వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డ్రగ్స్ కేసు .. తన ముఖం దగ్గర బూటుకాలు పెట్టి హింస.. ఎన్సీబీ అధికారులపై క్షితిజ్ ప్రసాద్ ఆరోపణలు

|
Google Oneindia TeluguNews

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణంతో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఫిల్మ్ ఎగ్జిక్యూటివ్ క్షితిజ్ ప్రసాద్ ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. డ్రగ్స్ వ్యవహారంలో కరణ్ జోహార్, సంస్థలో ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేసిన క్షితిజ్ ప్రసాద్ ను అరెస్టు చేసిన నార్కోటిక్స్ అధికారులు విచారణ సమయంలో ఆయన పట్ల దారుణంగా వ్యవహరించారని క్షితిజ్ ప్రసాద్ కోర్టు దృష్టికి తీసుకువెళ్ళారు. ఈ క్రమంలో ఆయన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో పై సంచలన ఆరోపణలు చేశారు .

ముంబై కోర్టులో ఎన్సీబీ అధికారులపై క్షితిజ్ ప్రసాద్ ఆరోపణలు

ముంబై కోర్టులో ఎన్సీబీ అధికారులపై క్షితిజ్ ప్రసాద్ ఆరోపణలు


ముంబై కోర్టులో ఆయన న్యాయవాది సతీష్ మనిషిండే క్షితిజ్ ప్రసాద్ పై ఎన్సీబీ అధికారుల హింసను ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్లారు.
కోర్టు ముందు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించిన క్షితిజ ప్రసాద్ ఎన్సీపీ అధికారులు తనను బ్లాక్ మెయిల్ చేశారని బెదిరింపులకు గురి చేశారని, హింసించారని, దారుణంగా వ్యవహరించారని ఆరోపించారు. తాను
కరణ్ జోహార్, సోమెల్ మిశ్రా, రాఖీ, అపూర్వా, నీరజ్ , రాహిల్ లను ఈ కేసులో ఇరికించినట్లయితే వారు తనను విడిచిపెడతామని ఎన్సిబి అధికారులు చెప్పారు అని క్షితిజ ప్రసాద్ కోర్టు దృష్టికి తీసుకెళ్ళారు .

కరణ్ జోహార్ తో పాటు వారంతా ఉన్నట్టు ఒప్పుకోమని వేధించారని కోర్టుకు చెప్పిన క్షితిజ్

కరణ్ జోహార్ తో పాటు వారంతా ఉన్నట్టు ఒప్పుకోమని వేధించారని కోర్టుకు చెప్పిన క్షితిజ్

కరణ్ జోహర్ తో పాటు వారంతా డ్రగ్స్ వినియోగిస్తారని చెప్పాలని ఒత్తిడి చేశారని పేర్కొన్నారు. అయితే వీరెవరూ తనకు వ్యక్తిగతంగా పరిచయాలు లేని కారణంగా సంబంధం లేని వ్యక్తులను ఇరికించి ఆ పని తాను చేయలేనని చెప్పానని పేర్కొన్నారు. దర్యాప్తు అధికారులు మాదకద్రవ్యాలను సేవించారని ఒప్పుకోమని బలవంతంగా ఒప్పించే ప్రయత్నం చేశారన్నారు క్షితిజ్ ప్రసాద్ .

దర్యాప్తు అధికారులలో ఒకరు అయిన సమీర్ వాంఖడే తనను తీవ్రంగా ఇబ్బంది పెట్టారని పేర్కొన్నారు .

ఎన్సీబీ అధికారి తన ముఖం దగ్గర బూటు కాలు పెట్టి అవమానం

ఎన్సీబీ అధికారి తన ముఖం దగ్గర బూటు కాలు పెట్టి అవమానం

ఎన్సీబీ అధికారులు డ్రగ్స్ సేవించినట్టు ఒప్పుకోమని ఒత్తిడి చేసినా ఒప్పుకోని కారణంగా తనను ఎన్సీబీ అధికారి సమీర్ వాంఖడే కుర్చీ పక్కన నేలపై కూర్చోబెట్టారని , సమీర్ వాంఖడే అప్పుడు తన బూటు కాలిని ముఖం దగ్గర ఉంచి అవమానకరంగా ప్రవర్తించారని, చుట్టూ ఉన్న ఇతర అధికారులు తన దుస్థితిని చూసి నవ్వారని క్షితిజ్ ప్రసాద్ కోర్టులో పేర్కొన్నారు.

ఈ సంఘటన క్షితిజ్‌ను తీవ్రంగా గాయపరిచిందని , సమీర్ వాంఖడే తనను తన కుటుంబ సభ్యులతో మాట్లాడాలంటే, వారు తయారుచేసిన స్టేట్మెంట్ మీద సంతకం పెట్టాలని ఒత్తిడి చేశారని క్షితిజ్ తరపు న్యాయవాది తెలిపారు.

ఎన్సీబీ అధికారులపై ఆరోపణలు చేస్తున్న డ్రగ్స్ కేసులో ఉన్న సెలబ్రిటీలు

ఎన్సీబీ అధికారులపై ఆరోపణలు చేస్తున్న డ్రగ్స్ కేసులో ఉన్న సెలబ్రిటీలు

దాదాపు 50 గంటల విచారణ, అవమానం మరియు హింసతో కూడిన చర్యలతో క్షితిజ్ ప్రసాద్ తీవ్రంగా ఇబ్బంది పడ్డాడని కోర్టు దృష్టికి తీసుకు వెళ్లారు.


ఎన్సీబీ అధికారుల చిత్రహింసలతోనే క్షితిజ్ ప్రసాద్ సంతకం పెట్టారని న్యాయవాది సతీష్ మనీషిండే పేర్కొన్నారు .ఈ కేసులో ఎన్సీబీ అధికారుల తీరుపై సెలబ్రిటీలు ఇప్పటికే ఆరోపణలు చేస్తుంటే తాజాగా క్షితిజ్ చేసిన సంచలన ఆరోపణలు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి .

English summary
Film executive Kshitij Prasad, who was arrested last week by the Narcotics Control Bureau in a widening drugs probe linked to Sushant Singh Rajput death, was "harassed and blackmailed" by the officers of the anti-drugs probe agency, his lawyer Satish Maneshinde told a Mumbai court . Mr Prasad was "forced to falsely implicate" filmmaker Karan Johar and his other top executives, the lawyer underlined.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X