బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Drugs mafia: క్రైమ్ బ్రాంచ్ కస్టడీలో ఫేమస్ నటి, స్టార్ హీరోలతో డ్యాన్స్ లు, క్లర్క్ తో సహజీవనం ? !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: బాలీవుడ్ స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పద మృతి కేసు తరువాత కొందరు సెలబ్రిటీలు హడలిపోతున్నారు. స్యాండిల్ వుడ్ కు డ్రగ్స్ మాఫియాకు లింక్ ఉందని ఆరోపణలు రావడం, ఇదే సమయంలో బహుబాష నటి రాగిణి ద్వివేదిని బెంగళూరు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు (CCB) పోలీసులు అరెస్టు చెయ్యడం కలకలం రేపింది. మూడు రోజులు నటి రాగిణిని కస్టడీకి తీసుకున్నపోలీసులు పలుకోణాల్లో విచారణ చేస్తున్నారు. ఇదే సమయంలో నటి రాగిణి ద్వివేది క్లోజ్ ఫ్రెండ్ బికే. రవిశంకర్ ను సస్పెండ్ చేశామని కర్ణాటక రవాణా శాఖ కమిషనర్ ఎన్. శివకుమార్ ఆదేశాలు జారీ చేశారు. నటి రాగిణి ద్వివేదితో ఆర్ టీఓ కార్యాలయంలో క్లర్క్ గా పని చేస్తున్న రవిశంకర్ సహజీవనం చేస్తున్నాడని పోలీసులకు ఆధారాలు చిక్కాయని తెలిసింది. ఇంతకాలం స్టార్ హీరోలతో డ్యాన్స్ లు వేసిన నటి రాగిణి ద్వివేది ఓ క్లర్క్ తో సహజీవనం చేస్తున్నారని వెలుగు చూడటంతో ప్రజలు షాక్ కు గురైనారు.

Drugs mafia: బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ లాగా నన్నూ చంపేస్తారా ? హీరోయిన్ ఫైర్, చూడండి !Drugs mafia: బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ లాగా నన్నూ చంపేస్తారా ? హీరోయిన్ ఫైర్, చూడండి !

 నటి రాగిణికి బౌరింగ్ లో పరీక్షలు

నటి రాగిణికి బౌరింగ్ లో పరీక్షలు

శుక్రవారం ఉదయం నుంచి స్యాండిల్ వుడ్ ఫేమస్ నటి రాగిణి ద్వివేదిని బెంగళూరు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు విచారణ చేశారు. బెంగళూరు నగరంలోని యలహంక సమీపంలోని జ్యుడీషియల్ లేఔట్ లోని అనన్యా అపార్ట్ మెంట్స్ లో నివాసం ఉంటున్న నటి రాగిణి ద్వివేది ఇంటిలో పోలీసులు నాలుగు మొబైల్స్ సీజ్ చేసి అనేక వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. నటి రాగిణిని అరెస్టు చేసిన పోలీసులు బెంగళూరులోని శివాజీనగర్ లోని బౌరింగ్ ఆసుపత్రిలో ఆమెకు వైద్యపరీక్షలు చేయించారు.

 క్రైమ్ బ్రాంచ్ కస్టడీకి రాగిణి

క్రైమ్ బ్రాంచ్ కస్టడీకి రాగిణి

బహుబాష నటి రాగిణిని అరెస్టు చేసిన పోలీసులు ఆమెను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. న్యాయమూర్తి అనుమతితో నటి రాగిణిని మూడు రోజుల పాటు విచారణ చెయ్యడానికి బెంగళూరు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. సోమవారం వరకు నటి రాగిణిని విచారణ చెయ్యడానికి కోర్టు అనుమతి ఇవ్వడంతో ఆమెతో లింక్ ఉన్న కొందరి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.

 సిద్దాపురలో భారీ బందోబస్తు

సిద్దాపురలో భారీ బందోబస్తు

నటి రాగిణిని అరెస్టు చేసిన బెంగళూరు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆమెను బెంగళూరులోని జయనగర సమీపంలోని సిద్దాపురలోని కర్ణాటక స్టేట్ హోమ్ కు తరలించారు. స్టేట్ హోమ్ లో నటి రాగిణి ఉండటంతో ఆ పరిసర ప్రాంతాల్లో సిద్దాపుర పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సిద్దాపురలోని ప్రముఖ నిమ్హాన్స్ ఆసుపత్రి ఉండటంతో రద్ది ఎక్కువగా ఉండటంతో పోలీసులు అనేక జాగ్రత్తలు తీసుకున్నారు.

 ప్రభుత్వ ఉద్యోగం ఊడిపోయింది

ప్రభుత్వ ఉద్యోగం ఊడిపోయింది

బెంగళూరు డ్రగ్స్ మాఫియా కేసు విచారణ చేస్తున్న పోలీసులు స్యాండిల్ వుడ్ స్టార్స్ పై నిఘా వేశారు. ఇదే సమయంలో బెంగళూరు సిటీలోని జయనగర ఆర్ టీఓ కార్యాలయంలో ఉద్యోగం చేస్తున్న బికే. రవిశంకర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్యాండిల్ వుడ్ స్టార్ తో లింక్ ఉన్న రవిశంకర్ ను విచారణ చేసిన బెంగళూరు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు చివరికి అతన్ని అరెస్టు చేశారు. డ్రగ్స్ మాఫియాతో లింక్ పెట్టుకున్న రవిశంకర్ ను సస్పెండ్ చేశామని కర్ణాటక రవాణా శాఖ కమీషనర్ శివకుమార్ స్పష్టం చేశారు.

 నటి రాగిణితో సహజీవనం !

నటి రాగిణితో సహజీవనం !

బెంగళూరులోని జయనగర ఆర్ టీఓ కార్యాలయంలో క్లర్క్ గా ఉద్యోగం చేస్తున్న రవిశంకర్ ఎప్పుడూ పార్టీలు, పబ్ లు అంటూ ఎంజాయ్ చేస్తూ తిరుగుతున్నాడని తెలిసింది. అంతే కాకుండా నటి రాగిణి ద్వివేదితో ప్రభుత్వ ఉద్యోగి రవిశంకర్ సహజీవనం చేస్తున్నాడని పోలీసులకు కొన్ని సాక్షాలు చిక్కాయని తెలిసింది. సెప్టెంబర్ 3వ తేదీ నుంచి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా విధులకు హాజరుకాకపోవడం, అదే సమయంలో డ్రగ్స్ మాఫియాతో లింక్ ఉందని వెలుగు చూడటంతో రవిశంకర్ ను సస్పెండ్ చేశారు. సంఘ వ్యతిరేక కార్యకలాపాలు సాగిస్తూ ప్రభుత్వ శాఖ పరువు తీశాడని రవిశంకర్ ను సస్పెండ్ చేశామని కర్ణాటక రవాణా శాఖ కమీషనర్ శివశంకర్ ఓ ప్రకటనలో తెలిపారు.

Recommended Video

Sushant Singh Rajput కేసు విచారణ పై లేడి అమితాబ్ Vijaya Shanthi పోస్ట్ || Oneindia Telugu
 బెయిల్ కోసం రాగిణి ప్రయత్నాలు

బెయిల్ కోసం రాగిణి ప్రయత్నాలు

నటి రాగిణి ద్వివేది ముందస్తు బెయిల్ తీసుకోవడానికి ప్రయత్నించారు. రాగిణి బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్న సమయంలోనే బెంగళూరు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆమెను శుక్రవారం సాయంత్రం అరెస్టు చేశారు. రాగిణి ద్వివేది ముందస్తు బెయిల్ పిటిషన్ సోమవారానికి వాయిదా పడింది. సోమవారం కోర్టులో రాగిణికి బెయిల్ ఇప్పించడానికి ఆమె న్యాయవాదులు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే డ్రగ్స్ మాఫియాకు రాగిణికి సంబంధాలు ఉన్నాయని పక్కా సాక్షాలు చిక్కితే ఆమెకు బెయిల్ రాకుండా చెయ్యాలని పోలీసులు ప్రయత్నిస్తున్నారని తెలిసింది.

English summary
Drugs mafia: Three days of Bengaluru CCB police custody for Kannada actress Ragini Dwivedi. CCB arrested actress allegedly for her involvement in drug running. Karnataka Transport department suspended Ravi Shankar regional transport officer of Jayanagar office.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X