వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత మీడియానే శ్రీదేవిని చంపింది: దుమ్మెత్తిపోసిన దుబాయ్ మీడియా

By Pratap
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రముఖ సినీ నటి శ్రీదేవి మృతిపై భారతీయ మీడియా వ్యవహరించిన తీరుపై ఆగ్రహం పెల్లుబుకుతోంది. దుబాయ్ మీడియా భారత మీడియాపై తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తోంది.

దుబాయ్‌కి చెందిన ప్రముఖ మీడియా సంస్థ ఖలీజ్ టైమ్స్ భారతీయ మీడియాపై దుమ్మెత్తిపోసింది. శ్రీదేవి మృతిపై భారతీయ మీడియా ప్రదర్శించిన తీరును తప్పు పడుతూ ఖలీజ్ మీడియా గురువారం ఓ వార్తాకథనాన్నే ప్రచురించింది.

 శ్రీదేవిని చంపింది...

శ్రీదేవిని చంపింది...

శ్రీదేవిని హత్య చేసింది భారతదేశం మీడియానే అని ఖలీజ్ టైమ్స్ తీవ్రంగా వ్యాఖ్యానించింది. ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ ఉన్న ఓ వ్యక్తి మరణంపై వాస్తవాలు తెలుసుకోకుండా అత్యుత్సాహం ప్రదర్శించిందని, అసత్య కథనాలను ప్రచారం చేసిందని భారతీయ మీడియాపై విరుచుకుపడింది.

 భారతీయుల పరువు తీసిన కథనం...

భారతీయుల పరువు తీసిన కథనం...

శ్రీదేవి మరణంపై భారత మీడియా వార్తాకథనాలను తప్పు పడుతూ భారతీయుల పరువును కూడా ఖలీజ్ టైమ్స్ బజారుకు ఈడ్చింది. భారతదేశంలోని చాలా మంది ఇళ్లలో బాత్ టబ్‌లు ఉండవని, వాటి గురించి వారికి తెలియదని అవహేళన చేసింది.

 వాస్తవమేమిటో తెలుసుకోకుండానే...

వాస్తవమేమిటో తెలుసుకోకుండానే...

శ్రీదేవి గుండెపోటుతో మరణించినట్లు తొలుత వార్తలు వచ్చాయి. గుండెపోటుతో కాకుండా స్పృహ కోల్పోయి ఆమె మరణించినట్లు తర్వాత వార్తలు వ్ాయి. తన హోటల్ గదిలోని బాత్ టబ్‌లో ప్రమాదవశాత్తు పడిపోవడం వల్ల చనిపోయిందని, దాని వెనక ఏ విధమైన నేరపూరిత కారణం లేదని దుబాయ్ పోలీసులు తేల్చారు. అయితే ఈ సంఘటనపై వాస్తవం ఏమిటో తెలుసుకోకుండానే శ్రీదేవి డెత్ మిస్టరీ అంటూ కథనాలు ప్రసారం చేయడాన్ని, బాత్‌టబ్‌లో సన్నివేశాలను చూపుతూ కథనాలు ప్రసారం చేయడాన్ని ఖలీజ్ టైమ్స్ తీవ్రంగా విమర్శించింది.

 సృజనాత్మకతకు పదును పెట్టి...

సృజనాత్మకతకు పదును పెట్టి...

దాదాపు అన్ని టీవీ చానెళ్లు తమ సృజనాత్మకకు పదును పెట్ి బాత్‌టబ్‌లో సీన్స్‌ను చిత్రీకరిస్తూ శ్రీదేవి మరణంపై వార్తాకథనాలు ప్రసారరం చేయడం పట్ల ఖలీజ్ టైమ్స్ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. సంఘటన జరిగినప్పటి నుంచి తమ సంస్థ ప్రతినిధులు వాస్తవ సమాచారాన్ని అందించేందుకు ప్రయత్నించారని, కానీ భారతీయ మీడియా తమ సమాచారాన్ని కూడా వక్రీకరిస్తూ తమకిష్టమైన రీతిలో కథనాలు ప్రసారం చేసిందని ఖలీజ్ టైమ్స్ అన్నది.

ఇలా కూడా చేస్తారా...

ఇలా కూడా చేస్తారా...

దుబాయ్‌లో శ్రీదేవి ప్రమాదవశాత్తు మరణించిందని స్పష్టంగా తేలినా కూడా కొంత మంది జర్నలిస్టులు ఆమె మృతి వెనుక రహస్యమంటూ కాస్మోటిక్ సర్జరీజులు, శరీరంలో ఆల్కాహాల్ ఛాు ఉన్నాయని కథలు అల్లడం తమకు ఆశ్చర్యాన్ని కలిగించినట్లు ఖలీజ్ మీడియా తెలిపింది. కొన్ని న్యూస్ చానెళ్లు శ్రీదేవి మరణం విషయంలో చేసిన ప్రసారాలు వెర్రితలలు వేసిందని అభిప్రాయపడింది.

English summary
Dubai news media Khaleez Times criticised Indian media for its reports on Bollywodd actress Sridevi's death.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X