వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేరళ సీరియల్ మర్డర్స్ : తప్పుడు కథనాలే ఈ తల్లీ కొడుకుల ప్రాణాలు తీశాయా..?

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ: ఢిల్లీ సెయింట్ స్టీఫెన్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న అలన్ స్టాన్లీ అనే వ్యక్తి రైల్వే ట్రాక్‌పై ఆత్మహత్యకు పాల్పడిన అరగంటకు ఆయన తల్లి లిస్సీ కూడా వారి నివాసంలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసకున్నట్లు కనిపించింది. ఈ ఘటనలో ఇద్దరూ మృతి చెందారు. అయితే విచారణలో వీరి మృతి వెనక అసలు కారణాలు వెలుగు చూశాయి. కేరళలో సీరియల్ హత్యలకు పాల్పడిన వ్యక్తి జాలీ థామస్‌తో వీరిద్దరినీ పోలుస్తూ వార్తలు రావడంతో ఆత్మహత్యకు పాల్పడ్డట్టు స్టాన్లీ సహోద్యోగులు చెబుతున్నారు.

 భర్త తనను విమానంలో తీసుకెళ్లలేదని సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య భర్త తనను విమానంలో తీసుకెళ్లలేదని సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య

స్టాన్లీ చాలా మంచి వ్యక్తి అన్న స్నేహితులు

స్టాన్లీ చాలా మంచి వ్యక్తి అన్న స్నేహితులు

స్టాన్లీ మంచి వ్యక్తి అని తను జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాడని తన స్నేహితుడు ఒకరు చెప్పారు. కాలేజీ రోజుల్లో తండ్రిని కోల్పోయిన స్టాన్లీ, తన తల్లి మరో వివాహం చేసుకునేలా చర్యలు తీసుకున్నాడని అయితే తన అన్నకు ఇది నచ్చక వీరిని దూరం పెట్టినట్లు స్టాన్లీ స్నేహితుడు చెప్పాడు. లిస్సీ రెండో భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు ప్రేరేపించేలా ప్రవర్తించారన్న కేసు లిస్సీ- ఉందని అయితే ముందస్తు బెయిల్‌ తీసుకుని వీరు ఉన్నారని ఇక అప్పటి నుంచి కొంచెం మానసికంగా కృంగిపోయిఉన్నట్లు స్నేహితుడు చెప్పాడు. అక్టోబర్ 15న కేరళలోని ఓ వార్తా సంస్థ స్టాన్లీ తల్లిపై తప్పుడు కథనాలు ప్రచురిస్తూ సీరియల్ కిల్లర్‌తో పోల్చడంతోనే వీరు ఆత్మహత్యకు పాల్పడినట్లు స్టాన్లీ మిత్రులు చెబుతున్నారు.

కేరళలో తల్లీ కొడుకులపై కేసు

కేరళలో తల్లీ కొడుకులపై కేసు

ఒక వ్యక్తి ఆత్మహత్యకు ప్రేరేపించేలా వ్యవహరించారన్న ఆరోపణలపై తల్లీ కొడుకుల మీద ఇడుక్కి జిల్లాలో సెప్టెంబర్ 17న కేసు నమోదైంది. లిస్సీ రెండో భర్త కుమారుడు ఈ ఫిర్యాదు చేశారు. తన తండ్రి సంపాదనలో సగం లిస్సీ అకౌంట్‌కు బదిలీ చేయాలంటూ ఆయనపై ఒత్తిడి పెట్టేవారంటూ ఫిర్యాదులో కొడుకు పేర్కొన్నట్లు డీఎస్పీ తెలిపారు. అయితే మానసికంగా కృంగిపోయిన లిస్సీ రెండో భర్త సైకియాట్రిస్టును కూడా సంప్రదించారని డీఎస్పీ వెల్లడించారు. చికిత్స జరుగుతున్న క్రమంలోనే ఒక ఫ్లాట్ ఇవ్వాలని లిస్సీ ఒత్తిడి తీసుకొచ్చిందని దీంతో ఒత్తిడిని భరించలేక లిస్సీ రెండో భర్త విల్సన్ ఆత్మహత్యకు పాల్పడ్డారని డీఎస్పీ వెల్లడించారు.

లిస్సీ రెండో భర్తపై ఒత్తిడి తీసుకొచ్చిదా..?

లిస్సీ రెండో భర్తపై ఒత్తిడి తీసుకొచ్చిదా..?

తొలుత ఇది అనుమానస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. అయితే లిస్సీపై విల్సన్ కుటుంబసభ్యులు ఆరోపణలు చేశారు. తన తండ్రి మృతికి లీస్సీనే కారణమని ఫిర్యాదులో పేర్కొన్నారు. మొత్తం రూ.70 లక్షలు తన తండ్రి ఖాతా నుంచి లిస్సీ ఖాతాకు బదిలీ అయినట్లు చెప్పారు. అంతేకాదు భర్త విల్సన్ డిపాజిట్ చేసిన రూ. 2.25 కోట్లకు ఆమె నామినీగా ఉన్నారని డీఎస్పీ వెల్లడించారు. ఇందులో భాగంగానే లిస్సీ, ఆమె కొడుకు స్టాన్లీపై ఆత్మహత్య ప్రేరేపితి కేసు సెక్షన్ 305, చోరీ కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు.

English summary
A Delhi University professor and his mother have committed suicide, allegedly after a news report compared them with cyanide killer Jolly Thomas.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X