వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వీడియో వైరల్ : ఢిల్లీని కమ్మేసిన ఇసుక తుఫాను... నగరవాసులకు ఎండవేడిమి నుంచి ఊరట

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ: ఓ వైపు వాయు తుఫాను గుజరాత్‌ను వణికిస్తుంటే మరోవైపు అధిక ఉష్ణోగ్రతలకు అల్లాడిపోయిన ఢిల్లీ వాసులను చల్లిటి వాతావరణం పలకరించింది. ఇసుక తుఫాను ఢిల్లీ ఎన్‌సీఆర్ ప్రాంతాన్నితాకడంతో ఆ పరిసరాలు చల్లబడ్డాయి. భారీ ఇసుక తుఫాను గురుగ్రామ్ నోయిడాలో కూడా కనిపించింది. ఇక బుధవారం రోజున ఢిల్లీలో బుధవారం ఉష్ణోగ్రత 43.4 డిగ్రీల సెల్సియస్ తాకినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇసుక తుఫానుతో ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానసేవలు కాసేపు నిలిచిపోయాయి. కొన్ని విమానాలని దారి మళ్లించారు.

ఇసుక తుఫాను ఢిల్లీ నగరాన్ని కమ్మేయడంతో పలువురు ఆ దృశ్యాలను తమ ఫోన్లలో బంధించారు. వెంటనే ఆ వీడియోను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడంతో వైరల్ అయ్యింది. అయితే ఇది వాయు తుఫాను ప్రభావం అని చాలామంది నెకటిజెన్లు అభిప్రాయపడ్డారు. అయితే వాయు తుఫాను గుజరాత్‌పై మాత్రమే ప్రభావం చూపుతుంది అని ఢిల్లీని తాకే అవకాశాలే లేవని మరికొందరు తెలిపారు. మంగళవారం ఢిల్లీలో అత్యధికంగా 44.5 డిగ్రీల సెల్సియస్ నమోదు కాగా...సోమవారం రోజున అత్యధికంగా 48 డిగ్రీల సెల్సియస్ రికార్డు కావడంతో రెడ్ అలర్ట్ ప్రకటించింది వాతావరణశాఖ.

Dust storm hits Delhi, drop in temperatures gives relief to citizens

ఈ గాలులు పశ్చిమ భారతం అంటే రాజస్థాన్ నుంచి వచ్చేవని అయితే దిశ మార్చకున్నాయని వాతావరణశాఖ అధికారి తెలిపారు. అందుకే ఉష్ణోగ్రతలు పడిపోయినట్లు ఆయన తెలిపారు. అందుకే రెండు నుంచి మూడు డిగ్రీల మేరా ఉష్ఱోగ్రతలు పడిపోయినట్లు వెల్లడించారు. ఇదే తరహా వాతావరణం ఉత్తర భారతంలో కూడా మరో మూడురోజుల పాటు కొనసాగుతుందని చెప్పారు. ఇదిలా ఉంటే రాజస్థాన్‌లో మాత్రం వడగాలులు తీవ్రంగా ఉన్నాయి. చురు ప్రాంతంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎడారి ప్రాంతం కావడంతో అక్కడ ఉష్ణోగ్రతలు 50 డిగ్రీల సెల్సియస్‌ను తాకాయి.

English summary
While western India braces itself for the impact of Cyclone Vayu, the national capital Delhi heaved a sigh of relief as a dust storm hit the Delhi NCR region, bringing down the blistering temperature in the city.The heavy dust storm was also witnessed in neighbouring Gurgaon and Noida.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X