బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నాలుక పొడిగా ఉందా.. దురద కూడా అనిపిస్తోందా.. అయితే కొత్త రకం కొవిడే..?

|
Google Oneindia TeluguNews

కరోనాకు సంబంధించి కొత్త విషయం వెలుగుచూసింది. కొత్త కరోనా గురించిన లక్షణాలను బెంగళూరు డాక్టర్లు రివీల్ చేశారు. రోగి నాలుకను పరీక్షించి కొత్త లక్షణాలను తెలియజేశారు. తన వద్దకు వచ్చిన ఓ రోగి లక్షణాలను బట్టి తెలియజేశానని డాక్టర్ జీబీ సత్తార్ తెలిపారు. ఓ వ్యక్తి వచ్చి తన నాలుక పొడిబారిపోతుందని చెప్పాడని.. అతనికి టెస్ట్ చేస్తే కరోనా పాజిటివ్ వచ్చిందని వివరించారు.

అతనికి షుగర్ పరీక్ష చేయగా నార్మల్ వచ్చిందని చెప్పారు. దీంతో ఇదీ కూడా కొత్త కోవిడి లక్షణం అని చెప్పారు. జ్వరం లేదు కానీ నీరసంగా ఉన్నాడని చెప్పారు. వెంటనే ఆర్టీ పీసీఆర్ పరీక్ష చేయించమని చెప్పానని తెలిపారు. తర్వాత ఆయన ఆస్పత్రిలో చేరి.. కోలుకున్నారని పేర్కొన్నారు. యూకే, బ్రెజిల్ మాదిరిగా ఇండియాలో కూడా కొత్త వేరియంట్ వైరస్ వచ్చిందని చెబుతున్నారు. నాలుకపై దురద, నొప్పి రావడంతో ఇబ్బంది పడతారని చెప్పారు. జ్వరం లేకున్నా బలహీనంగా ఉంటారని పేర్కొన్నారు.

Dry and Itchy Tongue? Bengaluru Doctors Suggest It Might be a New Symptom

కొత్త వేరియంట్ల గురించి అప్రమత్తంగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు. నీరసంగా ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని కోరుతున్నారు. దురద ఉన్న.. నాలుక పొడిబారినట్టు ఉన్న వైద్యులను సంప్రదించాలని కోరారు.

English summary
Doctors in Bengaluru has been observing patients with a symptom they called Covid tongue. In this case the patient exhibits no other symptoms except dryness of the mouth.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X