వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒళ్లు గగుర్పొడిచే ఘటన: మహిళను కారుతో ఢీ కొని, పైనుంచి పొనిచ్చిన ఘనుడు (వీడియో)

|
Google Oneindia TeluguNews

అవును.. ఆ డ్రైవర్‌ మత్తులోకి వెళ్లిపోయాడు. మందు తాగి డ్రైవింగ్ చేయొద్దు.. కానీ మనోడు కారును నడుపుతున్నాడు. రోడ్డుపై ఓ వృద్దురాలిని ఢీ కొన్నాడు. జనం రావడంతో మత్తు దిగినట్టుంది. కారును అలానే పోనిచ్చాడు. కారు కింద వృద్దురాలు అని కూడా చూడలేదు. కానీ స్థానికులు వెంబడించి పట్టుకోవడంతో.. అతను దొరికిపోయాడు. అయితే ఆ కారు ఓ పోలీసు అధికారిది కాగా.. అతను కారు డ్రైవర్.

ఇలా ప్రమాదం...

ఇలా ప్రమాదం...

తూర్పు ఢిల్లీ ఘజిపూర్ చిల్లా గ్రామంలో శుక్రవారం రాత్రి కారు వస్తోంది. చిన్న గల్లీలో ఎదురుగా కారు రాగా.. మహిళ ఉంది. అయితే కారు ఢీ కొనగా.. జనం వచ్చారు. అందులో ఉన్న డ్రైవర్ పక్కకు పోనిస్తా అనుకొని, మహిళపై నుంచి కారు తీసుకెళ్లాడు. కానీ స్థానికులు వెంబడించారు. కారు ఢిల్లీకి చెందిన ఎస్సైది కాగా.. కారు నడుపుతుంది భాను అనే డ్రైవర్ అని పోలీసులు తెలిపారు.

మందు తాగి

మందు తాగి

కారు నడిపే సమయంలో భాను మద్యం సేవించాడని పోలీసులు తెలిపారు. ఘటన మొత్తం సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యింది. ఆ వీడియో చూస్తే ఒళ్లు జలదరిస్తోంది. బానెట్ తాకి పడిపోయిన మహిళ.. అలానే ఉండగా.. కారు పై నుంచి పోనిచ్చాడు. కానీ తర్వాత వారు కారును వెంబడించి పట్టుకొని.. పోలీసులకు అప్పగించారు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్సైపై సెక్షన్ 279, 337 కింద కేసులు నమోదు చేశారు.

స్థిమితంగానే..

కారు వెళ్లాక వెంటనే వృద్దురాలని ఆస్పత్రికి తరలించారు. తీవ్రగాయాలైన ఆమె కోలుకుంటున్నారు. కారు ప్రమాద దృశ్యాలు మాత్రం గగుర్పాటుకు గురిచేసింది. డ్రైవర్ మానవత్వం లేకుండా ప్రవర్తించాడా అనే అనుమానం కలుగుతోంది. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఎస్సైపై కూడా శాఖపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ వస్తోంది.

English summary
60-year-old woman was gravely injured after a policeman hit her with his car and ran over her in a narrow lane of Chilla Village, East Delhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X