Drugs case: కరణ్ ఇంట్లో బాలీవుడ్ స్టార్స్ పార్టీ, ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టు, ష్. దీపికా పదుకొనే !
ముంబాయి/ హైదరాబాద్/ న్యూఢిల్లీ: బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ (SSR) అనుమానాస్పద మృతి కేసు తరువాత తెర మీదకు వచ్చిన బాలీవుడ్ డ్రగ్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహార్ ఇంట్లో డ్రగ్స్ పార్టీ జరిగిందని, ఆ పార్టీకి హీరోయిన్ దీపికా పదుకొనేతో సహ అనేక మంది బాలీవుడ్ ప్రముఖులు హాజరైనారని ఆరోపణలు రావడంతో ఎన్ సీబీ అధికారులు విచారణ చేశారు. బాలీవుడ్ ప్రముఖుడు కరణ్ జోహార్ ఇంట్లో ఏ పార్టీ జరిగింది ? అనే విషయంపై ఫోరెన్సిక్ నిపుణులు ఓ క్లారిటీ ఇచ్చారు. అయితే దీపికా పదుకొనేకి మాత్రం ఊరట లబించలేదని తెలిసింది.
Boss wife: బాస్ భార్యతో లింక్, పనోడికి ప్రతిరోజూ పండగే, బెడ్ రూమ్, వాష్ రూమ్, 100 వీడియోలతో, పాపం !

పొలిటికల్ లీడర్ పంచ్
సుశాంత్ సింగ్ కేసు తరువాత బాలీవుడ్ ప్రములు కొందరికి చెమటలు పట్టాయి. బాలీవుడ్ ప్రముఖ దర్శక, నిర్మాత కరణ్ జోహార్ ఇంటిలో 2019లో బాలీవుడ్ టాప్ స్టార్స్ తో డ్రగ్స్ పార్టీ జరిగిందని, ఈ విషయంపై మీరు విచారణ జరిపాలని శిరోమణి అకాలిదళ్ పార్టీ మాజీ ఎమ్మెల్యే మంజిందర్ సింగ్ సిరా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూర్ (NCB)డైరెక్టర్ జనరల్ రాకేష్ అస్తానాను కలిసి ఫిర్యాదు చేశారు. ఇదే సమయంలో కరణ్ జోహార్ ఇంటిలో జరిగిన బాలీవుడ్ స్టార్స్ పార్టీకి సంబంధించిన వీడియోను సైతం ఎన్ సీబీ డైరెక్టర్ జనరల్ రాకేష్ అస్తానాకు అందించారు.
వీడియోలోని తెల్లిటి పదార్థం ఏమిటి ?
బాలీవుడ్ టాప్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ ఇంట్లో జరిగిన పార్టీలో తీసిన వీడియోలో కొందరు చెయ్యి ముక్కు దగ్గర పెట్టుకుని రుద్దుతున్నట్లు కనిపిస్తోంది. వీడియో ఓ తెల్లటి పదార్థం మెరుస్తూ కనిపిస్తోంది. అయితే అది డ్రగ్సా ? లేకా లైటింగ్ కాంతినా ? అనే విషయం అర్థం కావడం లేదని కొందరు నెటిజన్లు అంటున్నారు. పార్టీలో కొందరు కెమెరా కంటికి చిక్కకుండా డ్రగ్స్ దాచుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. మొత్తం మీద 2019లో కరణ్ జోహార్ ఇంటిలో డ్రగ్స్ పార్టీ జరిగిందని ఆరోపిస్తూ విడుదలైన వీడియో ప్రస్తుతం వైరల్ కావడంతో బాలీవుడ్ లో కలకం రేపింది. ఈ విషయంై ఎన్ సీబీ అధికారులు విచారణ జరిపారు.

ఫోరెన్సిక్ ల్యాబ్ లో పరిశీలన
కరోణ్ జోహార్ ఇంట్లో ఏ పార్టీ జరిగింది ? అంటూ NCB అధికారులు విచారణ చేశారు. కరణ్ జోహార్ ఇంట్లో పార్టీ సందర్బంగా తీసిన వీడియోను ఎన్ సీబీ అధికారులు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ కు పంపించి నిపుణులతో పరీక్షించారు. మా ఇంట్లో డ్రగ్స్ పార్టీ జరగలేదని, తాను అంటే గిట్టనివాళ్లు తన మీద లేనిపోని ఆరోపణలు చేసి నా జీవితానికి మచ్చ తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారని ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహార్ ఆరోపించారు.

వీడియోలో ఉండేది లైటింగ్.... డ్రగ్స్ కు సాక్షం లేదు
కరణ్ జోహార్ ఇంట్లో పార్టీ సందర్బంగా తీసిన వీడియోలో ఉన్న తెల్లటి కాంతి లైటింగ్, అది డ్రగ్స్ కాదు అంటూ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నిపుణులు నివేధిక ఇచ్చారని వెలుగు చూసింది. అంతే కాకుండా కరణ్ జోహార్ ఇంట్లో జరిగిన పార్టీలో బాలీవుడ్ ప్రముఖులు డ్రగ్స్ సేవించారు అని చెప్పడానికి ఎలాంటి సాక్షాలు లేవని ఫోరెన్సిక్ ల్యాబ్ నిపుణులు క్లీన్ చిట్ ఇచ్చారని వెలుగు చూసింది.

పార్టీలోని ప్రముఖులు వీళ్లే
2019లో ముంబాయిలోని కరణ్ జోహార్ ఇంటిలో జరిగిన పార్టీకి బాలీవుడ్ ఫేమస్ సెలబ్రిటీలు దీపికా పదుకొనే, మలైకా అరోరా, అర్జున్ కపూర్, షాహిద్ కపూర్, వరుణ్ ధావన్, విక్కీ కౌషల్ తదితరులు హాజరైనారని మాజీ ఎమ్మెల్యే మంజిందర్ సింగ్ సిర్సా ఆరోపిస్తూ ఆ వీడియోను ఎన్ సీబీ అధికారులకు ఇచ్చారు. వీరందరు కెమెరాల కంటికి కనిపించకుండా ఒకరి చేతికి ఒకరు డ్రగ్స్ అందించుకున్నారని, అయితే ఆ స్టార్ నటీ నటులు అందరూ వీడియోలో ఉన్నారని మంజిందర్ సింగ్ సిర్సా ఆరోపించారు.

క్లీన్ చిట్..... కాని దీపికా పదుకొనే ?
కరణ్ జోహార్ ఇంటి పార్టీ వ్యవహారంలో ఫోరెన్సిక్ నిపుణుల క్లీన్ చిట్ తో ఆ రోజు కరణ్ జోహార్ ఇంట్లో జరిగిన పార్టీకి హాజరైన సెలబ్రిటీలు దీపికా పదుకొనే, మలైకా అరోరా, అర్జున్ కపూర్, షాహిద్ కపూర్, వరుణ్ ధావన్, విక్కీ కౌషల్ తదితరులు ఊపిరిపీల్చుకున్నారు. అయితే డ్రగ్స్ కేసు వ్యవహారంలో బాలీవుడ్ పద్మావతి దీపికా పదుకొనే ఇప్పటికే ఎన్ సీబీ అధికారుల విచారణకు హాజరైనారు. దీపికా పదుకొనే ఇంకా అధికారుల విచారణ ఎదుర్కొంటున్నారు. దీపికాకు ఇంకా ఈ కేసు నుంచి మోక్షం చిక్కలేదని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.