీవుడ్ స్టార్స్ తో డ్రగ్స్ పార్టీ జరిగింది ? అని ఆరోపిస్తూ శిరోమణి అకాలిదళ్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే మంజిందర్ సింగ్ సిర్సా ఇప్పటికే ఎన్ సీబీ చీఫ్ రాకేష్ ఆస్తానాతో పాటు ఆ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఎన్ సీబీ అధికారులకు బాలీవుడ్ స్టార్స్ నిర్వహించిన వీడియోను కూడా మాజీ ఎమ్మెల్యే మంజిందర్ సింగ్ సిరా ఎన్ సీబీ అధికారులకు ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే మంజిందర్ సింగ్ సిరా మీడియాకు విడుదల చేసిన వీడియోలో దీపికా పదుకొనె చాలా క్లియర్ గా కనపడుతోంది. ఆ వీడియో గురించి దీపికా పదుకొనెని ఎన్ సీబీ అధికారులు ప్రశ్నించారని తెలిసింది.

బాలీవుడ్ స్టార్స్ మస్త్ మజా ?

బాలీవుడ్ స్టార్స్ మస్త్ మజా ?


కరణ్ జోహార్ ఇంటిలో పెద్దఎత్తున బాలీవుడ్ స్టార్స్ హాజరైన సమయంలో డ్రగ్స్ పార్టీ జరిగిందని, ఆ వీడియో మా దగ్గర ఉందని మాజీ ఎమ్మెల్యే మంజిందర్ సింగ్ సిర్సా పదేపదే ఆరోపిస్తున్నారు. కరణ్ జోహార్ ఇంటిలో జరిగిన పార్టీకి బాలీవుడ్ ఫేమస్ సెలబ్రిటీలు దీపికా పదుకొనే, మలైకా అరోరా, అర్జున్ కపూర్, షాహిద్ కపూర్, వరుణ్ ధావన్, విక్కీ కౌషల్ తదితరులు హాజరైనారని మాజీ ఎమ్మెల్యే మంజిందర్ సింగ్ సిర్సా ఆరోపించారు. వీరందరు కెమెరాల కంటికి కనిపించకుండా ఒకరి చేతికి ఒకరు డ్రగ్స్ అందించుకున్నారని, అయితే ఆ స్టార్ నటీ నటులు అందరూ వీడియోలో ఉన్నారని మాజీ ఎమ్మెల్యే మంజిందర్ సింగ్ సిర్సా ఇప్పటికే ఆరోపించారు.

పార్టీ వీడియో వైరల్

ఈ రోజు (శనివారం) ముంబాయిలోని NCB కార్యాలయంలో దీపికా పదుకొనె, శ్రద్దా కపూర్, సారాఆలీఖాన్ తదితరులను అధికారులు విచారణ చేస్తున్నారు. ఇదే సమయంలో 2019లో ఓ శనివారం రాత్రి కరణ్ జోహార్ ఇంటిలో జరిగిన పార్టీకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ పార్టీ వీడియోలో దిపికా పదుకొనే, మలైకా అరోరా, అర్జున్ కపూర్, షాహిద్ కపూర్, మీరా రాజ్ పుత్ కపూర్, వరుణ్ ధావన్, నటాషా దలాల్, జోయా అక్తర్, మిలంద్ డియోరా భార్య పూజా శెట్టి, జోయా అక్తర్, విక్కీ కౌషల్, అయాన్ ముఖర్జీ తదితరులు ఉన్నారని వెలుగు చూసింది. ఈ వీడియోను కరణ్ జోహార్ స్వయంగా చిత్రీకరించారని మాజీ ఎమ్మెల్యే మంజిందర్ సింగ్ సిర్సా ఇప్పటికే మీడియా ముందు ఆరోపించారు.

దీపికా ఏం చెబుతుందో ?

దీపికా ఏం చెబుతుందో ?

ఎన్ సీబీ అధికారుల ముందు విచారణకు హాజరైన బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనె అధికారులు అడిగే ప్రశ్నలకు ఏం సమాధానాలు ఇస్తుందో ? అంటూ ఆమెకు ఇంతకాలం సన్నిహితంగా ఉంటున్న సెలబ్రిటీలు హడలిపోతున్నారు. కరణ్ జోహార్ ఇంటిలో డ్రగ్స్ పార్టీ జరిగిందని ఆరోపిస్తూ విడుదలైన వీడియో ప్రస్తుతం వైరల్ కావడంతో బాలీవుడ్ లో కలకం రేపింది. వీడియోలో ఉన్న కొందరు సెలబ్రిటీలు ఎక్కడ మామీద ఎన్ సీబీ అధికారులు పంజా విసురుతారో అంటూ హడలిపోతున్నారని సమాచారం. SAD పార్టీ మాజీ ఎమ్మెల్యే మంజిందర్ సింగ్ సిర్సా విడుదల చేసిన వీడియో దెబ్బకు బాలీవుడ్ లోని కొందరికి చెమటలు పడుతున్నాయి.

కరణ్ జోహార్ ను విచారణ చెయ్యాలి

కరణ్ జోహార్ ను విచారణ చెయ్యాలి

కరణ్ జోహార్ ఇంటిలో జరిగిన డ్రగ్స్ పార్టీకి సంబంధించి తాను ఇప్పటికే ముంబాయి పోలీసులకు ఫిర్యాదు చేశానని, అయినా వారు కనీసం పట్టించుకోలేదని సిరోమణి అకాలిదళ్ మాజీ ఎమ్మెల్యే మంజిందర్ సింగ్ సిర్సా ఆరోపించారు. ముంబాయి పోలీసులు కరణ్ జోహార్ తో కలిసిపోయి ఉండాలి ? లేదా, డ్రగ్స్ కేసు వారికి సర్వసాధారణం అని పట్టించుకోకుండా ఉండాలి అనే అనుమానాలు తనకు వ్యక్తం అవుతున్నాయని, అందుకే తాను ఎన్ సీబీ అధికారులకు ఫిర్యాదు చేశానని మాజీ ఎమ్మెల్యే మంజిందర్ సింగ్ సిర్సా అన్నారు. కరణ్ జోహార్ ను విచారణ చెయ్యాలని ఇప్పటికే తాను ఎన్ సీబీ అధికారులకు మనవి చేశానని, కరణ్ జోహార్ ను విచారణ చేస్తారని నమ్ముతున్నానని మాజీ ఎమ్మెల్యే మంజిందర్ సింగ్ సిర్సా అన్నారు.

రకుల్, దీపికా దెబ్బతో హడల్

రకుల్, దీపికా దెబ్బతో హడల్

ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్ ను విచారణ చేసిన అధికారులు ఆమె చెప్పిన సమాధాలను రికార్డు చేసి వాటిని కోర్టు ముందు హాజరుపరచడానికి సిద్దం అయ్యారని తెలిసింది. అయితే శనివారం ఎన్ సీబీ అధికారుల విచారణలో దీపికా పదుకొనె ఏం సమాధానం ఇచ్చారు? ఎవరెవరి పేర్లు చెప్పారు ? అనే విషయం అంతుచిక్కడం లేదని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

రియాకు రకుల్ రివర్స్ పంచ్

రియాకు రకుల్ రివర్స్ పంచ్

బాలీవుడ్ డ్రగ్స్ కేసులో ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్ చిక్కుకోవడానికి రియా చక్రవర్తి కారణం అని ఆరోపణలు ఉన్నాయి. డ్రగ్స్ కేసులో ఇప్పటికే అరెస్టు అయ్యి జైలుపాలైన రియా చక్రవర్తి తనను కేసులో ఇరికించిందని రకుల్ మండిపడుతున్నదని తెలిసింది. తన ఇంటిలో చిక్కిన డ్రగ్స్ రియా చక్రవర్తివే, ఆ డ్రగ్స్ కు తనకు ఎలాంటి సంబంధం లేదు అని రకుల్ ప్రీత్ సింగ్ ఎన్ సీబీ అధికారులకు చెప్పిందని ముంబాయి మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. మొత్తం మీద రకుల్ ప్రీత్ సింగ్, దీపికా పదుకొనె, శ్రద్థా కపూర్, సారా ఆలీ ఖాన్ తదితరులు ఎన్ సీబీ అధికారుల విచారణలో ఎవరెవరి విషయాలు బయటకు చెబుతారో ? అనే విషయం వేచి చూడాలి.

English summary
Drug mafia: Deepika Padukone leaves NCB office affter 6 hours. NCB officers files FIR against Karan Johar related to a old party video that went viral few days back.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X