విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కో అంటే కొకైన్, బ్లాక్‌బెర్రీ అంటే అమ్మాయి: ఇవీ డ్రగ్స్ నేరగాళ్ల కోడ్స్!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నగరంలో సోమవారం పట్టుబడిన నైజీరియన్ల ముఠా మాదకద్రవ్యాల కేసు దర్యాప్తులో ఆశ్చర్యకర విషయాలు వెలుగులోకి వచ్చాయి. రాచకొండ ఎస్‌వోటీ పోలీసులు నిర్వహించిన ఆపరేషన్‌లో నైజీరియన్‌ నేరగాళ్ల దగ్గర దొరికిన డైరీలో పలు కీలక విషయాలు వెల్లడయ్యాయి.

భారీ డ్రగ్స్ రాకెట్: నైజీరియన్లతోపాటు బెజవాడ అమ్మాయి అరెస్ట్, ప్రేమించే ఇలా చేస్తోందా? భారీ డ్రగ్స్ రాకెట్: నైజీరియన్లతోపాటు బెజవాడ అమ్మాయి అరెస్ట్, ప్రేమించే ఇలా చేస్తోందా?

డ్రగ్స్ దందాతోపాటు వ్యభిచారం..

డ్రగ్స్ దందాతోపాటు వ్యభిచారం..

నైజీరియన్లు తమ డ్రగ్స్ కార్యకలాపాల నిర్వహణ క్రమంలో కోడ్‌(సంకేత) భాషను వినియోగించినట్లు తేలింది. డ్రగ్స్‌ విక్రయాలతోపాటు హైదరాబాద్‌లో ఉంటున్న నైజీరియన్‌ అమ్మాయిలతో వ్యభిచార దందాకు పాల్పడినట్లు తేలడంతో ఈసారి పోలీసులు లోతుగా దర్యాప్తు చేశారు.

Recommended Video

Navadeep in Drugs Scandal, Top Tollywood Actors Trying to Save him
కోడ్ భాషలో..

కోడ్ భాషలో..

నైజీరియన్ నేరగాళ్లు.. కొకైన్‌ కావాలంటే ‘కో' అని.. అమ్మాయి కావాలంటే ‘బ్లాక్‌బెర్రీ(బీబీ)'గా సంకేత నామాలు వాడినట్లు గుర్తించారు పోలీసులు. ఈక్రమంలో డైరీలోని విషయాల గురించి మరింత లోతుగా విచారించే పనిలో నిమగ్నమయ్యారు.

రేవ్ పార్టీల్లో వాడకం..

రేవ్ పార్టీల్లో వాడకం..

నైజీరియన్ల ముఠా దగ్గర పోలీసులు కొకైన్‌, బ్రౌన్‌షుగర్‌తోపాటు ఎంపిటమైన్‌ మాత్రల్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎంపిటమైన్‌ మాత్రల్ని రేవ్‌పార్టీల్లో ఎక్కువగా వినియోగించేందుకు విక్రయించేవారని పోలీసులు గుర్తించారు.

లైంగికవాంఛ పెంచేవంటూ..

లైంగికవాంఛ పెంచేవంటూ..

కాగా, ఈ డ్రగ్స్ లైంగిక వాంఛ పెంచుతాయని చెబుతూ వినియోగదారులకు అమ్మినట్లు నిందితులు వెల్లడించారు. గులాబీ రంగు మాత్రల్ని అమ్మాయిలకు, నీలం రంగు మాత్రల్ని అబ్బాయిల కోసం ప్రత్యేకంగా తయారు చేశారంటూ అంటగట్టేవారని దర్యాప్తులో తేలింది.

లోతుగా దర్యాప్తు...

లోతుగా దర్యాప్తు...

గోవాలో గ్రాము కొకైన్‌ రూ.5 వేల లోపు లభ్యమవుతున్నట్లు సమాచారం. అయితే, ఈ నిషేధిత కొకైన్‌, బ్రౌన్‌షుగర్‌ ఉత్ప్రేరకాల్ని ఇక్కడ గ్రాముకు రూ.20 వేల చొప్పున విక్రయించడం ద్వారా ముఠా భారీఎత్తున డబ్బు పోగేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ లెక్కన 4రెట్లు అధికంగా విక్రయించడం ద్వారా రూ.లక్షల్లో ఆర్జించారనేది పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుల దగ్గర సుమారు రూ.2 లక్షలు మాత్రమే లభ్యం కావడంతో.. అక్రమార్జనను ఎప్పటికప్పుడు నైజీరియాకు పంపినట్లు భావిస్తున్నారు. అదుపులోకి తీసుకున్న నిందితులను లోతుగా విచారిస్తున్నారు పోలీసులు.

English summary
The diary belonging to one of the suspects, Ojukwu Cosmas, helped in decrypting the secret network the gang had built by spreading its contacts across the State and other places including Goa and Chennai.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X