వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నో బెయిల్: తప్పతాగి ఇద్దరు చావుకి కారణమయ్యావు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

ముంబై: మద్యం సేవించిన మత్తులో ఇద్దరు వ్యక్తులు చనిపోవడానికి కారణమైన 35 ఏళ్ల కార్పోరేట్ లాయర్ జాహ్నవి గడ్కర్‌ బెయిల్ దరఖాస్తును శుక్రవారం కోర్టు తిరస్కరించింది.

జాహ్నవి గడ్కర్‌ బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించడంతో పాటు జులై 10 వరకు జ్యూడిషియల్ కస్టడీకి అప్పగిస్తూ కుర్లా కోర్టు మెజిస్టేట్ రిచా ఖేద్కర్ తీర్పు వెల్లడించారు.

జాహ్నవి గడ్కర్‌ తరుపు న్యాయవాది అమిత్ దేశాయ్ మాట్లాడుతూ ఈ కేసుకు సంబంధించి విచారణ పూర్తి అయిందని, ఆమెను మరింత కాలం కస్టడీకి అప్పగించాల్సిన అవసరం లేదని తన వాదనలు వినిపించారు.

Drunk driving: Mumbai court rejects bail plea of lawyer Jahnvi Gadkar

మద్యం సేవించి కారు నడిపినట్లు విచారణలో జాహ్నవి అంగీకరించిందని ప్రభుత్వ తరుపున న్యాయవాది జాహ్నవి చేసిన నేరం చాలా పెద్దదని బెయిల్ ఇవ్వకూడదని వాదించారు.

మోటారు వెహికల్ చట్ట ప్రకారం జాహ్నవి గడ్కర్‌పై సెక్షన్ 185 ప్రకారం కేసు నమోదు చేశారు. జాహ్నవి గడ్కర్‌ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌లో వైస్ ప్రెసిడెంట్ (లీగల్ అడ్వజర్)గా పని చేస్తుంది.

జూన్ 10న మద్యం సేవించి టాక్సీలో వెళ్తున్న మహ్మద్ సలీం సాబూవాలా (50), మహ్మద్ హుస్సేన్ సయీద్ (57) అనే ఇద్దరు వృద్ధులు చావుకి కారణమైంది. టాక్సీని ఢీకొట్టడానికి ముందు ఆమె రెండు బైకులను కూడా ఢీకొట్టబోయి... తృటిలో తప్పించింది.

ఈ ప్రమాదంలో అడి క్యూ 3 కారు, ట్యాక్సీ ముందు భాగం నుజ్జునుజ్జు అయ్యింది. ప్రమాదం తర్వాత తాను మద్యం తాగినట్లు వైద్యుల వద్ద ఆమె అంగీకరించిందని డీసీపీ సంగ్రామ్ సింగ్ నిషాన్ దార్ తెలిపారు.

English summary
A court on Friday rejected the bail application moved by 35-year-old corporate lawyer Jahnvi Gadkar who is accused of mowing down two persons here on June 10 under the influence of alcohol.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X