వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శ్రీదేవి హత్య!: 'స్వామీ! ఇక తగ్గు', తల్లి చివరి చూపు కోసం కూతుళ్లు వెయిటింగ్, ఇంటి వద్ద భద్రత

|
Google Oneindia TeluguNews

దుబాయ్: సినీ నటి శ్రీదేవి మృతి కేసును మూసివేసినట్లు దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రకటించడం, ఫోరెన్సిక్ నివేదికలో లోపం లేదని తేల్చడంతో శ్రీదేవి భౌతికకాయాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.

Recommended Video

Sridevi Case Closed But Many Unanswered Questions Here ?

మృతిలో కొత్త కోణం, శ్రీదేవి కేసులో సంచలనం: తలపై తీవ్ర గాయాలు, ఎలా వచ్చాయి?మృతిలో కొత్త కోణం, శ్రీదేవి కేసులో సంచలనం: తలపై తీవ్ర గాయాలు, ఎలా వచ్చాయి?

శ్రీదేవి భౌతికకాయాన్ని అప్పగించడంపై అమర్ సింగ్ స్పందించారు. ఇప్పటికైనా మీడియా మిత్రులు, నా మిత్రుడు సుబ్రహ్మణ్య స్వామి తప్పుడు ఆరోపణలకు స్వస్తీ చెప్పాలని విజ్ఞప్తి చేశారు. అంతకుముందు స్వామి సంచలన ఆరోపణలు చేయడంతో అమర్ సింగ్ పైవిధంగా స్పందించారు.

దుబాయ్ నుంచి ముంబైకి

దుబాయ్ నుంచి ముంబైకి

శ్రీదేవి మృతదేహాన్ని దుబాయ్ విమానాశ్రయం నుంచి ముంబైకి తరలిస్తున్నారు. రాత్రి పది గంటల సమయంలో ముంబై చేరుకోనుంది. అనిల్ అంబానీకి చెందిన చార్టర్డ్ విమానంలో భౌతికకాయం తీసుకు వస్తున్నారు.

 అభిమానుల సందర్శనార్థం

అభిమానుల సందర్శనార్థం

బుధవారం మధ్యాహ్నం వరకు సన్నిహితులు, అభిమానుల సందర్శనార్థం శ్రీదేవి భౌతికకాయాన్ని ఉంచనున్నారు. ఆ తర్వాత ముంబైలోని పవన్ హాన్స్ స్మశానంలో మధ్యాహ్నం ఒకటి గంటల సమయంలో అంత్యక్రియలు నిర్వహించే అవకాశముంది.

శ్రీదేవి ఇంటికి అభిమానగణం

శ్రీదేవి ఇంటికి అభిమానగణం

దుబాయ్‌లోని ముహైస్నా కేంద్రం వద్ద శ్రీదేవి పార్థివ దేహానికి ఎంబామింగ్‌ ప్రక్రియ ముగియడంతో అప్పగించారు. తమ అభిమాన నటిని చివరిసారి చూసేందుకు, వీడ్కోలు పలికేందుకు ముంబైలోని ఆమె నివాసం వద్దకు అభిమానులు భారీ సంఖ్యలో చేరుకుంటున్నారు.

కట్టుదిట్టమైన పోలీసు భద్రత

కట్టుదిట్టమైన పోలీసు భద్రత

ఈ నేపథ్యంలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. శ్రీదేవి కుమార్తెలు ఖుషి, జాహ్నవిలతో పాటు ఇతర కుటుంబ సభ్యులు అనిల్ కపూర్‌ నివాసం వద్ద వేచి ఉన్నారు. వారితో పాటు చాలామంది అక్కడే వేచి చూస్తున్నారు.

 తెలుపు రంగు అంటే ఇష్టమంటూ

తెలుపు రంగు అంటే ఇష్టమంటూ

శ్రీదేవి చివరి కోరిక ఇదేనంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శ్రీదేవికి తెలుపు రంగు అంటే ప్రాణమని, తన అంతిమ యాత్ర అంతా తెలుపు రంగుతో మెరికి పోవాలనేది ఆకాంక్ష అని, ఇది ఆమె చివరి కోరిక అంటూ ప్రచారం సాగుతోంది.

English summary
The Dubai Police have cleared the release of Bollywood icon Sridevi’s body for the embalming process, ending her family’s two-day wait for bringing the body home for cremation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X