వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాఖీ పౌర్ణమికి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం... ఎక్కడో తెలుసా...

|
Google Oneindia TeluguNews

డిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఉచిత మానియాతో ప్రతిపక్షపార్టీలకు దిమ్మదిరిగే నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే మెట్రో రైళ్లలో మహిళలకు ఉచిత రవాణ సౌకార్యాన్ని ప్రకటిస్తు నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే రాఖీ పౌర్ణమి సంధర్భంగా మరోసారి ఢిల్లీలోని ఏసీ బస్సులతో పాటు ఇతర బస్సుల్లో కూడ మహిళలు ఉచిత ప్రయాణం కల్పించారు. ఈ నేపథ్యంలోనే రేపు పూర్తిగా డిల్లీ మహిళలు బస్సుల్లో పూర్తిగా ఉచితంగా ప్రయాణించవచ్చని ఢిల్లీ ట్రాన్స్‌పోర్టు అధికారులు ప్రకటించారు.

DTC provide free rides to lady passengers on August 15 on the occasion of Raksha Bandhan,

రానున్న కొద్ది రోజుల్లో డిల్లీలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలోనే ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఓటర్లను ఆకర్షించేందుకు పలు ఉచిత స్కీంలు తీసుకుస్తన్నారు. కాగా కొద్ది రోజుల క్రితమే మహిళల భద్రత కోసం మెట్రో రైళ్లతోపాటు, బస్సుల్లో ఉచిత ప్రయాణానికి కల్పిస్తామని ప్రకటించారు. దీంతో మహిళలు ఎలాంటీ ఇబ్బంది లేకుండా ప్రయాణించవచ్చని తెలిపారు.దీని సాధ్యసాధ్యాలను పరీశీలించాలని సీఎం ఆదేశించారు.

అయితే ఉచిత ప్రయాణంపై పలువురు విమర్శలు కూడ చేశారు. మెట్రో రైల్ రూపకర్త శ్రీధరన్ కూడ ముఖ్యమంత్రి నిర్ణయాన్ని వ్యతిరేకించారు. అయితే ఉచిత ప్రయాణంతో పాటు పలు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను ప్రకటించిన సీఎం ప్రతిపక్షాల విమర్శలను తిప్పికోట్టారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ నిర్ణయాన్ని పండగ సంధర్భంగా ఉచిత ప్రయాణం కల్పించడంతో పలువురు మహిళలు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

English summary
Delhi Transport Corporation (DTC) will provide free rides to lady passengers on August 15 on the occasion of Raksha Bandhan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X