వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తాగి డ్రైవింగ్ చేసే వ్యక్తి మానవ బాంబరే: కోర్టు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: తాగి డ్రైవింగ్ చేసే వ్యక్తి మానవ బాంబర్‌తో సమానమని, తనతోపాటు మరణించేందుకు కూడా అతడు కారకుడవుతాడని ఢిల్లీ కోర్టు పేర్కొంది. అలాంటి వారికి కఠిన శిక్షలు విధించాల్సిందేనని స్పష్టం చేసింది.

కఠిన శిక్షలతో తాగి డ్రైవ్ చేసే వారిని కొంత వరకు నియంత్రించవచ్చని అదనపు సెషన్స్ జడ్జి వీరేంద్ర భట్ అభిప్రాయపడ్డారు.

 A Drunk Driver is Like a Suicide Bomber, Says Delhi Court

తాగి డ్రైవింగ్ చేసిన నేరంపై 20రోజుల జైలు శిక్ష పడిన రాజస్థాన్‌కు చెందిన ట్రక్ డ్రైవర్ కాన రామ్.. తన శిక్షను రద్దు చేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.

రామ్ తాగి డ్రైవ్ చేయడం ఇదే మొదటిసారి కావడంతో అతని జైలు శిక్షను 20 రోజుల నుంచి ఐదు రోజులకు తగ్గించారు. ఇది ఇలా ఉండగా, తాగి డ్రైవింగ్ చేసే వారికి విధించే శిక్షలను పెంచే ప్రతిపాదనపై పరిశీలన జరుపుతున్నట్లు కేంద్రం బాంబే హైకోర్టుకు తెలియజేసింది.

English summary
A drunk driver is like a suicide bomber, who has set out to kill himself as well as other road users, a Delhi court has observed while proposing that a stringent punishment should be awarded to offenders.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X