బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Drug racket: వ్యాపారి, టెక్కీలు అరెస్టు, రాగిణి ఫ్రెండ్స్ కు సఫ్లే, దగ్గరకు రావద్దు నాకు కరోనా !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/ ముంబాయి/ న్యూఢిల్లీ: బెంగళూరు, స్యాండిల్ వుడ్ డ్రగ్స్ మాఫియా కేసులో రోజుకో పేరు తెరమీదకు వస్తోంది. ఇప్పుడు డ్రగ్స్ మాఫియా కేసు విచారణ చేస్తున్న బెంగళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ పోలీసు అధికారులు ప్రముఖ వ్యాపారితో పాటు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు (టెక్కీ)లను అరెస్టు చెయ్యడం కలకలం రేపింది. స్యాండిల్ వుడ్ బ్యూటీ క్వీన్ రాగిణి ద్వివేది క్లోజ్ ఫ్రెండ్ కు ఇప్పుడు అరెస్టు అయిన టెక్కీనే డ్రగ్స్ సరఫరా చేశాడని పోలీసులు అంటున్నారు. ఇప్పటికే స్యాండిల్ వుడ్ బ్యూటీ క్వీన్స్ రాగిణి ద్వివేది, సంజనాతో సహ మొత్తం 14 మంది మీద ఎఫ్ఐఆర్ నమోదు కావడంతో ఈ లిస్ట్ ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలిసింది. తనకు కరోనా ఉంది దగ్గరకు రావద్దు అంటూ ఇన్ని రోజులు పోలీసులకు క్రీమ్ బిస్కేట్ వేసిన వ్యాపారి అరెస్టు అయ్యాడు.

Illegal affair: ఆంటీ టీచర్, బెడ్ రూమ్ లో రొమాన్స్ పాఠాలు, తట్టుకోలేని భర్త ఎడిటింగ్ చేశాడు!Illegal affair: ఆంటీ టీచర్, బెడ్ రూమ్ లో రొమాన్స్ పాఠాలు, తట్టుకోలేని భర్త ఎడిటింగ్ చేశాడు!

 త్రిమూర్తులు అందర్

త్రిమూర్తులు అందర్

స్యాండిల్ వుడ్, బెంగళూరు డ్రగ్స్ మాఫియా కేసులో ఇప్పటికే రాగిణి, సంజనా, వ్యాపారవేత్త వీరేన్ ఖన్నా, రవిశంకర్ తదితరులు అరెస్టు అయిన విషయం తెలిసిందే. తాజాగా ప్రముఖ వ్యాపారి వైభవ్ జైన్, ప్రముఖ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు చేస్తూ ప్రస్తుతం జల్సాలు చేస్తున్న టెక్కీలు అరెస్టు అయ్యారు. మంగళూరు నివాసి ప్రతీక్ శెట్టి, హరియాణాకు చెందిన ఆదిత్య అగర్వాల్ అనే ముగ్గురిని బెంగళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.

 రాగిణి ఫ్రెండ్ కు డ్రగ్స్

రాగిణి ఫ్రెండ్ కు డ్రగ్స్

డ్రగ్స్ రాకెట్ కేసులో స్యాండిల్ వుడ్ బ్యూటీ క్వీన్ రాగిణి ద్వివేదితో పాటు ఆమె క్లోజ్ ఫ్రెండ్ రవిశంకర్ అరెస్టు అయిన విషయం తెలిసిందే. బెంగళూరు నగరంలోని జయనగర ఆర్ టీఓ కార్యాలయంలో ఉద్యోగం చేసే రవిశంకర్ కు చాలా కాలం నుంచి ఇదే సాఫ్ట్ వేర్ ఇంజనీరు ప్రతీక్ శెట్టి డ్రగ్స్ సరఫరా చేసేవాడని క్రైమ్ బ్రాంచ్ పోలీసు అధికారుల విచారణలో వెలుగు చూసింది.

 నా దగ్గరకు రాకండి.... కరోనా పాజిటివ్ జాగ్రత్త

నా దగ్గరకు రాకండి.... కరోనా పాజిటివ్ జాగ్రత్త

బెంగళూరు డ్రగ్స్ మాఫియా కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వైభవ్ జైన్ ప్రముఖ వ్యాపారి. తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని, తాను హోమ్ క్వారంటైన్ లో ఉన్నానని ఇన్ని రోజులు వ్యాపారి వైభవ్ జైన్ పోలీసులకు మాయమాటలు చెప్పాడు. అయితే కేసు విచారణ చేస్తున్న సమయంలో వైభవ్ జైన్ అతని న్యాయవాదులతో కోర్టులో ముందస్తు బెయిల్ తీసుకోవడానికి ప్రయత్నించాడు. ఇన్ని రోజులు వైభవ్ జైన్ కు కరోనా ఉందని పోలీసులు అతన్ని అరెస్టు చెయ్యలేదు.

 పోలీసులకే క్రీమ్ బిస్కెట్

పోలీసులకే క్రీమ్ బిస్కెట్

వ్యాపారి వైభవ్ జైన్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు క్రీమ్ బిస్కెట్ వేసి బెంగళూరు నుంచి తప్పించుకుని పారిపోవడానికి ప్రయత్నిస్తున్నాడని సమాచారం అందడంతో అతన్ని క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. కరోనాను అడ్డం పెట్టుకుని పోలీసుల కళ్లలో కారం చల్లడానికి ప్రయత్నిస్తున్న వైభవ్ జైన్ కు పోలీసులు సరైన ట్రీట్ మెంట్ ఇస్తున్నారని తెలిసింది.

 అనుకున్నదొక్కటి.... అయ్యిందొక్కటి

అనుకున్నదొక్కటి.... అయ్యిందొక్కటి

బెంగళూరు డ్రగ్స్ రాకెట్, స్యాండిల్ వుడ్ డ్రగ్స్ కేసు విచారణ చేస్తున్న బెంగళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ పోలీసు అధికారులు స్యాండిల్ వుడ్ బ్యూటీ క్వీన్స్ రాగిణి ద్వివేది, సంజనా, శివప్రకాష్, రవిశంకర్, రాహుల్, వీరేన్ ఖన్నా, ప్రశాంత్ రాంకా, వైభవ్ జైన్, ఆదిత్వ అళ్వా, ఉమా పెప్పర్ సైమన్, అశ్విన్ అలియాస్ బూగి, అభిస్వామి, రాహుల్ తూన్సేలపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇప్పటికే ఈ కేసులో కొందరిని అరెస్టు చేసిన పోలీసులు మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నారు.

English summary
Drug racket: Three accused arrested CCB police yesterday in Drug case in Bengaluru. Pratheet Shetty, Adidya Agarwal and Vibhav Jain were the accused.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X