విధులను పక్కన పెట్టి యూనిఫాంలోనే మందేసి చిందేసిన పోలీస్
లక్నో: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో విధి నిర్వహాణలో ఉన్న ఓ పోలీస్ అధికారి మద్యంతాగి బార్ డ్యాన్సర్లతో కలిసి చిందేశారు. ఈ ఘటన శ్రావస్థి జిల్లాలో చోటుచేసుకొంది.
శ్రావస్తా జిల్లాలో ఏదో కార్యక్రమం సందర్భంగా అమ్మాయిల డ్యాన్స్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అందులో బార్ గర్ల్స్ తో ఆ పోలీస్ డ్యాన్స్ చేస్తూ వాళ్ళ మీదకు నోట్లు విసిరాడు. ఆ దృశ్యాలు వీడియోలో రికార్డయ్యాయి.

విధి నిర్వహణలో ఉండి కూడ ఆయన తన విధులను విస్మరించాడు.,అంతేకాదు మద్యం మత్తులో డ్యాన్స్ చేస్తూ నోట్లు విసిరాడు. కనీసం ఫోలీస్ యూనిఫాంలో ఉన్న విషయాన్ని కూడ విస్మరించాడు..
ఈ కార్యక్రమానికి అతడు విధినిర్వహణ కోసం వెళ్ళాడు.విధులను పక్కనపెట్టి మందేసి చిందేశాడు. తాగేసి బార్ గర్ల్స్ తో డ్యాన్స్ చేశాడు. అయితే దృశ్యాలన్నీ వీడియోలో రికార్డయ్యాయి.ఈ వీడియోలను కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.అయితే ఈ వీడియోలు వైరల్ గా మారాయి.