India
  • search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డ్రగ్స్ కేంద్రంగా గుజరాత్: మళ్ళీ భారీగా డ్రగ్స్; రూ.600 కోట్ల విలువైన హెరాయిన్‌ స్వాధీనం, ప్రతిపక్షాల రచ్చ!!

|
Google Oneindia TeluguNews

భారతదేశం మాదకద్రవ్యాలకు అడ్డాగా మారుతోందా? నిత్యం అనేకచోట్ల పట్టుబడుతున్న డ్రగ్స్ అందుకు ఊతమిస్తాయా? ఒకపక్క కేంద్ర హోంమంత్రి అమిత్ షా దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధి మండలి సమావేశం లోనూ డ్రగ్స్ కట్టడి చేయడానికి ప్రాధాన్యతనివ్వాలని చెప్పడం వెనుక ఆంతర్యం అదేనా అంటే అవును అన్న సమాధానమే వస్తుంది.

భారత్ కు డ్రగ్స్ భయం .. చాప క్రింద నీరులా డ్రగ్స్ దందా

భారత్ కు డ్రగ్స్ భయం .. చాప క్రింద నీరులా డ్రగ్స్ దందా

ఇప్పుడు భారత్ కు డ్రగ్స్ భయం పట్టుకుంది. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశ వ్యాప్తంగా నిత్యం అనేక చోట్ల డ్రగ్స్ పట్టుబడుతుండడం సంచలనంగా మారుతుంది. ఇక బాలీవుడ్, టాలీవుడ్ లోనూ డ్రగ్స్ కేసులు దేశం మాదకద్రవ్యాలకు ఏవిధంగా బానిస అవుతుందో అందరికీ అర్థమయ్యేలా చెబుతున్నాయి. ముంబై, హైదరాబాద్ వంటి నగరాలలో డ్రగ్స్ తయారీ పరిశ్రమలు ఏర్పాటు చేసి డ్రగ్స్ మాఫియా రెచ్చిపోతుంది అంటే పరిస్థితి ఏ విధంగా ఉందో ఇట్టే అర్థమవుతుంది.

గతంలో ముంద్రా పోర్టులో భారీగా పట్టుబడిన హెరాయిన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీగా పట్టుబడిన డ్రగ్స్ వెరసి దేశం మొత్తం చాప కింద నీరులా డ్రగ్స్ దందా సాగుతోందన్న విషయం స్పష్టంగా బయటపడింది. ఇదిలా ఉంటే గుజరాత్ రాష్ట్రం డ్రగ్స్ దందాకు స్వర్గ ధామంగా మారిందన్న భావన తాజాగా పట్టుబడుతున్న కేసులతో అర్ధం అవుతుంది. గుజరాత్ లో డ్రగ్స్ గుజరాత్ సర్కార్ కి పెద్ద తలనొప్పిగా మారాయి. ప్రతిపక్ష పార్టీలకు అధికార పక్షాన్ని టార్గెట్ చెయ్యటానికి ఆయుధంగా మారాయి.

గుజరాత్ లో 600 కోట్ల విలువైన 120 కిలోల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్న ఏటీఎస్

గుజరాత్ లో 600 కోట్ల విలువైన 120 కిలోల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్న ఏటీఎస్

ఇక తాజాగా గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ATS) గుజరాత్ రాష్ట్రంలోని మోర్బి జిల్లాలో భారీగా డ్రగ్స్ ను పట్టుకున్న ఘటన మరోమారు దేశంలో డ్రగ్స్ దందా కలకలం రేపింది. గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ముగ్గురు వ్యక్తుల నుండి 120 కిలోల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు సోమవారం తెలిపారు.

ఆదివారం అర్థరాత్రి జరిపిన ఆపరేషన్‌లో పట్టుబడిన డ్రగ్స్‌ ఖచ్చిత విలువను, ఏ రకమైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారనేది వెల్లడించలేదు. అయితే వాటి విలువ భారీగా ఉంటుందని చెప్తున్నారు. మళ్ళీ పట్టుబడింది హెరాయిన్ అని, స్వాధీనం చేసుకున్నడ్రగ్స్ మార్కెట్ విలువ దాదాపు 600 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేస్తున్నారు .

మోర్బీ తీర ప్రాంతంలో పట్టుబడిన డ్రగ్స్ .. అంతకు ముందు ద్వారక తీరంలో .. తీర ప్రాంతాల్లో డ్రగ్స్ దందా

మోర్బీ తీర ప్రాంతంలో పట్టుబడిన డ్రగ్స్ .. అంతకు ముందు ద్వారక తీరంలో .. తీర ప్రాంతాల్లో డ్రగ్స్ దందా

మోర్బీ తీర ప్రాంతంలో గుజరాత్ ఏటీఎస్ ఈ ఆపరేషన్‌ను అర్ధరాత్రి నిర్వహించింది. ఇంతకుముందు ద్వారక తీర ప్రాంతంలో అధికారులు పెద్ద ఎత్తున డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ద్వారకలో 363 కోట్ల రూపాయల విలువైన 64 కిలోల డ్రగ్స్ ను నవంబర్ 11న స్వాధీనం చేసుకున్నారు . ఈ సరుకు పాకిస్థాన్ నుంచి సముద్ర మార్గంలో వచ్చినట్లు తెలుస్తోంది.

తర్వాత ఇప్పుడు మరో ఘటన వెలుగులోకి వచ్చింది. దేశంలోకి అక్రమ మాదకద్రవ్యాలను రవాణా చేయడానికి తీర ప్రాంతాలు ఎక్కువగా ఉపయోగించబడుతున్నాయని ఇది సూచిస్తుంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, గల్ఫ్ ఆఫ్ కచ్‌లోని నవ్‌లాఖి ఓడరేవుకు సమీపంలో ఉన్న జింజుడా గ్రామంలో 120 కిలోల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఈ కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

నలుగురిని అరెస్ట్ చేసిన ఏటీఎస్, స్థానిక పోలీసులు ... దర్యాప్తు

నలుగురిని అరెస్ట్ చేసిన ఏటీఎస్, స్థానిక పోలీసులు ... దర్యాప్తు

స్థానిక పోలీసులతో పాటు యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ నిర్వహించిన ఆపరేషన్‌లో నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. భారీగా డ్రగ్స్ పట్టుబడడంతో ఈ నలుగురు ఎక్కడ నుండి డ్రగ్స్ తీసుకువస్తున్నారు. ఈ డ్రగ్స్ ఎక్కడికి సరఫరా చేస్తున్నారు. దీని వెనుక ఉన్నది ఎవరు అన్న కోణంలో యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ దర్యాప్తు చేస్తోంది. గతంలోనూ గుజరాత్లో ముంద్రా పోర్టులో మూడు వేల కిలోల, 21 వేల కోట్ల రూపాయల విలువ చేసే డ్రగ్స్ ను డీఆర్ఐ అధికారులు సీజ్ చేసిన విషయం తెలిసిందే.

డ్రగ్స్ పట్టుకున్న పోలీసులను అభినందించిన గుజరాత్ మంత్రి హర్ష్ సంఘవి

డ్రగ్స్ పట్టుకున్న పోలీసులను అభినందించిన గుజరాత్ మంత్రి హర్ష్ సంఘవి

తాజాగా డ్రగ్స్ ను పట్టుకున్న నేపథ్యంలో డ్రగ్స్ మహమ్మారిని అరికట్టేందుకు గుజరాత్ పోలీసులు చేస్తున్న కృషిని రాష్ట్ర హోం శాఖ సహాయ మంత్రి హర్ష్ సంఘవి అభినందించారు. గుజరాత్ పోలీసులు సాధించిన మరో విజయం అని ఆయన పేర్కొన్నారు డ్రగ్స్ నిర్మూలనలో గుజరాత్ పోలీసులు ముందున్నారు. గుజరాత్ ఏటీఎస్ దాదాపు 120 కిలోల డ్రగ్స్‌ను పట్టుకుంది అని ఆయన ట్వీట్ చేశారు. ఈ విషయంపై మరిన్ని వివరాలను రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ త్వరలోనే పంచుకుంటారని మంత్రి హర్ష్ సంఘవి తెలిపారు.

గుజరాత్ లో భారీ డ్రగ్స్ పట్టుబడటంతో ప్రభుత్వంపై విమర్శల వర్షం

గుజరాత్ లో భారీ డ్రగ్స్ పట్టుబడటంతో ప్రభుత్వంపై విమర్శల వర్షం

అయితే గత 5 నెలల్లో, గుజరాత్‌లో ₹24,800 కోట్ల విలువైన అక్రమ డ్రగ్స్ జప్తు చేయబడ్డాయి. ఇక పట్టుబడని డ్రగ్స్ ఏ స్థాయిలో ఉంటాయో ఊహించుకోవచ్చు అంటూ గుజరాత్ సర్కార్ పై, కేంద్రంలోని బీజేపీ సర్కార్ పై ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. గుజరాత్ డ్రగ్స్ క్యాపిటల్ గా మారిందని మండిపడుతున్నాయి.

ఈ భారీ డ్రగ్ రన్నింగ్ రాకెట్ల నుండి ఎవరు ఎక్కువ ప్రయోజనం పొందుతున్నారో ప్రభుత్వానికే తెలియాలని అసహనం వ్యక్తం చేస్తున్నారు. అదానీ పోర్ట్ తర్వాత, ముంద్రా పోర్ట్ ఇప్పుడు గుజరాత్‌లోని మోర్బీ పోర్ట్‌లో కిలోల కొద్దీ డ్రగ్స్ రికవరీ చేయబడ్డాయి. గుజరాత్ ఓడరేవుల ద్వారా డ్రగ్ పెడ్లర్లు ఇలాంటి వ్యాపారాలకు తెగబదినట్టు అనిపిస్తుందని అసహనం వ్యక్తం చేస్తున్నారు. డ్రగ్స్ వ్యాపారానికి గుజరాత్ రాష్ట్రాన్ని డ్రగ్స్ మాఫియ స్వర్గంగా భావిస్తున్నట్టున్నారని ప్రభుత్వానికి చురకలు అంటించారు.

English summary
Drugs fear to the country. Within hours of Amit Shah's call to crack down on drugs, drugs were once again seized heavily in Gujarat. ATS, local police seize Rs 600 crore worth of heroin. Criticism raised that Gujarat has become Drugs Capital of India.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X