వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫోర్బ్స్ జాబితా: ఫుట్‌బాల్ దిగ్గజాలు మెస్సీ, రొనాల్డో

By Nageshwara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: 21వ శతాబ్ది ప్రారంభం నుంచి ఫుట్ బాల్ క్రీడలో భాగస్వామైన దూదూ ఒమాంగ్‌బేమీ తన కెరీర్‌లో అత్యధిక కాలం గడిపాడు. గోవా, డెంపో, సాల్గావోకార్, ఈస్ట్ బెంగాల్ క్లబ్‌ల్లో ప్రాతినిధ్యం వహించిన దుదూ.. తాజాగా చెన్నైయిన్ ఎఫ్ సి క్లబ్ సభ్యుడిగా చేరాడు. ఐఎస్ఎల్‌తోపాటు ఐ - లీగ్‌ను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని, అప్పుడే భారత్‌లో ఫుట్ బాల్‌కు ప్రాచుర్యం లభిస్తుందన్నాడు.

'ఐ - లీగ్, ఐఎస్ఎల్ మధ్య చాలా తేడాలు ఉన్నాయి. ఐఎస్ఎల్ మ్యాచ్ లను వీక్షించేందుకు వచ్చినట్లు ఫ్యాన్స్ ఐ - లీగ్ మ్యాచ్‌లను చూసేందుకు రావడం లేదు. దీనికి కారణమేమిటంటే వారంతా స్టార్ ఆటగాళ్ల తీరు, ఆటలో వారి శక్తి సామర్థ్యాలను చూడాలని కోరుకుంటున్నారు. కోల్ కతా మినహా మిగతా ప్రాంతాల్లో అభిమానులు మంచి ప్లేయర్లు ఆడుతున్నా ఐ - లీగ్ మ్యాచ్లను పట్టించుకోవడం లేదు' అని ఆందోళన వ్యక్తంచేశాడు.

'మీరు చాలా మంది క్వాలిటీ స్ట్రయికర్లు కలిగి ఉంటే అది చెప్పడానికి చాలా కష్టంగా ఉంటుంది. కొన్ని అవకాశాలు రాగానే వాటిని సద్వినియోగం చేసుకుని క్రితం సారి లక్కీగా నాలుగు గోల్స్ చేశాను. నాకు మరిన్ని అవకాశాలు లభిస్తే ఎక్కువ గోల్స్ చేయగలను. ఐ - లీగ్, ఐఎస్ఎల్ లలో విదేశీ ఆటగాళ్ల భాగస్వామ్యం విభిన్నమని తెలిపారు.

ప్రస్తుతం మీ జట్లలో యూరోపియన్, ఆఫ్రికా, సౌత్ అమెరికన్ దేశాలకు చెందిన మంచి ఆటగాళ్లు భాగస్వాములైతే.. ఆ టోర్నీ గొప్ప సవాల్ గా మారుతుంది' అని దుదూ వ్యాఖ్యానించాడు. ఐఎస్ఎల్ నిర్వహణకు అవసరమైన మౌలిక వసతుల కల్పన అభివ్రుద్ధి సరైన దిశలో సాగుతున్నదని, కనుక ఐఎస్ఎల్ మాదిరిగానే ఐ - లీగ్ టోర్నీకి ప్రాచుర్యం కల్పించాల్సిన బాధ్యత అఖిల భారత ఫుట్ బాల్ సమాఖ్య (ఎఐఎఫ్ఎఫ్) తీసుకుంటే మెరుగైన ఫలితాలు సాధించగలమని, భారత్ ఫుట్ బాల్ పురోభివ్రుద్ధి చెందుతుందని పేర్కొన్నాడు.

మౌలిక వసతుల కల్పన వల్ల తప్పనిసరిగా ఐఎస్ఎల్ పురోగతి సాధిస్తుందని అన్నాడు. మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారంతో గతంలో ఏనాడు రాకుకున్నా ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వస్తున్నదని, అభిమానులు స్టేడియంలకు వచ్చి మ్యాచ్ లను నేరుగా వీక్షిస్తున్నాడన్నాడు.

సమకాలీన ఆటగాళ్లు భాయిచుంగ్ భూటియా, సునీల్ ఛెత్రిల వల్ల భారత్ ఫుట్ బాల్ ప్రగతి సాధించగలుగుతుందన్నాడు. ఇండియన్ లెజెండ్స్‌కు సరి సమానంగా చెన్నై ప్లేయర్ జేజే లాల్పెఖౌ ఆడుతున్నాడని, వారిద్దరి లక్షణాలు ఆయనలో పుష్కలమని తెలిపాడు. గత కొన్నేళ్లుగా జెజె చాలా బాగా పుంజుకున్నాడని, ఈ ఏడాది భారత జాతీయ జట్టులో కీలక ఆటగాడవుతాడని విశ్వాసం వ్యక్తంచేశాడు.

ఇతర భారత ఆటగాళ్లు కూడా బాగానే పుంజుకున్నారని పేర్కొన్నాడు. ఆయా జట్ల కోచ్‌లు ఇండియన్ ప్లేయర్ల పట్ల సంకోచాలు పెట్టుకోకుండా వారిపై తమ ప్రణాళికలను అమలు చేయాలని సూచించాడు. తొలి రెండు ఐఎస్ఎల్ సీజన్లతో పోలిస్తే మూడో ఎడిషన్ ఐఎస్ఎల్ టోర్నీలో చాలా పురోగతి ఉన్నదని తెలిపాడు. కోచ్‌లు వారిపై నమ్మకం పెంపొందించుకోవాలని దూదూ ఆకాంక్షించాడు.

 Dudu Omagbemi - Jeje Lalpekhlua similar to Bhaichung Bhutia and Sunil Chhetri

ఐఎస్ఎల్‌లో ఎంట్రీ ఆహ్లాదకరం: అజ్రత్
ఐఎస్ఎల్ టోర్నీలో మరో యువ ఆటగాడు ఆరంగ్రేటం చేయనున్నాడు. కేరళ బ్లాక్ బస్టర్స్‌తో కాంట్రాక్ట్ కుదుర్చుకున్న అజ్రక్ మహమత్ శనివారం డిఫెండింగ్ చాంపియన్ చెన్నైయిన్ ఎఫ్ సితో జరిగే మ్యాచ్‌లో పాల్గొననున్నాడు. డిఫెన్స్ ప్రధాన అస్త్రంగా బరిలోకి దిగుతున్న మిడ్ ఫీల్డర్.. కేరళ బ్లాక్ బస్టర్స్‌కు సెంటర్‌లో కీలక పాత్ర పోషించనున్నాడు. 87 శాతం పాసింగ్ సామర్థ్యం గల అజ్రక్.. కేరళ మిడ్ ఫీల్డ్‌లో మెరుపులు మెరిపిస్తాడని అంతా భావిస్తున్నారు. ఇండియన్ సూపర్ లీగ్ టోర్నీలో ఆడటం తనకు ఆహ్లాదకరంగా ఉంటుందని వ్యాఖ్యానించాడు.

తనకు చాలా మంచి అనుభవం కాగలదని ఆశాభావం వ్యక్తంచేశాడు. జట్టు హెడ్ కోచ్ స్టీవ్ కొప్పెల్ అంతర్జాతీయంగా పెద్దపెద్ద టీంలను నడిపిన సామర్థ్యం గలవాడని, ఆయన ఆధ్వర్యంలో శిక్షణ పొందడం వల్ల ఆటతీరును మెరుగుపర్చుకోవచ్చునన్నాడు. రెండు ప్రధాన జట్ల మధ్య జరిగే మ్యాచ్‌లో విజయం సాధించడం ఫ్యాన్స్, ఆటగాళ్లకు ఎంతో ముఖ్యమని చెప్పాడు. ఈ టోర్నీలో గెలుపొందడం వల్ల తమ జట్టుకు మూడు పాయింట్లు కూడా కలిసి వస్తాయని గుర్తుచేశాడు. అభిమానులు ఎల్లవేళలా తమ కోసమే ఉన్నారని, తమకు ప్రోత్సాహాన్ని అందిస్తున్నారని, వారికోసం మ్యాచ్ లో గెలుపొందాల్సిన అవసరం ఉందన్నాడు.

ఫోర్బ్స్‌ సంపన్నుల లిస్ట్‌లో మెస్సీ, రొనాల్డో
స్పానిష్ ఫుట్ బాల్ లీగ్ జెయింట్స్ రియల్ మాడ్రిడ్ కీలక ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో, బార్సిలోనా ఆటగాడు లియానెల్ మెస్సీ మరో ఘనత సాధించారు. ప్రతియేటా ప్రపంచ సంపన్నులు, ప్రభావిత పారిశ్రామికవేత్తల జాబితాను ప్రకటించే ప్రముఖ ఫోర్బెస్ మరోసారి టాప్ క్రీడాకారుల జాబితా బయటపెట్టింది. టాప్ 10 జాబితాలో లియానెల్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డోలకు చోటు దక్కింది. మొత్తం 40 మంది అగ్రశ్రేణి క్రీడాకారుల జాబితాలో 19 మిలియన్ డాలర్ల ఆదాయంతో రియల్ మాడ్రిడ్ సంచలనం క్రిస్టియానో రొనాల్డో ఆరోస్థానం, బార్సిలోనా వ్యూహాత్మక ప్లేయర్ లియానెల్ మెస్సీ 15 మిలియన్ డాలర్లతో ఎనిమిదో స్థానంలో చేరారు.

స్విస్ టెన్నిస్ మాస్ట్రో తొలి స్థానంలో 17 సార్లు గ్రాండ్ స్లామ్ చాంపియన్ రోజర్ ఫెదరర్ 36 మిలియన్ డాలర్ల ఆదాయం పొందుతున్నాడు. టీం ఇండియా వన్డే జట్టు సారధి మహేంద్ర సింగ్ ధోనీ 11 మిలియన్ల డాలర్లతో 10 స్థానంలో నిలిచాడు. రెండో స్థానంలో బాస్సెట్ బాల్ సుప్రీం లెబ్రాన్ జేమ్స్ (34 మిలియన్ డాలర్లు), గోల్ఫ్ ప్లేయర్ ఫిల్ మిఖైల్సన్ (28 మిలియన్లు), అథ్లెటిక్స్ హీరో ఉస్సేన్ బోల్ట్ 25 మిలియన్ డాలర్లు), గోల్ఫ్‌లో టైగర్ వుడ్స్ (23 మిలియన్లు), బాస్కేట్ బాల్ నుంచి కెవిన్ దురంత్ (16 మిలియన్లు), గోల్ప్ ఆటగాడు రోరీ మైక్ ఐల్రాయ్ (13 మిలియన్ డాలర్ల) ఆదాయంతో టాప్ 10 జాబితాలో చోటు దక్కించుకున్నాడు.

టెన్నిస్ మాజీ ప్రపంచ నంబర్ వన్ ఫెదరర్ ఫోర్బ్ జాబితాలో చోటు దక్కించుకోవడం ప్రతియేటా జరుగుతూనే ఉన్నది. నైక్, రొలెక్స్, విల్సన్, మెర్సిడెస్ బెంజ్, క్రెడిట్ సూయిజ్, లిండ్ట్, జిల్లెట్, మొయల్ అండ్ చాందన్ తదితర సంస్థలకు ప్రచారకర్తగా ఉన్నాడు. ప్లేయర్స్ తమ జట్టు యాజమాన్యాల నుంచి పొందుతున్న కాంట్రాక్ట్ మొత్తం వారి ఆదాయం నుంచి మినహాయించిన తర్వాతే జాబితా ఖరారుచేశామని ఫోర్బ్స్ తెలిపింది. ఏడాది వేతనం, బోనస్ తదితర ఆదాయం, పెట్టుబడుల నుంచి వచ్చే ఆదాయాన్ని కూడా ఇందులో పరిగణనలోకి తీసుకోలేదు.

English summary
Dudu Omagbemi is no stranger to Indian football. Since the turn of the century, Dudu has spent the majority of his career in India, going on to become one of the most prolific scorers in Indian football.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X