వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Drugs racket: కంగనాకు షాక్, డ్రగ్స్ లింక్ పై విచారణ, సోనియా గాంధీని సీన్ లోకి లాగిన క్వీన్ !

|
Google Oneindia TeluguNews

ముంబాయి/ న్యూఢిల్లీ: ఈ మహారాష్ట్ర ప్రభుత్వానికి ఏమైయ్యింది ?, ఓ పక్క కరోనా... మరో పక్క కంగనా రనౌత్, మా గురించి పట్టించుకోరా ? అంటూ సామాన్య ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం VS కంగనా రనౌత్ వివాదం రోజురోజుకు ముదిరిపోతుడటంతో ఆ రాష్ట్ర ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఏకంగా సీఎం ఉద్దవ్ ఠాక్రేని టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తున్న కంగనా రనౌత్ డ్రగ్స్ ఏమైనా వాడేవారా ? అంటూ ముంబాయి పోలీసుల విచారణ మొదలైయ్యింది. ఇప్పుడు బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తెలివిగా కాంగ్రెస్ పార్టీ చీఫ్ సోనియా గాంధీని టార్గెట్ చేసుకుని ఆమెను సీన్ లోకి లాగేశారు. మేడమ్... మీరే ఒక మహిళ కదా ! నేను సాటి మహిళనే. మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వంలో మీ పార్టీ కూడా ఉంది కదా, నా గురించి ఆలోచించే టైమ్ మీకు లేదా అంటూ కంగనా భారీ డైలాగులు వేసింది.

Kangana: సీఎంతో చెస్ ఆడుతావా ? కంగనా నువ్వెంత ? హైకోర్టు లాయర్ దెబ్బతో ఎఫ్ఐఆర్, ఫేస్ బుక్ !Kangana: సీఎంతో చెస్ ఆడుతావా ? కంగనా నువ్వెంత ? హైకోర్టు లాయర్ దెబ్బతో ఎఫ్ఐఆర్, ఫేస్ బుక్ !

కంగనా మేడమ్ డ్రగ్స్ వాడుతున్నారా ?

కంగనా మేడమ్ డ్రగ్స్ వాడుతున్నారా ?

మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రేతో పాటు శివసేన నాయకులను టార్గెట్ చేసుకున్న విమర్శలు చేస్తున్న బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ కు మరో చిక్కు వచ్చిపడింది. ఏకంగా సీఎం ఉద్దవ్ ఠాక్రేని టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తున్న కంగనా రనౌత్ డ్రగ్స్ ఏమైనా వాడేవారా ? అని విచారణ మొదలైయ్యింది. ఇప్పటికే మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కుదిపేస్తున్న డ్రగ్స్ కేసుపై ముంబాయి పోలీసులు లోతుగానే దర్యాప్తు చెయ్యాలని డిసైడ్ అయ్యారు.

టార్గెట్ క్వీన్ మణికర్ణిక !

టార్గెట్ క్వీన్ మణికర్ణిక !

క్వీన్ ‘మణికర్ణిక'సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ కు ఇప్పుడు నిజంగానే సినిమా కష్టాలు మొదలైనాయి. మహారాష్ట్ర ప్రభుత్వం, శివసేన నాయకులను టార్గెట్ చేసుకుని బహిరంగంగా మాట్లాడుతున్న కంగనా రనౌత్ మీద ఆ పార్టీ నేతల మండిపడుతున్నారు. ఇప్పుడు కంగనా రనౌత్ మీద డ్రగ్స్ కేసు భాణం విసరడానికి మహారాష్ట్ర ప్రభుత్వం సిద్దం అయ్యింది.

 ముంబాయి క్రైమ్ బ్రాంచ్ ఎంట్రీ

ముంబాయి క్రైమ్ బ్రాంచ్ ఎంట్రీ

2016లో కంగనా రనౌత్ ఇచ్చిన ఓ ఇంటర్వూ ఆధారంగా ముంబాయి పోలీసులు రంగంలోకి దిగారు. కంగనా రనౌత్ కు, డ్రగ్స్ కు లింక్ పెడుతూ విచారణకు ఆదేశించిన మహారాష్ట్ర ప్రభుత్వం ఆమెకు మరన్ని కష్టాలు తెచ్చిపెట్టడానికి సిద్దం అవుతోందని, ఆమె మీద శివసేన నాయకులు కక్షకట్టారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

జస్ట్ విచారణ అంతే.... హోమ్ మంత్రి

జస్ట్ విచారణ అంతే.... హోమ్ మంత్రి

కంగనా రనౌత్ ఏమైనా డ్రగ్స్ ఉపయోగించారా ? అనే విషయంలో మాత్రమే ముంబాయి పోలీసులు విచారణ చేస్తున్నారని మహారాష్ట్ర హోమ్ శాఖా మంత్రి అనిల్ దేశ్ ముఖ్ అంటున్నారు. మొత్తం మీద ముంబాయి పోలీసులు కంగనా రనౌత్ మీద ఎలాంటి విచారణ చేస్తారో ? అనే విషయం వేచి చూడాలి. ఇప్పటికే మహారాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుని విమర్శించిన కంగనా రనౌత్ కు చెందిన ముంబాయిలోని భవనం నేలమట్టం అయ్యింది.

సోనియా గాంధీని టార్గెట్ చేసిన కంగనా

సోనియా గాంధీని టార్గెట్ చేసిన కంగనా

మహారాష్ట్ర ప్రభుత్వం, బాలీవుడ్ లోకి కొందరు ప్రముఖల మీద తీవ్ర విమర్శలు చేస్తున్న కంగనా రనౌత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చీఫ్ సోనియా గాంధీని టార్గెట్ చేసుకున్నారు. మేడమ్... మీరు ఒక మహిళ, నేను ఒక మహిళ, మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వంలో మీ కాంగ్రెస్ పార్టీ కూడా ఉంది, నన్ను అక్కడి ప్రభుత్వం ఇన్ని చిత్రహింసలు పెడుతుంటే మీరు ఎందుకు మౌనంగా ఉన్నారు ? అని కంగనా రనౌత్ సోనియా గాంధీని ప్రశ్నించారు.

Recommended Video

TV Actress Sravani కేసులో ట్విస్ట్, DevaRaj Reddy వెర్షన్ ఇదీ ! || Oneindia Telugu
మేడమ్... మీకు టైమ్ ఉందా ?

మేడమ్... మీకు టైమ్ ఉందా ?

మీరు ఏమైనా నా విషయంలో జోక్యం చేసుకుని న్యాయం చేస్తారా ? అంటూ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ సోనియా గాంధీకి సెంటిమెంట్ తో సెటైర్లు వేసింది. మొత్తం మీద బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ ‘క్వీన్' కంగనా రనౌత్ వివాదం రోజుకో మలుపు తిరగడంతో మహారాష్ట్ర ప్రజలతో పాటు దేశ ప్రజలు ఆ విషయాలను ఆసక్తిగా గమనిస్తున్నారు.

English summary
Drugs mafia: Actor Kangana Ranaut will face a drugs probe ordered by the Maharashtra government in the latest twist in her ongoing feud with the ruling Shiv Sena.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X