వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫుట్‌పాత్‌పై బీభత్సం సృష్టించింన కారు..! తాగుబోతులపై మండిపడుతున్న బాదితులు..!!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/హైదరాబాద్ : డ్రంక్ ఆండ్ డ్రైవ్ రక్కసిని రూపు మాపేందుకు ఎన్ని కఠిన చట్టాలు వస్తున్నా వాటిని భేఖాతరు చేస్తున్నారు తాగుబోతులు. పీకల దాకా తాగి కార్లను విచ్చలవిడిగా డ్రైవ్ చేస్తూ అమాయకుల ప్రాణాలను హరించివేస్తున్నారు ఈ తాగుబోతులు. ఎలాంటి తప్పు చేయకపోయినా తాగుబోతుల నిర్లక్ష్యపు డ్రైవింగ్ తో అభం శుభం తెలియని వారి ప్రాణాలను పణంగా పెట్టాల్సి వస్తోంది. తెల్లవార్లూ స్నేహితులతో తానా తందానా అంటూ గొంతుల దాకా తాగడం, తల్లిదండ్రులు కొనిచ్చిన కారులో అచ్చోసిన ఆంబోతుల్లా తిరగడం కొంత మందికి అలవాటుగా మారింది.

ఫుట్ పాత్ లపైన చిన్న వ్యాపారులు ఏదోఒక వ్యాపారం చేసుకోవడం కూడా ఆనవాయితీగా వస్తోంది. అంతే కాకదుండా ఇళ్లు లేని అభాగ్యులకు ఫుట్ పాత్ లే నీడనిస్తాయి. వాటిపైనే భోంచేసి, వాటిపైనే నిద్రిస్తుంటారు. అది ఎంతో ప్రమాదకరం అని తెలిసినా తప్పదు కాబట్టి అలా జీవినం వెళ్లదీస్తుంటారు కొందరు. అలాంటి వారి ప్రాణాలతో కూడా ఈ తాగుబోతులు చెలగాటమాడుకున్న సందర్బాలు కోకొల్లలు ఉన్నాయి. పడుకున్న వాళ్లు పడుకున్నట్టుగానే కార్ల ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన అభాగ్యులు చాలమంది ఉన్నారు.

ఇలాంటి ఘటనే బెంగళూరులో చోటుచేసుకుంది. ఫుట్ పాత్ పై తమ పనులు తాము చూసుకుంటుండగా అకస్మాత్తుగా ఓ తాగుబోతులు నడుపుతున్న కారు వారి మీద విలయతాండవం చేసింది. ఈ సంఘటనలో ఎవ్వరి ప్రాణాలకు ప్రమాదం జరగకపోయినా ఒక్కసారిగా జరిగిన సంఘటనకు ఊపిరిపోయినంత పని అయ్యిందని తెలుస్తోంది. బెంగళూరులో ఓ కారు బీభత్సం సృష్టించింది. తప్ప తాగిన ఓ వ్యక్తి కారు నడిపి రచ్చ రచ్చ చేసాడు.

drunkards attacks on footpath public.! Car missed control

హెచ్‌ఎస్‌ఆర్ లేఅవుట్ ప్రాంతంలో ఓ కారు రోడ్డు పై ఫుట్ పాత్ పైకి దూసుకొచ్చింది. దీంతో పలువురు పాదచారులకు గాయాలయ్యాయి. పోలీసులు మద్యం సేవించి కారు నడిపిన ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

English summary
A car in Bangalore created havoc. A drunken man went to the car and made a fuss. In the Hsrlayout area, a car rushed up the road to the footpath. Many pedestrians were injured. The police took control of the man who had run the car.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X