బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Drug Mafia: సినీతారలే కాదు, లీడర్స్ కు లింక్, బాంబు పేల్చిన మాజీ సీఎం, సిట్టింగ్ సీంతో చర్చలు !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/ ముంబాయి: దేశంలోని కొందరు సినీ స్టార్స్ కే కాదు 'డ్రగ్స్ మాఫియాతో కొందరు రాజకీయ నాయకులకు సంబంధాలు ఉన్నాయి' అంటూ కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. సిట్టింగ్ సీఎంతో భేటీ తరువాత మాజీ సీఎం ఇలాంటి వ్యాఖ్యలు చెయ్యడం రాజకీయంగా కలకలం రేపింది. సినీతారలతో పాటు రాజకీయ నాయకులు ఎవరెవరికి డ్రగ్స్ మాఫియాతో లింక్ ఉంది ? అనే విషయంపై నిష్పక్షపాతంగా విచారణ జరగాలని మాజీ సీఎం హెచ్.డి. కుమారస్వామి అన్నారు. మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే జమీర్ అహమ్మద్ కు డ్రగ్ కేసులో అరెస్టు అయిన నటి సంజనాతో లింక్ ఉందని ఆరోపణలు వస్తున్న సమయంలో మాజీ సీఎం కుమారస్వామి వ్యాఖ్యలు కలకలం రేపాయి.

Illegal affair: ఆంటీ టీచర్, బెడ్ రూమ్ లో రొమాన్స్ పాఠాలు, తట్టుకోలేని భర్త ఎడిటింగ్ చేశాడు!Illegal affair: ఆంటీ టీచర్, బెడ్ రూమ్ లో రొమాన్స్ పాఠాలు, తట్టుకోలేని భర్త ఎడిటింగ్ చేశాడు!

 మాజీ దోస్త్ జమీర్ అహమ్మద్ ఖాన్

మాజీ దోస్త్ జమీర్ అహమ్మద్ ఖాన్

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామికి గతంలో అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు తెచ్చుకున్న మాజీ మంత్రి, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న జమీర్ అహమ్మద్ ఖాన్ పేరు డ్రగ్స్ మాఫియా దందాలో వినపడుతోంది. అయితే బెంగళూరు నగరంలోని చామరాజపేట నియోజక వర్గం ఎమ్మెల్యే అయిన జమీర్ అహమ్మద్ ఖాన్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. మాజీ సీఎం హెచ్.డి. కుమారస్వామికి రాజకీయంగా ఆయన దూరంగానే ఉన్నారు.

 మాజీ సీఎంతో జమీర్ భేటీ..... అందుకోసమే వెళ్లారా ?

మాజీ సీఎంతో జమీర్ భేటీ..... అందుకోసమే వెళ్లారా ?

డ్రగ్స్ మాఫియా కేసులో జమీర్ అహమ్మద్ ఖాన్ ప్రముఖంగా వినపడంతో ఆయన సన్నిహితులు హడలిపోయారు. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జమీర్ అహమ్మద్ ఖాన్ మాజీ సీఎం సిద్దరామయ్య ఇంటికి పరుగు తీసి ఆయనతో భేటీ అయ్యారు. డ్రగ్స్ కేసులో తన మీద వస్తున్న ఆరోపణల్లో నిజం లేదని జమీర్ అహమ్మద్ ఖాన్ మాజీ సీఎం సిద్దరామయ్య దగ్గర ఆయన గోడు వెళ్లబోసుకున్నారని తెలిసింది. తనను కేసు నుంచి తప్పించాలని జమీర్ అహమ్మద్ ఖాన్ సిద్దరామయ్యను వేడుకున్నారని తెలిసింది.

సిట్టింగ్ సీఎం... మాజీ సీఎం చర్చలు

సిట్టింగ్ సీఎం... మాజీ సీఎం చర్చలు

కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్పతో ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి భేటీ అయ్యారు. మాజీ స్నేహితుడు జమీర్ అహమ్మద్ ఖాన్ గురించి మాట్లాడటానికే మాజీ సీఎం హెచ్.డి. కుమారస్వామి కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్పను కలుస్తున్నారని జోరుగా ప్రచారం జరిగింది. అయితే సీఎం బీఎస్. యడియూరప్పతో భేటీ అయిన తరువాత మాజీ సీఎం హెచ్.డి. కుమారస్వామి మీడియాతో మాట్లాడుతూ పెద్ద బాంబు పేల్చారు.

 డ్రగ్స్ మాఫియాతో పొలిటికల్ లీడర్స్ కు లింక్

డ్రగ్స్ మాఫియాతో పొలిటికల్ లీడర్స్ కు లింక్

సీఎం బీఎస్. యడియూరప్పను కలిసిన తరువాత మాజీ సీఎం హెచ్.డి. కుమారస్వామి మీడియాతో మాట్లాడారు. సినీతారలతో పాటు కొందరు రాజకీయ నాయకులకు డ్రగ్స్ మాఫియాతో సంబంధాలు ఉన్నాయని మాజీ సీఎం హెచ్.డి. కుమారస్వామి బాంబు పేల్చారు. డ్రగ్స్ మాఫియా కేసులో కర్ణాటక ప్రభుత్వం, అధికారులు శక్తివంచనలేకుండా పని చేస్తున్నారని, ఈ కేసు ఇంకా లోతుగా దర్యాప్తు చెయ్యాలని మాజీ సీఎం హెచ్.డి. కుమారస్వామి అన్నారు.

 నాకేం పనిపాట లేదనుకున్నారా ?

నాకేం పనిపాట లేదనుకున్నారా ?

కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జమీర్ అహమ్మద్ ఖాన్ గురించి సీఎం బీఎస్. యడియూరప్పతో చర్చించడానికి తాను వెళ్లానని లేనిపోని ప్రచారం జరిగిందని, నాకేం పనిపాట లేదా ? ఎవరి కోసమో నేనేందుకు వెళ్లాలి ? అని మాజీ సీఎం హెచ్.డి. కుమారస్వామి ప్రశ్నించారు. మొత్తం మీద మాజీ స్నేహితుడు జమీర్ అహమ్మద్ ఖాన్ గురించి తాను ఏవిషయాలను కర్ణాటక సీఎం బీఎస్. యడియూరప్పతో చర్చించలేదని మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి క్లారిటీ ఇచ్చారు.

English summary
Drugs racket: Karnataka former chief minister H.D. Kumaraswamy has given an explosive statement on drug mafia. Kumaraswamy says that there is not only cine actors in the drug mafia, adding that politicians are also involved in the drug mafia.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X