• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

యజమాని కాదు రాక్షసుడు: తాగాడు, సిబ్బందిని కొట్టాడు.. (వీడియో)

|

చెన్నై : భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం. అందరికీ సమాన అవకాశాలు. హక్కులను రాజ్యాంగం కల్పించింది. కానీ ఇదే కొందరిపాలిట శాపమవుతుంది. ఓ విదేశీయునికి దేశంలో వ్యాపారం చేసుకునేందుకు ప్రభుత్వం కూడా అనుమతినిచ్చింది. కానీ అతను తన ఉద్యోగుల పాలిట యముడిలా మారాడు. ఏ చిన్న తప్పు చేసినా .. తప్పేం చేయకున్నా వేధించడమే పనిగా పెట్టుకున్నాడు. అసభ్య పదజాలంతో దూషించడం .. లేదంటే చేయిచేసుకోవడమే పనిగా మారింది. ఇలా ఇన్నాళ్లు బాధపడ్డ ఉద్యోగులు చివరికీ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది.

యజమాని కాదు రాక్షసుడు

యజమాని కాదు రాక్షసుడు

కొరియాకు చెందికు వాన్‌జీ మూన్ అనే వ్యాపారి .. ఇతనికీ చెన్నైలో ఓ అతిథి గృహం ఉంది. అందులో నాగాలాండ్‌కి చెందిన ఉద్యోగులు ఉన్నారు. కానీ వారి పట్ల వాన్ జీ రాక్షసుడిలా మారాడు. వారిని ప్రతీసారి ఏదో కారణం చెప్పి తిడుతూనే ఉంటారు. ఇటీవల తాగొచ్చి గెస్ట్ హౌజ్‌కు వచ్చాడు. సిబ్బందిని తిట్టడంతోపాటు చేయిచేసుకున్నాడు. వాన్ జీ వద్ద పనిచేసే నాగాలాండ్ యువకులు .. అతని మూర్ఖపు ప్రవర్తనను ప్రపంచానికి తెలియజేయాలని భావించారు. ఈ నెల 5న చెన్నైలోని గెస్ట్ హౌస్‌లో ఏదో ఒక అంశంపై సిబ్బందిని దూషిస్తున్న ఘటనను రికార్డు చేశారు. ఎప్పుడు చదువుతారు ? నేర్చకుంటారు అని కొరియా స్లాంగ్‌లో మాట్లాడుతూ నాగాలాండ్ యువకుడి చెంప చెళ్లుమనిపించాడు. తర్వాత ఏదో ఒకటి అడుగుతూ మళ్లీ రెండుసార్లు కొట్టాడు. అక్కడున్న యువకులు భయపడుతూనే చెప్పిన పనిని చేస్తున్నారు. మరో యువకుడు అయితే వాన్ జీ .. కాలుకు ఏదో తగలిందని దానిని కూడా తీసే ప్రయత్నం చేశాడు.

రెచ్చిపోయిన వాన్ జీ మూన్

రెచ్చిపోయిన వాన్ జీ మూన్

యువకులు అంతా భయపడుతుంటే వాన్ జీ మూన్ మరింత రెచ్చిపోయాడు. చదవలేరా ? అర్థం చేసుకోలేరా ? వినలేరా అంటూ చెంపపై కొట్టాడు. ఈ వీడియో జిలియాన్‌గ్రాంగ్ స్టూడెంట్ యూనివన్ వద్దకు రావడంతో .. వివిధ గ్రూపుల్లో షేర్ చేశాడు. వాన్ జీ చర్యను విద్యార్థి సంఘం నేత పౌజట్‌లంగ్ తప్పుపట్టారు. పనిచేసే యువకులను కొట్టడం ఏంటని ప్రశ్నించారు. ఆ వీడియోనే ఫేస్‌బుక్‌లో పోస్ట్ చయేడంతో వెయ్యి కామెంట్లు వచ్చాయి. విషయం తెలుసుకున్న చెన్నైలోని నార్త్ ఈస్ట్ ఇండియా వెల్పేర్ అసోసియేషన్ .. వాన్ జీ కబంధ హస్తాల నుంచి ఆ యువకులకు విముక్తి కలిగించారు. ఉద్యోగులపై చేయిచేసుకున్న వాన్ జీ పై ఐపీసీ 294(బీ), 323 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

సరికాదు ..

వాన్ జీ చర్యను ప్రజాసంఘాలు తప్పుపడుతున్నాయి. ఉద్యోగులపై చేయిచేసుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నాయి. ఇది సరికాదని .. ఆయనపై కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. కార్మికుల పట్ల బాధ్యతగా వ్యవహరించాలే తప్ప .. అసభ్య పదజాలంతో దూషించడం సరికాదని హితవు పలికింది. ఒకడుగు ముందుకేసి చేయిచేసుకోవడం ఏంటని మండిపడ్డాయి. నాగాలాండ్ యువతపై చేయిచేసుకున్నందుకు కఠిన చర్యలు తీసుకోవాలని తమిళనాడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
a video of a Korean national harassing his employees from Northeast India in Chennai has surfaced on Facebook, following which the local police have registered a case of abuse and harassment. The Korean national, Won ji-Moon runs a guest house in Chennai and employs youth from Northeast. In the video, Won ji-Moon is seen abusing four of his employees and slapping them. The audio is inaudible but he appears to be questioning them about something. The video of the abuse has gone viral on Facebook and various students' groups from Northeast have taken up the matter with concerned authorities. Poujatlung R Panmei, president of Zeliangrong Students Union (Chennai), shared the video on Facebook on August 8. Since then it has received more than 1,000 comments. The union is a local organisation formed to support students from the Northeast. The incident took place on August 5.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more